నెల మొత్తం ఆ ఒక్క సినిమానే!

30 రోజులు.. దాదాపు 20 సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ అందరి దృష్టి ఒకే ఒక్క సినిమాపై ఉంది. ఇంకా చెప్పాలంటే, సెప్టెంబర్ నెల మొత్తంలో చెప్పుకోదగ్గ సినిమా ఒకే ఒక్కటి ఉంది. అదే…

30 రోజులు.. దాదాపు 20 సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ అందరి దృష్టి ఒకే ఒక్క సినిమాపై ఉంది. ఇంకా చెప్పాలంటే, సెప్టెంబర్ నెల మొత్తంలో చెప్పుకోదగ్గ సినిమా ఒకే ఒక్కటి ఉంది. అదే దేవర-1

ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. పైగా కొరటాల శివ దర్శకుడు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా. అందుకే దేవర-1పై అన్ని అంచనాలు, ఎదురుచూపులు. ఇవి కాకుండా సైఫ్ అలీఖాన్ విలనీ, జాన్వి కపూర్ డెబ్యూ, అనిరుధ్ మ్యూజిక్ లాంటివి ఉండనే ఉన్నాయి.

ఈ సినిమా తప్ప, సెప్టెంబర్ నెలలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటి కూడా లేదు. మొదటి వారంలో అటుఇటుగా అరడజను సినిమాలొస్తున్నాయి. వీటిలో విజయ్ నటించిన గోట్ సినిమా ఉంది. తెలుగులో ఈ సినిమాపై బజ్ పెద్దగా లేదు.

ఇక ఇదే వారంలో సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’, రాజ్ తరుణ్ చేసిన ‘భలే ఉన్నాడే’ సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలూ ట్రయిలర్స్ తో ఆకట్టుకున్నాయి. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

రెండో వారంలో మత్తు వదలరా 2, ధూమ్ ధామ్, ఉత్సవం సినిమాలొస్తున్నాయి. మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పార్ట్-2 పై మాత్రమే అంచనాలున్నాయి.

ఇక మూడో వారం బాక్సాఫీస్ పూర్తిగా ఖాళీ. ఎందుకంటే, ఆ మరుసటి వారం దేవర సినిమా రిలీజ్ ఉంది కాబట్టి. ఓ పెద్ద సినిమా వచ్చేముందు, అటువారం, ఇటు వారం మరో సినిమా లేకుండా చూసుకుంటున్నారు. మొన్న కల్కి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే జరగబోతోంది.

మొత్తానికి సెప్టెంబర్ నెలలో దేవర-1 మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో మరో సినిమా థియేటర్లలోకి రావడం లేదు. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపైనే అందరి చూపు ఉంది.

7 Replies to “నెల మొత్తం ఆ ఒక్క సినిమానే!”

Comments are closed.