30 రోజులు.. దాదాపు 20 సినిమాలు రిలీజ్ అవుతాయి. కానీ అందరి దృష్టి ఒకే ఒక్క సినిమాపై ఉంది. ఇంకా చెప్పాలంటే, సెప్టెంబర్ నెల మొత్తంలో చెప్పుకోదగ్గ సినిమా ఒకే ఒక్కటి ఉంది. అదే దేవర-1
ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న సినిమా ఇది. పైగా కొరటాల శివ దర్శకుడు. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ నుంచి వస్తున్న సినిమా. అందుకే దేవర-1పై అన్ని అంచనాలు, ఎదురుచూపులు. ఇవి కాకుండా సైఫ్ అలీఖాన్ విలనీ, జాన్వి కపూర్ డెబ్యూ, అనిరుధ్ మ్యూజిక్ లాంటివి ఉండనే ఉన్నాయి.
ఈ సినిమా తప్ప, సెప్టెంబర్ నెలలో చెప్పుకోదగ్గ మూవీ ఒక్కటి కూడా లేదు. మొదటి వారంలో అటుఇటుగా అరడజను సినిమాలొస్తున్నాయి. వీటిలో విజయ్ నటించిన గోట్ సినిమా ఉంది. తెలుగులో ఈ సినిమాపై బజ్ పెద్దగా లేదు.
ఇక ఇదే వారంలో సుహాస్ నటించిన ‘జనక అయితే గనక’, రాజ్ తరుణ్ చేసిన ‘భలే ఉన్నాడే’ సినిమాలున్నాయి. ఈ రెండు సినిమాలూ ట్రయిలర్స్ తో ఆకట్టుకున్నాయి. రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.
రెండో వారంలో మత్తు వదలరా 2, ధూమ్ ధామ్, ఉత్సవం సినిమాలొస్తున్నాయి. మత్తు వదలరా సినిమాకు సీక్వెల్ గా వస్తున్న పార్ట్-2 పై మాత్రమే అంచనాలున్నాయి.
ఇక మూడో వారం బాక్సాఫీస్ పూర్తిగా ఖాళీ. ఎందుకంటే, ఆ మరుసటి వారం దేవర సినిమా రిలీజ్ ఉంది కాబట్టి. ఓ పెద్ద సినిమా వచ్చేముందు, అటువారం, ఇటు వారం మరో సినిమా లేకుండా చూసుకుంటున్నారు. మొన్న కల్కి విషయంలో అదే జరిగింది. ఇప్పుడు దేవర విషయంలో కూడా అదే జరగబోతోంది.
మొత్తానికి సెప్టెంబర్ నెలలో దేవర-1 మినహా చెప్పుకోదగ్గ స్థాయిలో మరో సినిమా థియేటర్లలోకి రావడం లేదు. ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపైనే అందరి చూపు ఉంది.
Call boy jobs available 8341510897
atta ee movie.. pakka.
flop
జనం పట్టించుకోరు
అయినా మేం థియేటర్లో చూడం
vc estanu 9380537747
vc available 9380537747