దిగజారుతారా? హుందా రాజకీయాలు చేస్తారా?

వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జెడ్పి పీఠంపై కూటమి జెండా ఎగిరితే ఆ కిక్కు వేరే ఉంటుందని అభ్యర్థిని మోహరించి తీరాలని పార్టీలోని కొందరు భావిస్తున్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు మరోసారి హుందా రాజకీయాలు చేయడానికి అవకాశం వచ్చింది. మరి ప్రలోభాల పర్వానికి తెరతీసి దిగజారుతారో లేదా హుందా రాజకీయాలు చేస్తాం అని గౌరవాన్ని నిలబెట్టుకుంటారో తేలని సందిగ్ధ పరిస్థితి ఇప్పుడు ఉంది. కడప జడ్పీ చైర్మన్ ఎన్నికకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో బలం లేని తెలుగుదేశం పార్టీ రంగంలోకి దిగుతుందా? లేదా? అనే సందేహం ప్రజల్లో ఉంది.

విశాఖ ఉమ్మడి జిల్లా స్థానిక సంస్థల ప్రతినిధుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం చివరిదాకా ప్రయత్నించిన సంగతి తెలిసిందే. తమకు బలం లేకపోయినప్పటికీ ఫిరాయింపులను నమ్ముకుని అభ్యర్థిని మోహరించాలని చివరిదాకా కసరత్తు చేసినప్పటికీ గణాంకాలు సరిపోకపోవడంతో ఓటమి తప్పదనే భయంతో వెనక్కి తగ్గారు. ముందు రోజు వరకు ప్రలోభాల కోసం తమ పార్టీ సీనియర్లతో ప్రయత్నాలు చేయించిన చంద్రబాబు నాయుడు, నామినేషన్ చివరి రోజున హుంందా రాజకీయాలు మాత్రమే చేదాం అనే ప్రకటనతో తమ వైఫల్యాన్ని కవర్ చేసుకున్నారు. అక్కడ వైసీపీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ ఏకగ్రీవంగా గెలిచారు.

ఇప్పుడు కడప జడ్పీ చైర్మన్ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. గతంలో ఈ పదవిలో ఉన్న ఆకేపాటి అమరనాథరెడ్డి ఈ ఎన్నికలలో రాజంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. దాంతో ఖాళీ అయిన పదవికి ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. 50 సీట్లు ఉన్న కడప జడ్పీ స్థానంలో వైసిపి 49 ని గెలుచుకుంది. ఒకరు రాజీనామా చేయగా ఒకరు మరణించారు. వారి బలం 47కు తగ్గింది.

ఎమ్మెల్యే ఎన్నికలకు ముందు ఒకరు భారతీయ జనతా పార్టీలోకి, నలుగురు తెలుగుదేశంలోకి ఫిరాయించారు. వైసీపీ బలం 42 అయింది. తాజాగా సన్నాహాల కోసం జగన్ మోహన్ రెడ్డి సమావేశం నిర్వహిస్తే పదిమంది సభ్యులు గైర్హాజరైనట్లు సమాచారం. వారందరూ కూడా తెలుగుదేశం పార్టీలో చేరుతారని అనుకున్నప్పటికీ.. వైసిపి బలం 32 అవుతుంది.

మొత్తం ఓట్లు 48 కాగా మ్యాజిక్ ఫిగర్ 25 గా ఉంది. కొత్తగా మరో 10 మంది తెలుగుదేశంలో చేరినా సరే కూటమి బలం 16 మాత్రమే అవుతుంది. ఇంకా 9 మంది సభ్యులు బలం కావాల్సి ఉంటుంది. అంతమందిని ఫిరాయింపజేసి తమ పార్టీలో చేర్చుకోగలరా లేదా అనేదానిమీద ఎన్నిక ఆధారపడి ఉంది.

ఫిరాయింపులపై నమ్మకం ఉంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించవచ్చు. లేదా, విశాఖ తరహాలోనే హుందా రాజకీయాలు చేద్దాం అంటూ పోటీ చేయకుండా మిన్నకుండిపోతుందని పలువురు అంచనా వేస్తున్నారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో జెడ్పి పీఠంపై కూటమి జెండా ఎగిరితే ఆ కిక్కు వేరే ఉంటుందని అభ్యర్థిని మోహరించి తీరాలని పార్టీలోని కొందరు భావిస్తున్నారు.

15 Replies to “దిగజారుతారా? హుందా రాజకీయాలు చేస్తారా?”

  1. నిన్ను ఇలాగే వదిలేస్తే అసలు హూందా రాజకీయాలకి స్పెల్లింగ్ నేర్పింది Leven గాడే అంటావ్.. కానీ నిజం ఏంటంటే

    “రాజకీయాలు అత్యంత నీచ స్థాయికి దిగజార్చి, జిగుప్సాకరంగా మార్చిన ఈడా హుందా రాజకీయాల గురించి మాట్లాడేది??

  2. పడుకున్న దాన్ని లేపి తన్నించుకోవడం అంటే ఇదే….పోటీ చెయ్యకుండా ఉంటె వైఫల్యం కప్పి పుచ్చుకోవడం చేతకాని తనం అంటారు….లేదు అని రాజకీయం చేస్తే జుట్టురా కుతంత్రం అంటారు….

  3. జారుడుబండ మీద కూర్చుని వ్యాసాలు రాసే ఎంకటే చెప్పాలి దిగజారుడు గురించి..

  4. సొంత బాబాయ్ ని చంపి దిగజారిన నీచుడు జగన్ రెడ్డి కి హుందాతనం అలవాటు చేయిస్తాడు , కడప జిల్లా నీచుడి సొంత జిల్లా కాదు

    1. ఎరా ఇంకా బ్రమ్మానందం మీ ఇంటికి వస్తున్నాడా….

      మీ నాన్న ఎవరో తెలియలేదా….

  5. క్రిమినల్స్, వెకిలి వెధవలని deal చేసేటప్పుడు high handedness కావాలి కానీ హుందాతనం ఏమి చేసుకుంటాం??

  6. దుష్టులను ఏ రకంగా ఓడించిన తప్పులేదని మహాభారతం లో శ్రీకృష్ణుడు దుర్యోధన వధ సందర్భం గ చెప్పాడు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేని వ్యక్తులను డీల్ చేసేటప్పుడు వాళ్లకు సరిపడే విధానాలను అనుసరించటం లో తప్పులేదు పింక్ డైమండ్ కమ్మ డీస్పీ లు నారసురా చరిత్ర 36 మందిని చంపేశారని ప్రచారాలు చేసే వాళ్ళతో న్యాయ పరం గ వెళ్ళితే చివరకు అసమర్దులుగా మిగిలి పోతారు ఇప్పటికి కూడా అవినీతి కేసులను బాబాయ్ హత్య కేసును కదలకుండా చేయగలుగుతున్నారంటే ఆయనకు హాట్స్ ఆఫ్ చెప్పాలి

Comments are closed.