తెలంగాణలో రుణమాఫీ తీవ్ర వివాదమైంది. రేవంత్‌రెడ్డి సర్కార్ ఆగస్టు 15వ తేదీ నాటికి ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి రైతు రుణాన్ని మాఫీ చేసినట్టు చెబుతోంది. అయితే రేవంత్‌రెడ్డి సర్కార్ పచ్చి అబద్ధం చెబుతోందని బీఆర్ఎస్ నేతలు ఘాటు విమర్శలు చేస్తున్నారు. రుణమాఫీ హామీ మాటను నిలబెట్టుకోకపోవడాన్ని నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా గురువారం బీఆర్ఎస్ నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా చేవెళ్లలో చేపట్టిన ధర్నాలో కేటీఆర్ ప్రసంగిస్తూ కాంగ్రెస్ సర్కార్‌పై దుమ్మెత్తి పోశారు. సీఎం రేవంత్‌రెడ్డి సొంత వూరు కొండారెడ్డిపల్లెలో రుణమాఫీ పూర్తి కాలేదని ఆరోపించారు. సంపూర్ణ రుణమాఫీ చేసే పరిస్థితి లేదని విమర్శించారు. స్వాతంత్ర్య దినం నాడు ఖమ్మం జిల్లాకు వెళ్లిన సీఎం వందశాతం రుణమాఫీ చేసినట్టు చెప్పాడన్నారు. ఇక్కడ రైతులు భగ్గుమన్నారని కేటీఆర్ చెప్పారు.
ఊరూరా రైతులు చావుడప్పు కొట్టడం మొదలు పెట్టాడన్నారు. రుణమాఫీపై తాను సవాల్ చేశానని ఆయన గుర్తు చేశారు. సీఎం మాటల్లో నిజం వుంటే, ఆయన సొంతూరు కొండారెడ్డిపల్లికి వెళ్దామని సవాల్ విసిరానన్నారు. సెక్యూరిటీ, అధికారులు ఎవరూ వద్దని, ఇద్దరం ఒకే కారులో కొండారెడ్డిపల్లికి వెళ్లి రైతుల వద్ద కూచుందామని సవాల్ విసిరినట్టు కేటీఆర్ గుర్తు చేశారు. నీ సొంత వూళ్లో వందశాతం రుణమాఫీ అయినట్టు రైతులు చెబితే, తాను రాజీనామా చేస్తానని రేవంత్‌రెడ్డికి చెప్పానన్నారు.
ఒక్క ఊళ్లో అయినా వందశాతం రుణమాఫీ అయినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్‌రెడ్డికి చెప్పానన్నారు. తన సవాల్‌పై రేవంత్ నుంచి సమాధానం, స్పందన లేదన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేసే వరకూ కాంగ్రెస్ సర్కార్‌ను విడిచి పెట్టొద్దని రైతులకు కేటీఆర్ పిలుపు ఇచ్చారు. రైతులు అధికారులు చుట్టూ తిరగడం కాదని, ఓట్లు వేయించుకున్నోళ్లను నిలదీయాలన్నారు.
దలితుదు CM కాలెధు …ఎం చెద్దాం
KG to PG free కాలెధు …ఎం చెద్దాం
Hyderabad ..istanbul కాలెధు …ఎం చెద్దాం
avineethi jarigithay thala narukko ledhu..
vc available 9380537747