తొలిసారి నాని నోట… ఆ మాట

హీరో నాని మంచి సబ్జెక్ట్ లు ఎంచుకుని సినిమాలు చేస్తారు. అందులో అణుమాత్రం సందేహం లేదు. అలా చేసిన సినిమాలు అన్నీ నిర్మాతలకు అక్కడికక్కడ సరిపోవడమో, కొద్దిగా లాభం రావడమో జరుగుతూ వుంటుంది. కానీ…

హీరో నాని మంచి సబ్జెక్ట్ లు ఎంచుకుని సినిమాలు చేస్తారు. అందులో అణుమాత్రం సందేహం లేదు. అలా చేసిన సినిమాలు అన్నీ నిర్మాతలకు అక్కడికక్కడ సరిపోవడమో, కొద్దిగా లాభం రావడమో జరుగుతూ వుంటుంది. కానీ అలా కాస్త లాభం వచ్చినా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు వెనక్కు ఇవ్వడం అన్నది కామన్ ప్రాక్టీస్. ఇది నాని ఒప్పుకోకపోవచ్చు, నాని ఫ్యాన్స్ కు కోపం రావచ్చు. నిర్మాతల చేత, నో అది రాంగ్ అని నిర్మాతల చేత స్టేట్ మెంట్లు ఇప్పించవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్.

నిన్నటికి నిన్న నాని ఓ మాట అన్నారు. తన సినిమా శనివారం నాది ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో. కాలం కలిసి వస్తే, బయ్యర్లు, ఎగ్జిబిటర్లకు అన్ని విధాలా కలిసి వచ్చే సినిమా వస్తుందని, అలాంటి సినిమానే ఇది అని అన్నారు. ఇప్పుడు ఈ మాట నాని ఎందుకు అనాల్సి వచ్చింది అన్నది క్వశ్చను. నిర్మాతకు లాభం ఇచ్చే సినిమా అని ఏ హీరో అయినా అనడం కామన్. కానీ ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడే సినిమా అని నాని ఎందుకు అనాల్సి వచ్చింది?

దసరా, నాన్న ఇంకా మరి కొన్ని సినిమాలకు బయ్యర్లు లాభపడలేదు. ఇది నాని దృష్టికి వచ్చే వుంటుంది. అందువల్లనే ఈ సారి అలాంటి పరిస్థితి రాదు అని ఇలా భరోసా ఇచ్చి వుండొచ్చు. సరిపోదా సినిమాను ఎపి.. సీడెడ్… నైజాం.. కర్ణాటక కలిపి 25 కోట్లకు కాస్త అటు ఇటుగా నిర్మాత దిల్ రాజు తీసుకున్నారు. తరువాత దిగువకు ఇచ్చారు. ఈమేరకు వసూళ్లు వుంటే నాని చెప్పిన కలిసి వచ్చే కాలం అన్న మాట అక్షర సత్యం అవుతుంది.

6 Replies to “తొలిసారి నాని నోట… ఆ మాట”

  1. రామోజీ ఫిల్మ్ సిటీ అక్రమాలు హైడ్రాకు కనపడవా? చెరువులు కాదు ఊళ్ళకు ఊళ్లే కబ్జా చేశారు

Comments are closed.