పవన్-బన్నీ.. మధ్యలో పూనమ్

పవన్ కల్యాణ్ కు సంబంధించి ఏ చిన్న ఇష్యూ నడిచినా, అందులో పూనమ్ చొరవ తీసుకుంటుంది. తనకు సంబంధం లేకపోయినా, అలాంటి అంశాలపై ఆమె స్పందిస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది. Advertisement ప్రస్తుతం…

పవన్ కల్యాణ్ కు సంబంధించి ఏ చిన్న ఇష్యూ నడిచినా, అందులో పూనమ్ చొరవ తీసుకుంటుంది. తనకు సంబంధం లేకపోయినా, అలాంటి అంశాలపై ఆమె స్పందిస్తుంది. ఈసారి కూడా అదే జరిగింది.

ప్రస్తుతం పవన్ కల్యాణ్, అల్లు అర్జున్ మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. జనసేన నేతలు సైతం ఈ వార్ లోకి దిగారు. అటు బన్నీ అభిమానులు గట్టిగా తిప్పికొడుతున్నారు. ఓవైపు ఇదిలా నడుస్తుండగా, మధ్యలోకి పూనమ్ కౌర్ ఎంటరైంది.

ఈ వివాదంలో ఆమె ఎటువైపు ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆమె బన్నీకి మద్దతుగా నిలిచింది. అల్లు అర్జున్, స్నేహా దంపతుల పక్కన కూర్చొని ఏదో మ్యాచ్ చూస్తున్న ఫొటోను పూనమ్ షేర్ చేసింది. ప్రేమ, ప్రార్థనలు, సామరస్యం.. అనే క్యాప్షన్ కూడా జోడించింది.

పూనమ్ కౌర్ నేరుగా ఎప్పుడూ స్పందించదు. నర్మగర్బంగా వ్యాఖ్యలు చేస్తుంది. అర్థం చేసుకున్నోళ్లకు అర్థం చేసుకున్నంత. ఈసారి కూడా ఆమె అదే పని చేసింది. తను బన్నీ వైపు ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. అయితే పవన్-బన్నీ వివాదాన్ని ఆమె టచ్ చేయలేదు.

సోషల్ మీడియాలో బన్నీ అభిమానులు జనసేన నేతలను ట్రోల్ చేస్తుంటే.. పవన్ ఫ్యాన్స్ పూనమ్ ను ట్రోల్ చేసే పనిలో పడ్డారు. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తీసుకుంటుందో ఏమో..

32 Replies to “పవన్-బన్నీ.. మధ్యలో పూనమ్”

  1. సద్దుమణుగుతున్న సమయంలో మళ్ళీ కెలికింది బన్నీ గారే… ఆత్మవిశ్వాసం ఉండవచ్చు కానీ అహంకారం ఉండకూడదు. I respect bunny gaaru for his hardwork and emerged as a big star with his dedication and hardwork. But initial days lo bunny గారిని మోసింది మెగా అభిమానులే. He should not forget that.

    1. వయసులో పెద్దవాడు, డిప్యూటీ సీయం గా ఉంటూ మూడో నాలుగో శాఖలకి మంత్రిత్వం చేస్తున్నవాడికి లేని సంయమనం బన్నీకి మాత్రం ఉండాలా? కుటుంబంలో చిరుకి తప్ప ఎవరికీ లేని ఓర్పు బన్నీకి మాత్రమే ఉండాలా? ఏమీ న్యాయం సార్ ఇది? ఎందరు ఎన్ని అన్నా పడి ఉండాలా?

      1. Nenu చెప్పింది అంతా సద్దుమనిగే టైమ్ లో అని సర్. అయినా నా అభిప్రాయం ప్రకారం మెగా హీరోల బాధలో అర్థం ఉంది. మన ఇంట్లో వ్యక్తి … మనం యుద్ధం చేస్తున్న పార్టీ తరుపున నిలబడితే ఆ బాధ తెలుస్తుంది

          1. అది వారిద్దరినీ అడగాలి సర్. నాకెలా తెలుస్తుంది. వారూ ఇద్దరూ బాధపడ్డరేమో ఆ టైమ్ లో. మీడియా కి ఎక్కలేదు కదా అందుకే సద్దుమణిగింది. ఎవరి పాటికి వారు ప్రచారం చేసి సైలెంట్ అయ్యారు. జనాలు కూడా లైట్ తీసుకున్నారు. But now the situation is different.

  2. రాను రాను ఈవిడ మీద చిరాకు వేస్తుంది. ఏమన్నా ఉంటే డైరెక్ట్ గా తేల్చుకోవాలి. మీడియా కి ఎక్కవచ్చు, పోలీసు కి కంప్లయింట్ చేయవచ్చు ఇలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈవిడ ఏమి కన్వే చేయదలచుకుంది? She should be very clear on that at the first place

  3. Sandatlo sademiya. Deni baada dinidi ela lime lite lo undala ani. Ame emanna post cheyagane mee midia vallu elaga unnru tagina attention ivvadani and debets pettadaniki. Sodi media

Comments are closed.