రేవంత్ కు, రెడ్లకు చెక్ పెట్టే స్థితిలో తీన్మార్ ఉన్నారా?

కేసీఆర్ పరిపాలన సాగినంత కాలమూ.. ఆయనకు వ్యతిరేకంగా మీడియాలో తన గళం వినిపిస్తూ పాపులర్ అయిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. కేసులు, అరెస్టులు ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సరే మల్లన్న గులాబీ దళాలపై తన…

కేసీఆర్ పరిపాలన సాగినంత కాలమూ.. ఆయనకు వ్యతిరేకంగా మీడియాలో తన గళం వినిపిస్తూ పాపులర్ అయిన వ్యక్తి తీన్మార్ మల్లన్న. కేసులు, అరెస్టులు ఎన్ని ఒత్తిడులు ఎదురైనా సరే మల్లన్న గులాబీ దళాలపై తన పోరాటం ఆపలేదు. మధ్యలో ఎమ్మెల్సీగా చట్టసభలో ప్రవేశించడానికి ఒక ప్రయత్నం చేసి భంగపడ్డారు.

అరెస్టుల తరువాత తనకు రాజకీయ అండ కూడా అవసరం అనుకున్నారో ఏమో.. బీజేపీలో చేరి అతి తక్కువ వ్యవధిలోనే వారితో పొసగక బయటకు వచ్చారు. తర్వాత కాంగ్రెస్ ప్రాపకం సంపాదించారు. వారి దయతో ఎమ్మెల్సీ కూడా అయ్యారు. అయితే ఇప్పుడు హఠాత్తుగా ఆయన కాంగ్రెసులో బీసీ గళానికి తాను ప్రతినిధిలాగా బిల్డప్ ఇస్తున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయకపోతే భూకంపం సృష్టిస్తాను అని.. తన తాహతుకు మించిన డైలాగులు వేస్తున్నారు.

తనను ఓడించడానికి ఒక రెడ్డి నాయకుడు ప్రయత్నించాడు అనేది తీన్మార్ మల్లన్న ఆగ్రహం. తాను ఓడిపోతాను అన్నా వారిని ఎవ్వరినీ గెలవనివ్వను అని మల్లన్న ప్రతిజ్ఞ చేస్తున్నారు. కాంగ్రెస్ ట్యాగ్ తగిలించుకుంటే తప్ప పట్టభద్రుల ఎమ్మెల్సీ గా కూడా గెలవలేకపోయిన ఈ మల్లన్న, ఎంఎల్ఏ ఎన్నికల్లో మరొకరిని ఓడిస్తా అనడం కొంత అతిశయం. పైగా తెలంగాణలో కుల సంఘాలకు బిచ్చగాళ్ళలా 50 కోట్లు ఏ లెక్కన కేటాయిస్తారు అంటూ సర్కారును తప్పు పట్టడం విచిత్రం. పైగా రాష్ట్రంలో త్వరలోనే బీసీల ప్రభుత్వం రాబోతోందని మల్లన్న అంటున్నారు

ఎవరైనా బీసీ బడా నాయకుల ప్రేరేపణతో ఈ మాటలు అంటున్నారా? లేదా, రేవంత్ మీద రెడ్ల మీద ఆయనలో కసి, ద్వేషం ఉన్నాయా అనేది అర్థం కావడం లేదు.

రేవంత్ కు, కాంగ్రెస్ లో రెడ్ల ప్రాబల్యానికి చెక్ పెట్టగల సీన్ మల్లన్నకు ఉన్నదా? ఈ మాటలు అనడం వలన మహా అయితే పదవి పోతుంది అంటూ తెగించి మాట్లాడుతున్న విధంగానే.. మళ్లీ యూట్యూబ్ వీడియోలు చేసుకోవడానికే రెడీ అవుతున్నారా తెలియడంలేదు.

8 Replies to “రేవంత్ కు, రెడ్లకు చెక్ పెట్టే స్థితిలో తీన్మార్ ఉన్నారా?”

  1. CBN sir ని పవన్ సర్ ని ఎదిరించే సత్తా జగన్ కి ఉందా? ఎవడి తాపత్రయం వాడిది !!

Comments are closed.