బాబు నిర్ణయం అనూహ్యం కాదు.. పనిచేస్తే చాలు!

ప్రభుత్వాలు మారినప్పుడల్లా కేవలం పథకాల పేర్లు మాత్రమే కాదు… అప్పటివరకు జరుగుతున్న వివిధ అభివృద్ధి నిర్మాణ పనులను నిర్వహించే కాంట్రాక్టర్లు, సంస్థలు కూడా మారిపోతూ ఉండడం నిజంగా శోచనీయమైన పరిణామం. Advertisement చంద్రబాబు నాయుడు…

ప్రభుత్వాలు మారినప్పుడల్లా కేవలం పథకాల పేర్లు మాత్రమే కాదు… అప్పటివరకు జరుగుతున్న వివిధ అభివృద్ధి నిర్మాణ పనులను నిర్వహించే కాంట్రాక్టర్లు, సంస్థలు కూడా మారిపోతూ ఉండడం నిజంగా శోచనీయమైన పరిణామం.

చంద్రబాబు నాయుడు పరిపాలన కాలంలో తనవారికి పనులు అప్పగించుకుంటే.. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఏదో ఒక మాట చెప్పి వారిని తొలగించి కొత్త కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. ఐదేళ్లలో పనులు ఎంతవరకు జరిగాయనేది తర్వాత సంగతి.. మళ్లీ చంద్రబాబు నాయుడు గద్దె ఎక్కిన వెంటనే తిరిగి ఆ కాంట్రాక్టర్లను రద్దుచేసి ఇప్పుడు కొత్తగా టెండర్లు పిలుస్తాను అంటున్నారు.

నిజం చెప్పాలంటే ఈ విషయంలో చంద్రబాబు నిర్ణయం అనూహ్యం కాదు. ఆయన ఇలాగే వ్యవహరిస్తారని అందరూ ముందు నుంచే అంచనా వేశారు. కాకపోతే రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నది ఒక్కటే. కాంట్రాక్టర్లను మార్చి మీ వారికి అప్పగించుకుంటే నష్టమేమీ లేదు. కనీసం మీరైనా పనులు పూర్తి చేయించండి. కేవలం నిధులు విడుదల చేయడము పనుల సమీక్షల పేరుతో డ్రామాలు నడిపిస్తూ ఊరుకోవడం అంతటితో సరి పెట్టవద్దు అని ప్రజలు కోరుతున్నారు.

బుధవారం నాడు సమావేశమైన చంద్రబాబు నాయుడు మంత్రివర్గం పోలవరం ప్రాజెక్టు విషయంలో రివర్స్ టెండరింగ్ ను రద్దు చేసింది. ప్రాజెక్టు నిర్మాణ పనులకు సరికొత్త అంచనాలు తయారవుతూ ఉన్న నేపథ్యంలో.. పనులను తిరిగి పాత పద్ధతిలోనే టెండర్లు పిలిచి కొత్త కాంట్రాక్టు సంస్థకు అప్పగించాలని నిర్ణయించారు.

అలాగే పోలవరం ఎడమ కాలువ పనుల పునరుద్ధరణ కూడా తిరిగి ప్రారంభించాలని, ఆ పనులను పాత కాంట్రాక్టర్ ద్వారానే చేయించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించింది.

పోలవరం ప్రాజెక్టు విషయంలో ఇప్పటికే రాష్ట్రానికి ఎనలేని ద్రోహం జరుగుతూ వచ్చింది. దీనిని విభజన చట్టం ప్రకారం పూర్తిగా జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత.. నిర్మాణ బాధ్యతలను కూడా వారి చేతిలోనే పెట్టి వారిని వెంటాడి పనులు పూర్తి చేయించుకోవాల్సింది బదులు.. మీరు డబ్బులు ఇవ్వండి మేం పనులు చేస్తూ పోతాం.. అంటూ తొలిసారి సీఎం అయిన చంద్రబాబు నాయుడు బేరం పెట్టినప్పుడే వ్యవహారం గాడి తప్పింది.

సోమవారం అంటే పోలవారం అంటూ డ్రమటిక్ డైలాగులు చెబుతూ చంద్రబాబు నాయుడు సమీక్షలు చేశారే తప్ప పనులు మాత్రం తదనగుణంగా జరగలేదు. దానికి తోడు కేంద్రం కూడా పెట్టిన ఖర్చులకు కూడా నిధులను ఎప్పటికప్పుడు విడుదల చేయకుండా సవతి తల్లి ప్రేమ కనపరిచింది.

జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 200 కోట్ల రూపాయల డబ్బు ప్రభుత్వ ఖజానాకు మిగిలేలాగా రివర్స్ టెండరింగ్ విధానం తీసుకువచ్చి.. కొత్త సంస్థ చేతిలో కాంట్రాక్టు పనులు పెట్టారు. అవి ఒకవైపు జరుగుతూ ఉండగానే కాఫర్ డ్యాం కొట్టుకుపోయింది. అందుకు మీరు బాధ్యులు అంటే మీరు బాధ్యులు అంటూ రాజకీయ పక్షాలు రెండు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకున్నారు.

తప్పు ఎవరిది అనేది పక్కన పెడితే .. పోలవరం ప్రాజెక్టు మాత్రం శాపగ్రస్త ప్రాజెక్టుగా మిగిలిపోయింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి మళ్ళీ కాంట్రాక్టర్లను మారుస్తున్నారు. ఇలాంటిది జరుగుతుందని ప్రజలు ఊహించారు గాని.. కనీసం ఈ ఐదేళ్లలో ఆయన ప్రాజెక్టును పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని ప్రజలు కోరుకుంటున్నారు.

19 Replies to “బాబు నిర్ణయం అనూహ్యం కాదు.. పనిచేస్తే చాలు!”

  1. Pattiseema Panulu chesindi Megha Krishna Reddy Company..Adi evari company ani CBN vallaki pani ichadu..Pani baga chese vallu kavali kani reverse tendering ani sollu cheppi em sadinchadu..200Cr migilindi antunnav chesina late valla 992Cr Dam kottukuni poindi.CBN time lo 72% panulu jarigay ani assembly lo Jagan vunnappude oppukunnadu..mari jagan entha chesadu

    1. Megha Krishna Reddy evari company ? reddy vunte YSR ki link petadamena ha ha

      evariki elections bonds ekkuva ichhadu ?

      CB tenders enduku pilavadu pedda pedda contracts ki kooda ? ha ha

      72% is big joke .

  2. Contractors are not changed yet, do not spread lies. He just scrapped the reverse tendering process, the contract department will follow the previous tendering procedure which is approved by Public Accounts department.

    The contractor for construction of diaphragm wall will be decided by Centre, there were reports earlier that Megha will be given this. Rest of the works will be accorded to winners of the tenders.

    It is yet unclear by scrapping the reverse tendering process, the existing contractors appointed by such process become null and void. Find out the answer and report, stop your guess work.

  3. ప్రజలు కోరడం కాదు.. 2029 elections గుర్తుంచుకొంది… ఎంత evm లు మనేజ్చెసిన ysrcp కి 40% vote దక్కిందన్న సంగతి మరిచి పోవద్దని.

  4. ప్రజలు కోరడం కాదు.. 2029 ఎలెక్షన్స్ గుర్తుంచుకొండి… వై ఎస్స్ ఆర్ సి పి కి 40% వొతె దక్కిందన్న సంగతి మరిచి పోవద్దని.

  5. రివర్సె టెండరింగ్ అని జగన్ పొలవరం ని సంక నాకిస్తె ఇలా ఎప్పుడన్న రాశవా గురువిందా?

    .

    ఇక అమరవతి లొ Happy Nest project రెవెర్సె టెండరింగ్ వెసాడు జగన్. అయితె ఒక్క కంట్రాక్టర్ కూడా రాలెదు. 4 సార్లు టెండర్లకి పిలిచాడు. అయినా ఒక్కడూ రాలెదు. అంటె చంద్రబాబు ఎంత తాక్కువకి ఇచ్చడొ ఇట్టె అర్ధం అవుతుంది. అలా ఉంటుంది జగన్ తొని!!

Comments are closed.