హీరోయిన్ మేఘా ఆకాష్ పెళ్లికి రెడీ అయిన సంగతి తెలిసిందే. తన లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ సాయివిష్ణుతో త్వరలోనే ఆమె వివాహం జరగనుంది. ఇప్పటికే ఇద్దరి నిశ్చితార్థం పూర్తయింది. ఇప్పుడు పెళ్లి పిలుపులు మొదలయ్యాయి.
స్వయంగా మేఘా ఆకాష్, తన కాబోయే భర్తతో కొంతమంది సినీ ప్రముఖుల్ని కలిసి పెళ్లి శుభలేఖలు అందిస్తోంది. ముందుగా ఈ జంట, సూపర్ స్టార్ రజనీకాంత్ ను కలిసింది. తమ వివాహానికి వచ్చి ఆశీర్వదించాల్సిందిగా ఆహ్వానించింది.
రజనీకాంత్ నటించి పేట సినిమాతోనే మేఘా ఆకాష్ వెండితెరకు పరిచయమైన సంగతి తెలిసిందే. అందుకే తొలి శుభలేఖను సూపర్ స్టార్ కు అందించింది. త్వరలోనే ఆమె విజయ్, అజిత్, విక్రమ్ లాంటి ప్రముఖుల్ని కూడా కలవనుంది.
మరోవైపు మేఘా ఆకాష్, సాయివిష్ణు కుటుంబ సభ్యులు ఇతర ప్రముఖులకు పెళ్లి శుభలేఖలు అందించే పనిలో ఉన్నారు. సాయివిష్ణు తండ్రి, మాజీ ఎంపీ తిరునవుక్కరసు కమల్ హాసన్ ను కలిసి పెళ్లి శుభలేఖ అందించారు. శుభలేఖలు అందుకున్న వాళ్లలో ఇళయరాజా, వైరముత్తు లాంటి వాళ్లు ఉన్నారు.
టాలీవుడ్ లో ఇంకా ఆమె పిలుపులు మొదలుపెట్టలేదు. హీరో నితిన్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది మేఘా ఆకాష్. అతడితో చల్ మోహనరంగ, లై సినిమాల్లో నటించింది. ఇక రవితేజ, శ్రీవిష్ణు లాంటి హీరోలతో కూడా నటించింది. వాళ్లందర్నీ వ్యక్తిగతంగా కలిసి వెడ్డింగ్ కార్డ్స్ ఇవ్వబోతంది మేఘా ఆకాష్.
జనం పట్టించుకోరు
vc estanu 9380537747
vc available 9380537747
Call boy works 8341510897
Call boy jobs available 8341510897