ఈ విన్నపం టీడీపీలో మొదటి నుంచి ఉన్న వారిది. గత అయిదేళ్ళుగా వైసీపీ అధికారంలో ఉన్నపుడు రోడ్డు మీదకు వచ్చి పోరాడిన వారింది. అధికారం అన్నది తమ రెక్కల కష్టం అని దానిని అందిపుచుకుని అనుభవిద్దామని మిగిలిన వారు అంతా చూస్తూంటే తమ్ముళ్ళు చెల్లెళ్ళూ ఊరుకోగలరా.
నిన్నటిదాకా వైసీపీ నీడలో అధికారం మాటున్న ఉన్న వారు అంతా ఇపుడు టీడీపీ అధికార పల్లకి ఎక్కేస్తామంటే పాత వారు ఊరుకుంటారా. అందుకే వారు వద్దు బాబూ వారిని చేర్చుకోవద్దు అంటూ విన్నపాలు చేసుకుంటున్నారు.
శ్రీకాకుళం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గౌతు శిరీష చంద్రబాబుకు ఇదే తీరున విన్నపం చేశారు. ఊసరవెల్లులు పార్టీలోకి వస్తున్నాయి. వారిని చేర్చుకోవద్దు అంటూ ఆమె బాబుని కోరారు. ఆమె వైసీపీని రాజీనామా చేసి టీడీపీలోకి రావాలని చూస్తున్న పోతుల సునీత గురించే ఈ వ్యాఖ్యలు చేశారు అని భావిస్తున్నారు.
ఆమె మాత్రమే కాదు చాలా మంది టీడీపీ నేతలు ఇదే విధంగా రియాక్ట్ అవుతున్నారు. వైసీపీ హయాంలో తాము బాధలు పడ్డామని ఇపుడు వారంతా మళ్లీ వచ్చి చేరితే తమకు ఏమిటి లాభం, గెలిచినందుకు ఏమిటి దక్కిన పుణ్యం అని అంటున్నారు.
ప్రజలు టీడీపీకి పూర్తి మెజారిటీ ఇచ్చారు. బంపర్ విక్టరీ కట్టబెట్టారు. టీడీపీ కూటమిని కట్టింది. అందులో మరో రెండు పార్టీలు ఉన్నాయి. అందరికీ న్యాయం చేయాలి. ఇపుడు వైసీపీ నుంచి కూడా నేతలు వస్తే అందరికీ పదవులు ఎక్కడ నుంచి వస్తాయి. సర్దుకోమని తమ్ముళ్ళకు చెల్లెళ్ళకూ చెబితే వారికి మంటెక్కకుండా ఉంటుందా.
అందుకే టీడీపీ డోర్లు వేయడం మంచిది అని అంటున్నారు. కానీ వైసీపీని వీక్ చేయాలన్న పొలిటికల్ అజెండాతో టీడీపీ వెళ్తే మాత్రం ఈ రోజుకు బాగున్నా రేపటికి మాత్రం ఇది బూమరాంగ్ అయినా అవుతుంది అంటున్నారు. ఎందుకంటే ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఇపుడు చాలా కత్తులు ఒక వేపు వెళ్తే జరిగేది ఏమిటో ఊహించాల్సిందే.
ha ha ha …. tdp chEsindEmiTo gata 5 ELLu.. idi alaanTidE..common
Call boy works 8341510897
Call boy works 8341510897