భయాలు.. పరారీలు.. వైట్ కాలర్ ఫ్యాక్షన్

ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ఎన్ని పార్టీలు అధికారం కోసం సమరాంగణంలో తలపడినప్పటికీ.. ఒక్కరిని మాత్రమే విజయం వరిస్తుంది. వారు అధికార పీఠం మీదికి వస్తారు. మిగిలిన పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఎన్నడైనా…

ప్రజాస్వామ్యంలో ప్రధానంగా ఎన్ని పార్టీలు అధికారం కోసం సమరాంగణంలో తలపడినప్పటికీ.. ఒక్కరిని మాత్రమే విజయం వరిస్తుంది. వారు అధికార పీఠం మీదికి వస్తారు. మిగిలిన పార్టీలు ప్రజాక్షేత్రంలో ఉండాలి. ప్రభుత్వంలోకి వచ్చిన పార్టీ ఎన్నడైనా గాడితప్పి వ్యవహరిస్తూ ఉంటే.. వారిని అప్రమత్తం చేయాలి. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా, బాధ్యతలేకుండా వ్యవహరిస్తూ ఉంటే.. ప్రజల తరఫున పోరాటాలు చేయాలి. తద్వారా ప్రజల్లో నమ్మకాన్ని పెంచుకోవాలి. అధికారంలో ఉన్నవారు.. తాము నిరంతరం ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికే కట్టుబడి ఉన్నామని నిరూపించుకుంటూ ముందుకు సాగాలి. వీరిలో ఎవరు ఎక్కువగా ప్రజలను మెప్పించగలుగుతారో.. వారు ఆ తర్వాత ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించాలి. ఇది మన ఎరిగిన ప్రజాస్వామ్య సంస్కృతి.

కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి?.. ఒక పార్టీ అధికారంలోకి రాగానే రెండో పార్టీ వారిని భయపెడుతుంది. వారి మీద కేసులు పెట్టి వేధిస్తుంది. వారందరూ భయంతో ఉన్న ఊర్లు, రాష్ట్రం, దేశం విడిచి పరారైపోతారు. అజ్ఞాతంలో బతుకుతూ ఉంటారు. ఏదో ఒక నాటికి తమ పార్టీ మళ్లీ అధికారంలోకి రాకపోతుందా అని చూస్తుంటారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే తిరిగి వచ్చి ఊర్లలో వాలుతారు. అప్పటిదాకా తమను వేధించిన వారిని వెంటాడుతారు. తరిమి కొడతారు. వారు పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లే పరిస్థితిని కల్పిస్తారు. ఇక తమదే రాజ్యం అన్నట్టుగా చెలరేగి పోవడం ప్రారంభిస్తారు. ఇది ఇప్పుడు జరుగుతున్న వ్యవహారసరళి. ఫలానా పార్టీ మాత్రమే ఇలా చేస్తున్నదని నిర్దిష్టంగా నిందలు వేయడానికి వీల్లేదు. అయితే ఇలా, తమ ప్రత్యర్ధులను భయపెట్టడం, పరారయ్యేలా చేయడం అనేది ఒక నయా సంస్కృతి లాగా వేళ్ళూనుకుంటున్నదని మాత్రం కచ్చితంగా చెప్పవచ్చు. ఇలాంటి విష సంస్కృతి ప్రబలితే పర్యవసానాలు ఎలా ఉంటాయి? శాంతియుత వాతావరణం మళ్లీ నెలకొనడం అనేది ఏనాటికైనా సాధ్యమవుతుందా? ఆలోచనాపరులను మధనపెట్టే ప్రశ్నలివి. ఈ ప్రశ్నలకు జవాబులను అన్వేషించే ప్రయత్నమే.. ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘భయాలు.. పరారీలు.. ఇదేనా నయా సంస్కృతి’!

ఆధునిక సామాజిక వాతావరణం ప్రశాంతత మధ్య సాగడం లేదు. రాజకీయ విభేదాలు కేవలం విధానాల పునాదుల మీద మాత్రమే ఉంటాయి అనుకునే భావనలకు కాలం చెల్లుతోంది. రాజకీయ విభేదాలు వ్యక్తిగత వైషమ్యాలుగా, కక్షలుగా రూపుమార్చుకుంటున్నాయి. ఒకపట్లో రాజకీయ విభేదాలు కేవలం పార్టీల సిద్ధాంతాల మీద ఉండేవి. ఆయా సిద్ధాంతాలకు ప్రజలలో ఉండే చెల్లుబాటు, నమ్మకం మీద మాత్రమే వారు అధికారంలోకి వచ్చేవారు. ఆ సిద్ధాంతాల మీదనే పోరాటాలు కూడా జరిగేవి. అలాంటి సిద్ధాంతాల బలం కలిగిన పార్టీలు ఇప్పటికీ ఒకటి రెండు ఉన్నాయి. ఖర్మ ఏమిటంటే, వారు కూడా తమ మూలాలను మరచి నవతరం రాజకీయం మాత్రమే చేస్తున్నారు. కొత్తగా పుడుతున్న పార్టీలు సిద్ధాంత బలంతో కాకుండా అధికార దాహంతో వస్తున్నాయి. ఇది భయావహ పరిణామం. అధికారం కోసం మాత్రమే పుడుతున్న పార్టీలు, అందుకోసం ఏ దారులైనా తొక్కవచ్చు.. ఏమైనా చేయవచ్చు అనే ప్రమాణాలను స్థిరీకరించుకుంటున్నాయి. వెరసి సామాజిక వాతావరం అతలాకుతలం అవుతోంది.

ఇలాంటి పోకడలు అచ్చంగా ఇప్పుడే పుట్టాయని చెప్పలేము. ఎప్పుడు పుట్టాయో ఇతమిత్థంగా తేల్చడమూ కష్టమే! చాప కింద నీరు లాగా విస్తరిస్తూ.. పాలకుండలో విషపు చుక్కలాగా ఈ పోకడలు సామాజిక ప్రశాంతతను నాశనం చేసేశాయి. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ ప్రత్యర్థిని భయపెట్టడం అనేది ఒక అలవాటుగా చేసుకుంది. ప్రత్యర్ధులు కూడా మెచ్చుకునేలా పరిపాలన సాగించాలని తపన పడవలసిన స్థానంలో.. ప్రత్యర్ధులు నోరెత్తడానికి అవకాశం ఇవ్వని పాలకులు తయారవుతున్నారు.

చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద మాత్రమే వేస్తున్న నింద కాదు ఇది. జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగించిన రోజులలో కూడా ఇలాంటి బరితెగింపు పోకడలు మనకు కనిపించాయి. అలాగని ఆయనే వీటికి ఆద్యుడు అనడానికి కూడా వీల్లేదు. ఎప్పటినుంచో గ్రామీణ జీవనాన్ని ఛిద్రం చేసేస్తూ వచ్చిన ఒక రకమైన విష సంస్కృతికి ఇదంతా కూడా ఆధునిక, ప్రజాస్వామిక, రాజకీయ రూపం అని అర్థం చేసుకొని మనలో మనం దిగులుపడవలసిందే తప్ప మరో మార్గం లేదు.

విస్తరించిన పురాతన సంస్కృతి.. ఒక ఫ్యాషన్!

పైన చెప్పుకున్న ఆవేదన యావత్తూ అచ్చంగా ఫ్యాక్షన్ ముఠా కక్షలు బలంగా ఉండే ప్రాంతాల్లో కొన్ని శతాబ్దాల నుంచి ఉన్న వాతావరణం. మనకు తెలిసినంతవరకు ఫ్రాక్షన్ ప్రభావం బాగా రాజ్యమేలిన గ్రామాలలో బాంబులు విసురుకోవడం, కత్తులతో నరుక్కోవడం అనేది అలవాటుగా చలామణి అయ్యేది. ఏ సమయానికి ఏ ముఠా బలంగా ఉంటుందో వారి ‘కత్తి పెత్తనమే’ సాగుతుండేది! రెండో ముఠా వారందరూ పరారీలో ఎక్కడెక్కడో అజ్ఞాతంగా బతుకుతూ ఉండేవారు. అలాగని మొదటి ముఠా నిశ్చింతగా ఉంటుందని కాదు.

ఏ క్షణాన ఎటు వైపు నుంచి తమ మీద దాడి జరుగుతుందో అనే భయం వారిలో కూడా ఉండేది! జీవితాలు నిత్యం భయానికి- పరారీకి మధ్య ఊగిసలాట లాగా మాత్రమే సాగుతుండేవి. ఇదీ ఫ్యాక్షన్ గ్రామాల వాతావరణం. ఫ్యాక్షన్ లను రూపుమాపేశాం అని మనం అనుకున్నాం. ముఠా కక్షలు తొలగిపోయాయి అని కూడా చాటుకున్నాం. కత్తులు, వేట కొడవళ్ళు, బాంబులు ఇప్పుడు గ్రామాలలో ప్రతి ఇంటిలోనూ దాచుకునే వ్యక్తిగత సంపదలాగా ఉండడం లేదని సంతోషించాం. కానీ ఆ ఫ్యాక్షన్ సంస్కృతి మూలాలను మన సమాజంలో నుంచి, అధికార పీఠాన్ని కోరుకునే నాయకుల ఆలోచనలోంచి సమూలంగా తొలగించడంలో మనం విఫలం అయ్యాం.

ఫ్యాక్షన్ భూతం కొత్త వేషం వేసుకున్నది. అది రాజకీయంతో భుజాల మీద చేతులు వేసుకొని చెట్టపట్టాలుగా సాగుతూ స్నేహం చేస్తున్నది. ఎటువైపు సందు దొరికితే అటువైపు విస్తరిస్తున్నది. వైట్ కాలర్ ఫ్యాక్షన్ సమాజంలో ఒక కొత్త సంస్కృతిగా ఏర్పడుతున్నది. నాగరిక సమాజం సిగ్గుపడవలసిన సంగతి ఇది. కానీస్వార్థ, సంకుచిత వైఖరులతో సాగిపోయే నాయకులు మాత్రం ఇలాంటి వైట్ కాలర్ ఫ్యాక్షన్ పోకడలకు పాదులు కట్టి పెంచి పోషిస్తున్నారు. ఎందుకంటే ఇలాంటి విష సంస్కృతి చలామణిలో ఉంటే మాత్రమే తమకు మనుగడ ఉంటుందని వారు భావిస్తున్నారు. సమాజం అంతా ప్రశాంతంగా ఉంటే ప్రజల కోసం నిజంగానే పనిచేయాల్సి వస్తుంది. భయాల నయా ఫ్యాక్షన్ భూతం పడగ నీడలో సమాజాన్ని ఉంచినంతవరకు ప్రజల కోసం పనిచేయడం అనేది ద్వితీయ ప్రాధాన్యం అవుతుంది! ఇలాంటి వ్యూహాత్మక కుట్రలు ఆధునిక సమాజాన్ని నడిపిస్తూ ఉండడం బాధాకరమైన పరిణామం.

నాయకులంతా పరారీలో లేదా భయంలో..!

తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. ఎన్నికల కౌంటింగ్ రోజున ఆ పార్టీ గెలుపు సంకేతాలు బయటకు వచ్చినప్పటి నుంచి అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదృశ్యం అయ్యారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వారిలో చాలామంది మీద అప్పటికే కొన్ని కేసులు ఉన్నాయి.. మిగిలినవారు కొత్తగా తమ మీద కేసులు బనాయిస్తారని భయపడ్డారు. మొత్తానికి నాయకులైతే పరారయ్యారు. ఇలాంటి వారిలో మాచర్ల ప్రాంతానికి చెందిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకటరామిరెడ్డి కూడా ఒకరు. ఎలక్షన్ సందర్భంగా జరిగిన అల్లర్లు, వివిధ ఘటనలకు సంబంధించి పిన్నెల్లి సోదరుల మీద కేసులు ఉన్నాయి. రామకృష్ణారెడ్డి అరెస్టు అయ్యారు కానీ ఆయన సోదరుడు వెంకటరామిరెడ్డి ఇప్పటికీ పరారీలోనే ఉన్నారు.

తెలుగుదేశం పరిపాలన ప్రారంభించిన తర్వాత.. గత ఐదేళ్లలో తమను వేధించారని, తమను ఇబ్బంది పెట్టారని భావించిన ఒక్కరొక్కరి మీద కేసులు పెట్టడం మొదలైంది. క్రియాశీల రాజకీయ నాయకుల మీద కేసులు పెట్టడం చాలా సులువు. వారు నిత్యం ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు. వివాదాలు వారి చుట్టూ ముసురుకోవడం వింత కాదు. కాబట్టి అందరి మీద కేసులు నమోదు అవుతున్నాయి. కేసుల భయంతో కొందరు ముందుగానే పరారైపోయారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా ఈ జాబితాలో ఉండడం గమనార్హం. ఆయన మీద కూడా కేసులు నమోదయ్యాయి. ఆయన ఆచూకీ మాత్రం ఇప్పటిదాకా తెలియడం లేదు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడికి ప్రయత్నించినందుకు కేసు నమోదు అయిన వైసీపీ నేత దేవినేని అవినాష్ కూడా హైదరాబాదు ఎయిర్పోర్ట్ నుంచి దుబాయికి వెళుతుండగా పోలీసులు ఆపి వెనక్కు పంపినట్లుగా కూడా వార్తలు వచ్చాయి.

అలాగని పరారు కాకుండా పౌర సమాజంలో ఉన్న నేతలందరూ నిర్భయంగా ఉన్నారని చెప్పడానికి వీల్లేదు. పరారీనే బెటర్ అనిపించేంత నిత్య భయంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సాగిన రోజుల్లో ప్రభుత్వానికి ప్రధాన సలహాదారుగా వ్యవహరించి, సకల శాఖల మంత్రిగా విమర్శలు ఎదుర్కొన్న కీలక నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి, మాజీ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ ఎంపీ నందిగం సురేష్ తదితరులు అందరూ ముందస్తు బెయిల్ తీసుకుని తిరగ గలుగుతున్నారు. వీరిని ఇప్పటికీ అరెస్టు భయం వెన్నాడుతూనే ఉంది. విచారణకు సహకరించడం లేదు అనే కారణాలు చూపి అయినా సరే వీరిని అరెస్టు చేసి జైల్లో పెడతారనే అనుమానాలు కూడా ప్రజల్లో ఉన్నాయి.

ఇది అచ్చంగా వేధింపుల వాతావరణం. ముందే చెప్పుకున్నట్టు కేవలం చంద్రబాబు నాయుడును నిందించాల్సిన అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో తెలుగుదేశం వారిని కేసుల పేరిట అరెస్టు చేసి ఎలా వ్యవహరించారో ప్రజలకు తెలుసు. ఇప్పుడు అంతకంటే దారుణంగా తమ మీద కక్ష తీర్చుకుంటారు అనే భయంతోనే వీరందరూ సతమతమవుతున్నారు.. పరారు కావడానికి కూడా వెనుకాడడం లేదు. ముందే చెప్పుకున్నట్టు ఈ విష సంస్కృతి జగన్ ప్రారంభించినది కూడా కాదు.

రాజకీయ ప్రత్యర్థులను వ్యక్తిగత శత్రువుల లాగా చూడడం అనేది తెలియకుండానే మన నాయకుల మెదళ్లలోకి వచ్చేసింది. ఒకరిని చూసి ఒకరు వేధించే మార్గాల్లో డోసేజీ పెంచుకుంటూ పోతున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఒక తీరుగా వ్యవహరిస్తే.. రేపు మళ్లీ జగన్ చేతికి అధికారం వస్తే గనుక ఇదే తరహా భయపెట్టే వేధించే వ్యవహారాలు మరింతగా శృతి మించుతాయని మనం అనుకోవచ్చు.

ఇదంతా వైట్ కలర్ ఫ్యాక్షన్ అని ముందే చెప్పుకున్నట్లుగా ఆచరణలో అనేక నిదర్శనాలు మన కళ్ళముందు ఉన్నాయి. ఇప్పుడు హత్యలు జరగడం లేదు.. లెక్కకు మిక్కిలిగా కేసులు పెట్టి వ్యక్తిత్వ హననాలు మాత్రమే జరుగుతున్నాయి! వేటకొడవళ్ళు, కత్తులు, గొడ్డళ్లు కనిపించడం లేదు.. విచ్చలవిడిగా ఐపీసీ సెక్షన్ల కింద నమోదు అవుతున్న కేసులో మాత్రమే ఆ పాత్ర పోషిస్తున్నాయి! బాంబులు వేయడం లేదు.. పక్కాగా కేసులలో ఇరికించగల నిందలు మాత్రమే మోపబడుతున్నాయి!! ఈ వ్యవహారాలను నయాఫ్యాక్షన్ గా గుర్తించకుండా ఎలా ఉండగలం?

చంద్రబాబు నుంచి పరిష్కృతి ఆశించగలమా?

భవిష్యత్తు సామాజిక ముఖచిత్రాన్ని ఊహించుకోవాలంటేనే ప్రతి ఒక్కరిలోనూ ఒక భయాన్ని పుట్టించేటువంటి ఈ విష వాతావరణం పరిష్కారం చంద్రబాబు నాయుడు నుంచి మనం ఆశించగలమా అనేది ఒక ప్రశ్న. ఇలాంటి ప్రశ్న వేసుకోగానే.. చంద్రబాబు నాయుడు నుంచి మాత్రమే ఎందుకు? వైయస్ జగన్మోహన్ రెడ్డి అలాంటి పని చేసి ఉండవచ్చు కదా! పరిష్కారం చూపి ఉండవచ్చు కదా? అనే అడ్డ సవాళ్లు కూడా ఎదురవుతాయి. కానీ చంద్రబాబు నుంచి పరిష్కారం ఆశించడానికి కారణాలు కూడా ఉన్నాయి.

చంద్రబాబు నాయుడు నాలుగున్నర దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత.. ఇప్పుడు కనిపిస్తున్న విష సంస్కృతి ఇలాగే ప్రబలడం వలన భవిష్యత్తు రాజకీయాలు ఎంత ఘోరంగా ఉంటాయో ఆయన చిటికెలో ఊహించగలరు. పైగా తన రాజకీయ వారసుడిగా కొడుకు, ఆ తర్వాత మనవడు కూడా రాష్ట్ర రాజకీయాలలో సుదీర్ఘ ప్రస్తానం సాగిస్తూ ఉండాలని కోరుకునే నాయకుడు ఆయన. ఆయనకున్న అనుభవం రీత్యా పరిణతి కూడా ఎక్కువే ఉండాలి. అలాంటి వారి నుంచే మనం పరిష్కారాలు ఆశించగలం.

ఈ పోకడలకు పరిష్కారం ఒకే ఒక్కటి. ఎక్కడో ఒకచోట వేధింపు రాజకీయాలు ఆగాలి. ఇప్పటిదాకా పెట్టిన కేసులు తీసుకుంటున్న చర్యలు విచారణలు ఇవన్నీ ఒక ఎత్తు. ఇక మీదట ఆయన ప్రస్తుత ప్రభుత్వం కొంత సంయమనం పాటించాలి. అలాంటప్పుడు ఐదేళ్ల తర్వాత ప్రభుత్వం మారినా సరే.. వారిలో కూడా కొంత వివేకం వివేచన వస్తాయని మనం ఆశించవచ్చు. అలాకాకుండా ఒకరిని చూసి ఒకరు మరింతగా డోసేజీ పెంచుకుంటూ వేధింపులకు పాల్పడుతూ కేసులు పెడుతూ సాగుతూ ఉంటే.. ముందు ముందు ఏం జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు.

..ఎల్. విజయలక్ష్మి

73 Replies to “భయాలు.. పరారీలు.. వైట్ కాలర్ ఫ్యాక్షన్”

  1. ప్రభుత్వ సొమ్ముని అడ్డకోలు గా దోచుకుని, తరాలు తిన్న తరగని ఆస్థి కూడబెట్టుకుని కులుకుతూ ఉంటే, వాళ్ళని దయ తలచి వదిలేద్దాం అని చిలక పలుకులు పలికితే ఎలా? చట్ట పరమైన చర్యలు ప్రజలు కోరుకుంటున్నారు, పారిపోతే వాళ్ళ ఆస్తులు అటాచ్ చెయ్యడమే మార్గం. దీనికి కక్ష అను పేరు పెట్టి చట్టాన్ని అవహేళన చెయ్యకూడదు.

  2. యేటి అక్కయ్య, ఎలా ఎలా..

    జగన్ చేసిన చండాలం లో అతనిని వేలెత్తి చూపడానికి లేదా? వాళ్లని వదిలేసెయ్యాల అని అంటావ్,

    ఆపరేషన్ చేసినున్న అచ్చెన్న నీ , గతుకుల రోడ్డు మీద డొక్కు జీప్ లో పడేసి వికటాట్టాసం చేసిన ప్యాలెస్ పులకేశి నీ వదిలి పెట్టఆల్లా? నిన్ను కూడా అలానే చేసి వుంటే, ఒక్కసారి ఊహించుకో?

    రంగనాయకమ్మ గారి జీవనో పాదినైన హోటల్ నే ఆమె దగ్గర నుండి లేగేసుకున్నారు . మర్చిపోయి వదిలేయాలి అంటావా ప్యాలస్ పులకేశి గాడిని.

    చంద్రబాబు మాత్రం అమాంతం ఇవన్నీ మాయం చేసెయ్యల్ల!

  3. ఈ నీతి సూత్రాలు అప్పట్లో చెప్పలేదే! తమరు కూడా మీ యజమాని వేసినన బిచ్చం తీసుకుని ప్యాలస్ పులకేశి గాడు పౌరుషం అని అప్పట్లో అతను చేసిన అఘాయిత్యాలు అన్నిటినీ పొగిడారు కదా. ఇప్పుడు వాటిని మర్చిపోయి వదిలేయాలా?

    వివే*కా కూతు”రు సునీత గారు వదిలేస్తారా?

    వైఎ*స్ఆర్ కూతు*రు షర్మి*ల గారు వదిలేస్తారా,?

    వైఎస్ఆ*ర్ భా*ర్య విజయ*మ్మ గారు వదిలేస్తారా?

  4. గురివింద గింజ సామెత గుర్తొస్తుంది మీ వ్యాసం చూసి… వైసిపి వాళ్ళు మీడియా ముందు, assembly lo వాడిన బూతులు, పార్టీ office la meedha చేసిన దాడులు.. ఒక రక మైన రాక్షస రాజ్యం చూపించారు ఆంధ్ర ప్రజలకు… చంద్రబాబు సఛీలిడు కాకపోవచ్చు కానీ జగన పార్టీ అంత దుర్మార్గం ఐతే కాదు

  5. ఇషశుక. మద్యం. గనులు . లో మాత్రం వైకప్ చేసిన అవి నీతి ని వదిలేది లేదు . పట్టుకుంటాం అందరినీ పట్టుకుంటాం కానీ ఒక పట్టాభి ని కొట్టినట్లు. R R R గారిని కొట్టినట్లు పార్టీ ఆఫీసు ల మీద దాడులు లాంటివి అయితే మాత్రం ఉండవు

  6. ఒక MP గా ఉన్న RRR ని అక్రమం గా చితక బాదితె సంగకలు గుద్దుకొని, అయ్యొ, బాబొ అని వెడుకున్నా వదల్లెదు అని జగన్ గురించి గొప్పగా రాసిన GA ఇవ్వాళ గురువింద నీతులు రాస్తుంది. నిజం గా విధి ఎంత బలీయమైనది!

  7. Rrr ని కొడుతుంటే వీడియో కాల్ లో చూసి ముషి ముషి నవ్వులు నవ్విన పే.డి గాడు ఇప్పుడెందుకు రాజ్యాంగం నైతిక విలువలు అని గోలపెడుతున్నాడు

    che.క్కా గాడి ప్రతి కుక్కా చంద్ర బాబును దారుణంగా బూతులు తిట్టినవాడే

    ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మల తాలూకు ఫలితం అందుతుంది .

    వెయిట్ అండ్ సీ

  8. ఒరేయ్ విజయ లక్ష్మి గా, both are not same!! ఇన్నాళ్లు అధికారం అడ్డం పెట్టుకుని తన పాపాలు cover చేసుకుంటూ ప్రతీకారం రాజకీయాలు చేశారు !! ఇప్పుడు తమ తప్పులకు జవాబు చెప్పే ధైర్యం లేక పారిపోతున్నారు !! రావణుడు, రాముడు ఇద్దరూ యుద్ధం చేశారు, కానీ both are not same!!

  9. orey వి-జ-య ల-క్ష్మి గా, both are not same!! ఇన్నాళ్లు అధికారం అడ్డం పెట్టుకుని తన పాపాలు  cover చేసుకుంటూ ప్రతీకారం రాజకీయాలు చేశారు !! ఇప్పుడు తమ తప్పులకు జవాబు చెప్పే ధైర్యం లేక పారిపోతున్నారు !! రావణుడు, రాముడు ఇద్దరూ యుద్ధం చేశారు, కానీ both are not same!!

    1. విభీషణుడు-విదురుడు యుద్ధం చేశారంటే బాగుంటుంది. ఒక్క బాణమూ తగలదు. ఒక్క casex నిరూపించబడదు.

      1. sir మీరు రామాయణ మహాభారతాన్ని కలిపేశారు, but మీరు చెప్పింది 100% correct !!

  10. Rrr రాజు గారికి ఇచ్చిన బహుమతి జగన్ కి తిరిగి ఇవ్వకపోతే గౌరవం కాదు. అందుకే రాజు గారూ పువుల్లో పెట్టీ మరీ తిరిగి ఇవ్వడానికి ప్లాన్ చేసారు, అచ్మం అదే బహుమతి.

  11. వైసీపీ పాలనలో ప్రజలను రోడ్ మీదకు వచ్చి ధర్నా చెయ్యాలన్న భయపడే పరిస్థితి తీసుకు వచ్చిన వైసీపీ ని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేరు దానికి చట్టం తనకున్న అధికారాన్ని దుర్వినియోగ పరచిన అధికారులు మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో అధికారులు ఏమిచేసినా చెల్లుబాటు అవుతుందని భావిస్తారు వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోకుండా వదిలేస్తే అసమర్థ ప్రభుత్వం గ మిగిలిపోతుంది

  12. “రాష్ట్రంలో బీసీ బిడ్డలకు 92 శాతం రిజర్వేషన్‌ అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తానని ఎమ్మెల్సీ తీన్మార్‌ మల్లన్న అన్నారు”

  13. చంద్రబాబు నుండి పరిష్కారాలు ఆశించడం అంతే సముద్రంలో మంచినీటి కోసం వెదకడమే. వాడో నీ చమైన సై కో .. వాడి కొడుకు ని కృష్ట మైన సై కో. ఇక వాడి పేకే జీ కు క్కయితే చెప్పనక్కరలేదు.

  14. చంద్రబాబు నుండి పరిష్కారాలు ఆశించడం అంతే సముద్రంలో మంచినీటి కోసం వెదకడమే. వాడో నీ చమైన సై కో .. వాడి కొడుకు ని కృష్ట మైన సై కో. ఇక వాడి పేకే జీ కు క్కయితే చెప్పనక్కరలేదు.

  15. చంద్రబాబు నుండి పరిష్కారాలు ఆశించడం అంతే సముద్రంలో మంచినీటి కోసం వెదకడమే. వా డో నీ చ మై న సై కో .. వాడి కొడుకు ని కృ ష్ట మై న సై కో. ఇక వా డి పే కే జీ కు క్కయితే చెప్పనక్కరలేదు.

  16. చంద్రబాబు నుండి పరిష్కారాలు ఆశించడం అంతే సముద్రంలో మంచినీటి కోసం వెదకడమే. వా డో నీ చ మై న సై కో .. వా డి కొడుకు ని కృష్ట మైన సై కో. ఇక పే కే జీ కు క్క యి తే చెప్పనక్కరలేదు.

  17. చంద్రబాబు నుండి పరిష్కారాలు ఆశించడం అంటే సముద్రంలో మంచినీటి కోసం వెదకడమే. వా*డో నీ*చ*మై*న సై*కో .. వా*డి కొ*డు*కు ని*కృ*ష్ట*మై*న సై*కో. ఇక పే*కే*జీ కు*క్క*యి*తే చెప్పనక్కరలేదు.

  18. చందర్బాబు నుండి పరిష్కారాలా? ఓలమ్మో నిజమా? ఫాక్షనిజం తప్ప పరిష్కారం దొరకదు.

  19. మీరు బలే బలే కథనాలు రాస్తారు విజయలక్ష్మి పేరు పెట్టి..మనం అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షమే లేదు అన్నట్లు ప్రవర్తించి ఇప్పుడు నీతులు చెబుతున్నావ్.

    అసలు దరిద్రం మొదలు పెట్టిందే మనం అవినీతిలో ఇరుక్కుని నాశనం అయ్యి రాష్ట్రాన్ని నాశనం చేసి ఇప్పుడు సుద్దులు చెప్తున్నావా. జలు మనకి ఇంకా అవకాశం ఇవ్వరు కాబట్టీ ఎదో ఒక మార్గం ద్వారా గమ్యస్థానానికి చేరుకోవడం ఉత్తమమైన పని

  20. gatha ayidu yellu ga andharu motthukunnadhi idhe… Mana rastraniki tamilanadu rajakeeyalu parichayam chesthunnaru ani… Appudu ardham kaanidhi, ippudu yela intha clarity vacchindhi…?

  21. ఎందుకు ఉన్నాడు రా బాబు 11 గాడు

    రిషికొండ ప్యాలెస్ చూసుకుని ఏడ్వటానికా??

    పనికిమాలిన 11 .. ఈసారి లండన్ కి పారిపోతున్నాడు.

    బూమ్ బూమ్ Vజయ్ మాల్య తో పిల్ల పెళ్ళి చేస్తున్నాడట.. చాలా సీక్రెట్ గా

    ఏం చేస్తాం అంతా సజ్జల్ మాయ.. లేకపోతే ఈపాటికే ప్యాలెస్ బెడ్రూమ్ లో సముద్ర0 మీద ఎన్నెల చూస్తూ అడల్టరీ గేమ్ ఆడుతుండేవాళ్ళు..

    ఈ ఆంధ్ర జనాలు ఉన్నారే.. Leven mohana ni మోసం చేశారు

  22. అప్పుడేమో Redbook మడిచి ఎక్కడో పెట్టుకోవాలని సవాల్ చేసి, చెడుగుడు ఆడిన.. సింహాలు, FIRE brand’s.. ఇప్పుడు ఎందుకో ఒకడు బెంగళూరు, ఇంకోడు హైదరాబాద్, ఇంకోకతి చెన్నై.. ఇంకొకడైతె ఏకంగా America కి పోయి daakkunnaaru.. ఎందుకు??

    Common.. మీరు mogelle అయితే బయటకి వచ్చి చెడుగుడు ఆడితే చూడాలని ఉంది.

  23. తాడేపల్లి ప్యాలస్ లో iron కోట గోడల మధ్య “Leven ల0గా బతుకు” కంటే బెంగళూర్ లో కుక్క బతుకే better అంటున్న Leven mohana గాడు

  24. One chance experiment is proved to be a BIG Failure

    చంద్రబాబు monatany పాలన కి బోర్ కొట్టి Jeggulu ఊరూరు తిరిగి ఇచ్చిన హామీలు మీద నమ్మకంతో ఒక్క ఛాన్స్ ఇచ్చి ప్రయోగం చేశారు.. కానీ ఆ ఒక్క ఛాన్స్ ని mis use చేసి పగ, ప్రతీకారం తో ప్రజల వాయిస్ఐన ప్రతిపక్షం లేకుండా చేసి, అప్పులు తెచ్చి పప్పులు పెంచితే, భూములు,సహజ వనరులు లూటీ చేసి, ఇసుక మధ్యం లో వేల కోట్లు కొట్టేసినా ప్రజలు చచ్చినట్టు తనకే ఓటుస్థారు ఆనుకున్నాడు yeర్రి యదవ ..

    అందుకే ఈడు కనీసం ప్రతిపక్ష నాయకుడు గా కూడా పనికిరాని సన్నాసి అని Fan రెక్కలు మడిచి గుడ్డ లో 11 ఇంచులు లోతుగా dengaaru ఐనా ఈడి కి బుద్ధి రావడం లేదు.. No body can help

  25. అంటే ఇప్పుడు జగన్ ని జగన్ అండతో చెలరేగిన Ycp వాళ్ళని ఏమీ చెయ్యొద్దు అంటావ్

  26. ‘దాడులు & పాపాల పాలనతో ఇంకో 30 సం పె0ట పె0ట

    చెయ్యొచ్చు అనుకుంటే, విశ్వాస0 లేని ప్రజలు ఒక్క ఛాన్స్ కే’ ‘gu’dda డె0గీ ప్యాలస్ కి పం పేశారు

    తాడేపల్లి ప్యాలెస్ లో ఇనుప కోటల మధ్య హాయిగా గోరంట్ల maadhav & సజ్జల తో blu’e గే’మ్ ఎ0జాయ్ చేద్దాం అనుకుంటే..

    అక్కడ కూడా నిమ్మళంగా ఉండనీయడం లేదు.

    లోకేష్ ఎ0దీ 5 ఏళ్ల ఉండగా, అప్పుడే T20 మ్యాచ్ మాదిరి ఫస్ట్ బాల్ నుండే ఉతుకుతున్నాడు.. విపరీతంగా అలసిపోతేటట్టు చేస్తున్నాడు..

    ప్రతీ రోజు, ప్రతీ బాల్ కి పరిగెత్తాలంటే నావల్ల కావడం లేదు..

    ఇలా 5 యేళ్ళు బాదుతూపోతే తట్టుకుని నిలబడడం

    నావల్ల కాదు..

    ఎ0 చెయ్యాలబ్బా.. మీరే ఒక ఉపాయం చెప్పి ప్యాలెస్

    కట్టుకో0డి… Retired hu’rt లేక ??

    ఇట్లు’

    రె0డు నామా’ల Jeggul

  27. ‘దాడులు & పాపాల పాలనతో ఇంకో 30 సం పె0ట పె0ట

    చెయ్యొచ్చు అనుకుంటే, విశ్వాస0 లేని’ ప్రజలు ఒక్క ఛాన్స్ కే’ 11 ఇంచుల లోతుగా ‘gu’dda డె0గీ ప్యాలస్ కి పంపేశారు

    పోనీ, తాడేపల్లి ప్యాలెస్ లో ఇనుప కోటల మధ్య హాయిగా గోరంట్ల maadhav & సజ్జల తో blu’e గే’మ్ ఎ0జాయ్ చేద్దాం అనుకుంటే..

    అక్కడ కూడా నిమ్మళంగా ఉండనీయడం లేదు.

    లోకేష్ ఎ0దీ 5 ఏళ్ల ఉండగా, అప్పుడే T20 మ్యాచ్ మాదిరి ఫస్ట్ బాల్ నుండే ఉతుకుతున్నాడు.. విపరీతంగా అలసిపోతేటట్టు చేస్తున్నాడు..

    ప్రతీ రోజు, ప్రతీ బాల్ కి పరిగెత్తాలంటే నావల్ల కావడం లేదు..

    ఇలా 5 యేళ్ళు బాదుతూపోతే తట్టుకుని నిలబడడం

    నావల్ల కాదు..

    ఎ0 చెయ్యాలబ్బా.. మీరే ఒక ఉపాయం చెప్పి ప్యాలెస్

    కట్టుకో0డి… Retired hu’rt లేక ??

    ఇట్లు’

    రె0డు నామా’ల Jeggul

  28. ‘తిక్కలోడి పాపాల పాలన తో విరక్తి చెందిన ప్రజలు, కనీసం ప్రతిపక్ష నాయకుడి హోదా కి కూడా పనికిరాని సన్నాసి, అంటూ Fan రెక్కలు మడత పెట్టి, వీడి గుడ్డలోకి 11 ఇంచులు ది0పారు

  29. కర్మ is returning back.. RED BOOK మీద చాలా మంది, చాలా లేకి గా మాట్లడి, ఇప్పుడు కనిపించకుండా ఎక్కడెక్కడో దాక్కోన్నారు . RED బుక్ లో ఇంకా first పేజీ కూడా open చేయలేదు, అప్పుడే 11 అధినేతే లంగాగాడిలా గగ్గోలు పెడుతు, ఆర్తనాదాలు చేసుకుంటూ ఢిల్లీ, బెంగళూరు కి పారిపోతున్నాడు.. ఇక పార్టీ క్యాడర్ కి ఏమీ భరోసా ఇస్తాడు ల0గా’ నాకొ’డుకు.

    అసలైన నాకొ’డుకు లు ఎక్కడ daakkunnaaru రా??

  30. RED BOOK కల్లోకొచ్చి “ల0గా Leven” మాటిమాటికి బెంగళూరు కి ‘పారిపోతూ ఉంటే, తాడేపల్లి 4AM సరసాలకి అనుకూలంగా ఉంది. S0 గొడ్డలి బావ కి గోల్డెన్ ఛాన్స్..

  31. “లంగా leven” గాడు నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నాడు

    పందులే గుంపుగా వస్తాయి అన్నా డు??

    మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే

    నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ, బెంగళూర్ పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.

    ఇదా సీమ single సింహం అంటే??

  32. ఈ “ల0గా leven” గాడు సీమ లో ఎలా పుట్టినాడా అని డౌట్ వస్తోంది??

    నేను single సింహం.. నన్నెవరు ఏమీ పీకలేరు అన్నాడు

    పందులే గుంపుగా వస్తాయి అన్నా డు??

    మరి ఇప్పుడే0టీ అసెంబ్లీ కి పోతే

    నన్ను lokesh రేప్’ చేస్తున్నాడు.. కాపాడ0డి అంటూ gu’dda ఎత్తుకుని హా హా కారాలు, అర్ధనాదాలు చేస్తూ ఢిల్లీ కి పారిపోయి అందరి ‘మడ్డలు గుడుస్తున్నాడు.

    ఇదా సీమ single సింహం అంటే??

  33. “ఐటం అధినేత” భయపడి BANGALORE పారిపోతే

    అరెస్ట్ వారెంట్ తెచ్చుకున్న Sajjala.. Party, cadre కి ముందుండి భరోసా ఇస్తున్నాడు…

    మా leader Sajjale

  34. ఇవన్నీ నిజమే అయితే ఆధారాలతో అసెంబ్లీ లో తేల్చుకోవచ్చు కదరా A1గా0డు గాడు.

    అసెంబ్లీ కి పోతే Pawan and TDP వాళ్లు ఎక్కడ gu’dda denguthaar0 అని భయపడి .. సాకు వెతుక్కుని ఆర్తనాదాలు చేస్తూ, ఢిల్లీ కి పారిపోయి అక్కడ వీధుల్లో పోరాటం ఏందిరా ఐటం గా0డు??

  35. ఈవిడకి ఎక్కువ చిల్లర వేస్తే రేపు KA Paul కి కూడా ఎలెవేషన్లు వేస్తుంది…లైట్ తీసుకోండి

  36. Rrr గారిని కొట్టినట్లె, ప్యాలస్ పులకేశి బట్టలు విప్పేసి పోలీసు టేబుల్ మీద పడుకోబెట్టి, వెనుక అరి కాళ్ళ మీద ఒక్కో లాఠీ దెబ్బ పడుతూ వుంటే, ముందు నోట్లో నుండి వచ్చే గావి కేక లు RRR చెవులకి శ్రవనానంద కరంగా వినిపిస్తాయి.

    స్టోరీ లో కొసమెరుపు, అదే గునీల్ చేత ప్యాలస్ పులకేశి నీ కొట్టించడం.

  37. ఎవ్వరిని ఎం చేయకుండా జలగ ఒక్కడిని మూసేస్తే సరిపోయిద్ది. అదేదో సినిమాలో లాగ రాణి ఈగ చస్తే మిగతా ఈగలు వాటంత అవే పోతాయి ఫార్ములా యూస్ చేస్తే మంచిది.

  38. ఎవ్వరిని ఎం చేయకుండా జ-ల-గ ఒక్కడిని మూసేస్తే సరిపోయిద్ది. అదేదో సినిమాలో లాగ రాణి ఈగ చ-స్తే మిగతా ఈగలు వాటంత అవే పోతాయి ఫార్ములా యూస్ చేస్తే మంచిది.

  39. ఎవ్వరిని ఎం చేయకుండా Annai ఒక్కడిని మూసేస్తే సరిపోయిద్ది. అదేదో సినిమాలో లాగ రాణి ఈగ pothe మిగతా ఈగలు వాటంత అవే పోతాయి ఫార్ములా యూస్ చేస్తే మంచిది.

Comments are closed.