పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన నాగ్

హైడ్రా ఇన్నాళ్లు చేసింది ఒకెత్తు. ఒక్క ఎన్-కన్వెన్షన్ విషయంలో చేసింది మరో ఎత్తు. ఓ స్టార్ హీరోకు చెందిన ప్రాపర్టీని నేలమట్టం చేసిన వ్యవహారం కావడంతో.. తెలుగు రాష్ట్రాల దృష్టి దీనిపై పడింది. ఇప్పుడీ…

హైడ్రా ఇన్నాళ్లు చేసింది ఒకెత్తు. ఒక్క ఎన్-కన్వెన్షన్ విషయంలో చేసింది మరో ఎత్తు. ఓ స్టార్ హీరోకు చెందిన ప్రాపర్టీని నేలమట్టం చేసిన వ్యవహారం కావడంతో.. తెలుగు రాష్ట్రాల దృష్టి దీనిపై పడింది. ఇప్పుడీ వివాదంపై నాగార్జున పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది. ఎప్పటికప్పుడు వివాదానికి సంబంధించి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారాయన.

కన్వెన్షన్ కూల్చివేతకు సంబంధించి సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు నాగ్. వాస్తవాల కంటే ఊహాగానానే ఎక్కువగా కనిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మరో చిన్న స్పష్టత కూడా ఇచ్చారు.

ఎన్-కన్వెన్షన్ నిర్మించిన భూమి పక్కా పట్టా ల్యాండ్ అని, ఒక్క సెంట్ కూడా ఆక్రమించలేదని స్పష్టం చేస్తూనే.. ఇదే విషయాన్ని గతంలో స్పెషల్ కోర్టు ప్రస్తావించిందని చెప్పుకొచ్చారు. ఎన్-కన్వెన్షన్ కు ఆనుకొని ఉన్న తుమ్మిడికుంట చెరువు ఆక్రమణకు గురికాలేదని.. 2014, ఫిబ్రవరి 24న స్పెషల్ కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందంటూ ఆర్డర్ కాపీ నంబర్ ను కూడా బయటపెట్టారు నాగ్.

నిర్మాణం చట్టబద్ధతపై తీర్పు కోసం హైకోర్టును ఆశ్రయించామని, ఈలోగా అవాస్తవాలు నమ్మొద్దని ఆయన కోరారు.

కన్వెన్షన్ కూల్చివేసిన వెంటనే స్పందించారు నాగ్. చట్ట విరుద్ధంగా, తప్పుడు సమాచారంతో తనకు చెందిన నిర్మాణాన్ని కూల్చివేశారని.. దీనికి సంబంధించి తనకు ఎలాంటి నోటీసులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు.

ఎన్-కన్వెన్షన్ కు సంబంధించి నాగార్జునపై సోషల్ మీడియాలో నెగెటివ్ గా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో… ఆయనిలా పూర్తిస్థాయిలో రంగంలోకి దిగారు. ఎప్పటికప్పుడు మీడియాలో వస్తున్న వార్తల్ని తనదైన శైలిలో పరోక్షంగా ఖండించే ప్రయత్నం చేస్తున్నారు.

హైదరాబాద్ నడిబొడ్డున, హైటెక్ సిటీకి అత్యంత సమీపంలో, వందల కోట్ల రూపాయల విలువ చేసే ఈ ఆస్తిని కాపాడుకునేందుకు తన సర్వశక్తులు ఒడ్డుతున్నారు నాగార్జున. పుకార్లు, అవాస్తవాలు నమ్మొద్దని, విషయం కోర్టు పరిథిలో ఉందని పదేపదే గుర్తుచేస్తున్నారు.

17 Replies to “పూర్తి స్థాయిలో రంగంలోకి దిగిన నాగ్”

  1. బంజరు, ప్రభుత్వ భూములకు పట్టాలు పుట్టించడం, రిజిస్ట్రార్లు కు వెన్నతో పెట్టిన విద్య, కానీ దానికి సంబందించిన లింక్ డాకుమెంట్స్ లో యాజమాన్య హక్కులు సంక్రమించకపోతే అటువంటి రెజిస్ట్రేషన్స్ చెల్లవు. చెరువుల ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్ లలో నిర్మాణాలకు ప్రజలు, కోర్ట్స్ సమర్ధన ఉండకూడదు. సాటిలైట్ పిక్చర్స్ లో N కన్వెన్షన్ సెంటర్ చెరువు గట్టుకు చేర్చి వుంది, ఇతను అది యాజమాన్య హక్కు ద్వారా వచ్చింది అనేది నమ్మశక్యంగా లేదు.

    1. anyone who had gone to N Convention can clearly see that Retention Wall is in the lake bed. If he is not corrupt, the case should have solved by now. Why he intentionally kept the case under the wrap, Court gave a stay and not the judgement.

  2. పూర్తి స్థాయిలో రంగంలోకి దిగితే ఏమవ్వుద్ది కోర్ట్ తీర్పు మారిపోతదా ? ఇంకా ఎంతకాలం ఇలా చూస్తూ ఊరుకోవాలి ? కబ్జా చేసిన భూమి తిరిగి మల్ల ఇచ్చేస్తారా కబ్జా చేసుకోవచ్చు అని ?

    1. అరె ముండా అదే రా నాగార్జున కూడా చెప్పేది కోర్ట్ అల్ రెడీ చెప్పింది.అది కబ్జా స్థలం కాదు అని. ఆర్డర్ కాపీ తో సహా బయటపెట్టి చూపించారు కళ్ళు దెంగాయ. ఎవడైయితే కూల్చాడో వాడితోనే కట్టిస్తాడు నాగార్జున చూస్తూ వుండండి

  3. రేవంత్ రెడ్డి కి నాగార్జున కి గొడవలు వున్నాయి కెసిఆర్ తో స్నేహం గా ఉండటం కూడా ఒక కారణం కుళ్ళతో పాడగొట్టారు. వాళ్ళతోనే మళ్ళీ కట్టించి చూపిస్తాడు nag wait

    1. నీచుడు నాగ్ ఏంటో మంది అమ్మాయిల జీవితాలని నాశనం చేసాడు , ఇప్పుడు వాడి కి కర్మ రిటర్న్స్ , ముక్కోడితో , నీచుడు జగన్ రెడ్డి తో చీకటి వ్యాపారాలు చేసి ఎదవయ్యాడు

  4. జగనన్నకు నా సలహా ఏంటంటే

    ఈ ఆరికట్ల ముం డ ను కొంచం మూసుకోమని చెప్పు

    లోటస్ పాండ్ కి ఎసరు పేటే లాగా ఉన్నాడు .

    (బుల్డోజర్ సీఎం జిందాబాద్)

  5. Open heart with RK లో అప్పట్లో చెప్పారు కదా I am corrupt అని .. పైగా జగన్ లాంటి ఆ ర్ధి క నే రా లు చేసి జై ల్ లో ఉన్నోడికి సపోర్ట్ … ఇంకెవరు నమ్ముతారు

Comments are closed.