ఏ సెలబ్రిటీ అయినా అమ్మకు కొడుకే. అమ్మకు తెలిసినన్ని సంగతులు మరి ఎవరికీ తెలియవు. సంగీత దర్శకుడు తమన్ గురించి అతని తల్లి చెప్పిన మూడు నాలుగు ముచ్చట్లు కూడా ముద్దుగా వున్నాయి.
తమన్ తల్లి ఘంటసాల సావిత్రి తొలిసారి ఓ వేదిక మీదకు వచ్చారు. ఆహా ఇండియన్ ఐడిల్ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా ఆమె వచ్చిన ప్రోగ్రామ్ ప్రోమో బయటకు వదిలారు. తమన్ ను ఇంట్లో సాయి అని పిలుస్తారు అన్న సంగతి చాలా మందికి తెలుసు. ఘంటసాల సాయి శ్రీనివాస్ అలియాస్ తమన్ చిన్నప్పుడు ఎలా వుండేవాడు అని అడిగితే చాలా ముచ్చట్లే చెప్పినట్లు ప్రోమోలో కనిపిస్తోంది.
చిన్నప్పుడు క్లాస్ రూమ్ లో కన్నా ప్లే గ్రవుండ్ లో ఎక్కువగా వుండేవాడని తల్లి చెప్పారు. ఇప్పుడు కూడా అంతే. సాయంత్రం అయితే చాలు ఎక్కడ వున్నా తమన్ క్రికెట్ గ్రవుండ్ కు వెళ్లాల్సిందే. చాలా అల్లరి చేసేవాడని, అస్సలు భయం లేదని, స్కూళ్లలో గొడవలు వచ్చేవని అన్నారు. తొటి పిల్లల టిఫిన్ బాక్స్ లు ఓపెన్ చేసి తినేసేవాడని కంప్లయింట్ లు వుండేవని చెప్పారు. అలా అని స్కూలు మారిస్తే లేడీస్ స్పెషల్ లో స్కూలుకు వెళ్లేవాడని తల్లి చెప్పారు. కానీ హార్డ్ వర్కర్ అని, పని అయ్యే వరకు తిండి కూడా పట్టించుకోడని చెప్పారు.
అందరికీ తెలిసిన సంగతి ఏమిటంటే చాలా చిన్న వయసులోనే ఇంటి బాధ్యతలు తనపై వేసుకుని తమన్ చాలా కష్టపడి ఈ స్ధాయికి వచ్చారన్నది. అలాంటి తమన్ చిన్నతనంలో ఇలాంటి సరదా ముచ్చట్లు కూడా వున్నాయని ఇప్పుడు తెలిసింది.
vc estanu 9380537747
veedu copy rayudani cheppaledaa
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు