జగన్ నిఘా వ్యవస్థలు అసలు పనిచేస్తున్నాయా?

పార్టీ బలహీన పడుతున్నదనే తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెళ్లకుండా ఉండాలంటే.. కొన్ని వలసలను నివారించడం అవసరం.

పార్టీని వీడి వెళ్ళిపోతున్న వారందరూ కూడా ద్రోహులు, అవకాశవాదులు, వారు వెళ్ళిపోవడం వలన పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు.. లాంటి అలవాటైన డైలాగులతో నాయకులు ఎంతగానైనా సర్దిచెప్పుకునే ప్రయత్నం చేయవచ్చు గాక! కానీ ఒక పార్టీ నుంచి నాయకులు వరుసగా వెళ్ళిపోతూనే ఉన్నారంటే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయి. ఆ పార్టీ భవిష్యత్తు బాగుంటుందనే నమ్మకం నాయకులకు లేదు అనే అభిప్రాయం కలుగుతుంది. లేదా పార్టీలో నాయకులకు సమ ప్రాధాన్యం ఇవ్వడంలో వైఫల్యం జరుగుతుందని అనుకుంటారు.

పార్టీ అధినేత కొద్దిగా చొరవ తీసుకుంటే.. నిలువరించదగిన వలసలను కూడా ఉపేక్షిస్తున్నారేమో అనిపిస్తుంది. లేదా పార్టీ నుంచి నాయకులు వెళ్లిపోయే ఆలోచన చేస్తుండగా దానిని పసిగట్టవలసిన జగన్మోహన్ రెడ్డి నిఘా వ్యవస్థలు విఫలమవుతున్నాయా అనే అభిప్రాయం కూడా ప్రజలలో కలుగుతోంది!

ఎన్నికలకు ముందు టికెట్లు దక్కని చాలామంది నాయకులు వైసిపిని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లారు. టికెట్లు దక్కలేదు గనుక అవకాశవాదంతో వారు వెళ్లిపోయారని ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఎన్నికల తర్వాత ఓటమి అనివార్యమైన నేపద్యంలో.. కొందరు తాజా మాజీ ఎమ్మెల్యేలు కూడా పార్టీని వీడారు. ఎమ్మెల్సీలు కూడా పార్టీని వదిలిపోయారు. ఇప్పుడు పదవుల్లో ఉన్న మరికొందరు కూడా వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

అయితే ఇలా ఫిరాయించదలుచుకున్న వారిని ముందుగానే గుర్తించి వారితో అధినేత మాట్లాడి వారిలో ఏమైనా అసంతృప్తులు ఉంటే చక్కదిద్దవచ్చు కదా అనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో వ్యక్తం అవుతుంది. అలాంటి ప్రయత్నం జరగకపోవడం అనేది పార్టీకి నష్టదాయకం కదా అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

తెలంగాణలో పార్టీ మారదలుచుకున్న నాయకులను చాలావరకు కేసీఆర్, కేటీఆర్ తదితర పెద్ద నాయకులు పిలిపించి మాట్లాడడం జరిగింది. వారి మాటల తర్వాత ఫిరాయింపులు అనేకం ఆగిపోయాయి కూడా. అలాంటి ప్రయత్నం ఆంధ్ర ప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నట్లుగా కనిపించడం లేదు. కష్టకాలంలో కూడా నా వెన్నంటి ఉండే వాళ్ళు మాత్రమే నా వాళ్ళు అనే సిద్ధాంతం మంచిదే. కానీ పార్టీ బలహీన పడుతున్నదనే తప్పుడు సంకేతాలు ప్రజలలోకి వెళ్లకుండా ఉండాలంటే.. కొన్ని వలసలను నివారించడం అవసరం.

పోతుల సునీత ఎమ్మెల్సీ పదవిని కూడా వద్దనుకుని పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. అదే క్రమంలో రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు ఇద్దరు కూడా.. పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి మోపిదేవి వెంకటరమణకు జగన్మోహన్ రెడ్డి రాజ్యసభ సభ్యత్వం రూపంలో ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చారు. ఆయన పార్టీ కోసం విరగబడి అందించిన సేవలు ఏమీ లేకపోయినప్పటికీ.. ఆయనను రాజ్యసభకు పంపారు. కనీస కృతజ్ఞత కూడా లేకుండా మోపిదేవి ఇప్పుడు పార్టీ మారడం పట్ల చాలామంది వైసిపి నాయకులలో అసంతృప్తి ఉంది.

కనీసం అలాంటి నాయకుడైనా సరే జగన్ ఒకసారి మాట్లాడితే పార్టీని వదిలిపోయే ఆలోచన మానుకుంటారనే అభిప్రాయం పలువురిలో ఉంది. పార్టీ ప్రతిష్టను కాపాడుకునే విషయంలో జగన్మోహన్ రెడ్డి విఫలమవుతున్నారా? వెళ్ళిపోదలుచుకున్న వారిని పిలిచి వారి అసంతృప్తి ఏమిటో తెలుసుకుని బుజ్జగించాలంటే ఆయనకు అభిమానం అడ్డుస్తోందా? లేదా పార్టీ వీడిపోదలుచుకుంటున్న నాయకుల గురించి సమాచారాన్ని అధినేతకు చేరవేయడంలో నిఘా వ్యవస్థలు విఫలమవుతున్నాయా? అనేది అర్థం కావడం లేదు.

వీటిలో ఏది నిజమైనప్పటికీ కూడా వరుసగా వలసలు పార్టీ నుంచి బయటకు జరగడం అనేది భవిష్యత్తు పరిణామాల దృష్ట్యా, ప్రజలలో ప్రతిష్ట దృష్ట్యా మంచి పరిణామం కాదు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా మేలుకొని.. మిగిలి ఉన్న నాయకులలో ఎవరెవరు అసంతృప్తితో ఉన్నారో గుర్తించి వారిని దారిలోకి తెచ్చుకునే ప్రయత్నం చేయాలని కార్యకర్తలు కోరుకుంటున్నారు.

49 Replies to “జగన్ నిఘా వ్యవస్థలు అసలు పనిచేస్తున్నాయా?”

  1. సీఎం లెవెల్ పోలీస్ ప్రొటెక్షన్ కోసం, ప్రతిపక్ష నాయకుడు అవ్వటం కోసం పోరాటం లో జ ల గ రెడ్డి చాల బిజీ

  2. Jagan is a leader who started single and did not have anything except confidence and faith. He single handedly built the momentum for the party between 2009 and 2019.

    He is currently giving time for Kootami to settle down and focus on implementing the promises they made to people. During these 5 years, Jagan can be jailed and even the remaining leaders can leave his party but his support base and his faith are enough to bring YCP back to power.

    This might sound un-realistic but it is possible.

    1. ఒకసారి అన్నాయి పాలనా రుచి చుసిన మేడ మీద తల ఉన్న తెలుగు వాళ్ళు ఇంకా అన్నాయి జీవితకాలం అక్కడే కూర్చొని నేర్చుకోమని చెప్తారు ఎన్ని ఎన్నికలైనా.. అన్నాయి బయట ఉంటె..

      1. If they were kept in dark, was the propaganda made about land titling act during last elections fake by TDP and JSP? I have read land titling act just by searching on Google which indicates that this is fake propaganda.

  3. ఆ పి చ్చి గింజా కొడుక్కి అసలు ఫోనే లేదు అన్నాడు , వాడికి అసలు బయట ఏం జరుగుతుందో ఎలా తెలుస్తుంది , ఎప్పుడైనా వార్తలు చూస్తే కదా , వాడిని లేపడం నీ వల్ల కాదు , నీ దింపుడు కల్లం ఆశలు వదిలెయ్

  4. “ఆలా కళ్ళు మూసి తెరిస్తే ఐదేళ్ళు గడిచిపోతాయి . మళ్ళీ మనం అధికారంలోకి వస్తాం .”

    ఇంకా కళ్ళు మూసేఉన్నారు … మన జగనన్న

  5. అధికారం లో ఉన్నప్పుడు గవర్నమెంట్ డబ్బులతో నిఘా సంస్థలు ని వాడుకోవచ్చు కానీ, కార్యకర్తలకి కనీసం టీ కూడా ఇవ్వని పార్టీ ప్రతిపక్షం లో ఉన్నప్పుడు సంత డబ్బులు వాడి నిఘా సంస్థని పెట్టుకుంటుందా ఎంకటి..

    ఆర్ యు ఓకే ఎంకటి ?

  6. యెంది! ఒక బీసీ నాయకుల ముందు, మా రెడ్డి కుల పార్టీ నాయకుడు తల వంచి అడగటం నా! మా నాయకుడు యొక్క కుల గజ్జి వొప్పుకోది!

  7. mopodevi case is really strange. given minister even after getting defeated. This mopidevi got it. Later given mp seat too. Poor performer who can not win in repalle in 2019 and even being mp can not get votes resonably for ysrcp candidate in recent election. Babu should give priority to his party workets/netas than these crooks who are switching to ruling side which they enjoyed in last 10 years. Good for ysrcp to loose this non perming mopidevi, someone else in repalle gets opprtunity to take over.

  8. ఏంటి GA ఎక్కడ ఉన్నావ్ నువ్వు? పార్టీ పని అయిపోయింది అది అర్థం అయ్యె వెళ్లిపోతున్నారు.

    నెక్స్ట్ ఎలక్షన్స్ లో అడుగుబొడుగు అబ్యర్దులతో వెల్లాలి ఎలక్షన్స్ కి.

    అవకాశం ఉన్నపుడు అంత నాశనం చేసుకొని అరాచకం తో రాష్ట్రాన్ని నడిపిస్తే ఎలా ఉంటుందో ఒక కేస్ స్టడీ అయ్యింది

  9. ఏమోలే వీళ్ళందరూ పార్టీకి విరగబడి పని చేయలేదని ఊరుకున్నాడేమో ఏమో మన అధినాయకుడు, అలా పార్టీకి ఇరగబడి పనిచేయని వాళ్ళు  ఉంటే అంతా పోతే ఎంత అని మౌనంగా ఉన్నారేమో మన అధ్య నాయకులు వారు, అలా ఊరుకోవటం మంచిదేమో, మరి మన అధినాయకుడు కన్నా మనకు ఎక్కువ తెలుసా ఏంటి..

  10. ఇది అది అని ఏముంది GA, జగన్ వ్యవస్థలన్నీ ఎప్పుడో షెడ్ కి వెళ్లిపోయాయి, ఇక పిసుక్కోవటమే!!

Comments are closed.