చైతూ.. సమంత.. కీర్తిసురేష్

వీళ్ల ముగ్గురి మధ్య ఇప్పుడు ఓ కామన్ పాయింట్ క్రియేట్ అయింది.. దాదాపు ఒకే టైమ్ లో ఈ ముగ్గురూ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో అడుగుపెట్టారు. గేమ్స్ లో తమ ఆసక్తులు బయటపెట్టారు. Advertisement హీరోయిన్…

వీళ్ల ముగ్గురి మధ్య ఇప్పుడు ఓ కామన్ పాయింట్ క్రియేట్ అయింది.. దాదాపు ఒకే టైమ్ లో ఈ ముగ్గురూ స్పోర్ట్స్ ఫ్రాంచైజీల్లో అడుగుపెట్టారు. గేమ్స్ లో తమ ఆసక్తులు బయటపెట్టారు.

హీరోయిన్ సమంత, వరల్డ్ పికెల్ బాల్ లీగ్ లోకి ఎంటరైంది. ఈ లీగ్ లో చెన్నై టీమ్ కు ఆమె యజమానిగా వ్యవహరించనుంది. తను పెరిగి పెద్దయ్యే క్రమంలో క్రీడల ఆవశ్యకతను తెలుసుకున్నానని.. మూడేళ్ల వయసు నుంచే అమ్మాయిలు క్రీడలకు ఎలా దూరమౌతున్నారో తెలుపుతూ పోస్ట్ పెట్టింది. చెన్నై ఫ్రాంచైజీకి యజమానిగా వ్యవహరించనున్న సమంత.. ఇండియాను పికెల్ బాల్ స్వీప్ చేస్తుందని చెబుతోంది.

ఇక కీర్తిసురేష్ విషయానికొస్తే.. కేరళలో జరిగే కేరళ లీగ్ మ్యాచ్‌లలో పాల్గొనే తిరువనంతపురం జట్టుకు కీర్తి సురేష్ సహ-యజమాని అయింది. క్రికెట్‌కు భారత్‌తో పాటు సినీ పరిశ్రమలోనూ భారీ ఫాలోయింగ్ ఉంది. ఐపీఎల్ మ్యాచ్‌లకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో కేరళ అభిమానులను అలరించేందుకు వచ్చే నెల నుంచి కేరళలో ప్రత్యేక క్రికెట్ మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. ఐపీఎల్ టీమ్‌లకు స్టార్ నటులు ఓనర్‌గా వ్యవహరించినట్లే, తిరువనంతపురం జట్టుకు కీర్తిసురేష్ ఓనర్‌గా మారింది.

నాగచైతన్యకు కారు రేసులంటే ఇష్టం. ఇప్పుడా ఇష్టాన్ని మరోసారి బయటపెట్టాడు. ఇండియన్ రేసింగ్ లీగ్ లో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ కు ఓనర్ గా మారాడు చైతూ. మద్రాస్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ లో 24వ తేదీ నుంచి ఈ లీగ్ ప్రారంభమౌతుంది. బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కోల్ కతా టీమ్స్ తో హైదరాబాద్ బ్లాక్ బర్డ్స్ టీమ్ ఢీ కొట్టబోతోంది.

ఇలా ఒకే సీజన్ లో నాగచైతన్య, సమంత, కీర్తిసురేష్.. వివిధ రకాల టీమ్స్ కు యజమానులుగా మారారు. ఇండియాలో క్రికెట్ ను ప్రోత్సహించాల్సిన పనిలేదు. పికెల్ బాల్ లాంటి విలక్షణమైన క్రీడలకు, ఇండియన్ రేసింగ్ లీగ్ లాంటి అంతర్జాతీయ స్థాయి గేమ్స్ కు కచ్చితంగా ప్రోత్సాహం అవసరం.

12 Replies to “చైతూ.. సమంత.. కీర్తిసురేష్”

    1. ప్యాలస్ పులకేశి పెట్టిన కొత్త బిజినెస్సా ఇది?

      గ్రేట్ ఆంధ్ర లో ప్రతి చోటా ప్రచారం చేస్తున్నారు.

Comments are closed.