బాబు గారి పిలుపు: కండిషనల్ రెడ్ కార్పెట్!

నిజానికి నిన్నటి దాకా ప్రత్యర్థులుగా చెలరేగిపోయిన వ్యక్తులతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పని చేయడం చాలా ఇబ్బందికరమైన సంగతి

చంద్రబాబు నాయుడు చాలా సందర్భాలలో కానీ ఇప్పుడు ఎంతో మారిపోయాను అని చెప్పుకుంటూ ఉంటారు కానీ.. వాస్తవంలో ఆయన తీరు మాత్రం అలా కనిపించడం లేదు. 164 స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత కూడా.. ఆయన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయింపులను ఆశిస్తున్నారు.

ఇన్నాళ్లు ప్రత్యర్ధులుగా మెలిగిన నాయకులు ఇప్పుడు తాము అధికారంలో ఉన్న సందర్భంలో వచ్చి తమ పంచన చేరితే.. స్థానికంగా నాయకుల మధ్య విభేదాలు, అసంతృప్తులు, తగాదాలు ముదిరి పార్టీని అస్థిరత పాలు చేస్తాయని ఆయనకు బాగా తెలిసినప్పటికీ.. వైయస్సార్ కాంగ్రెస్ ను మరింతగా బలహీన పరచాలనే కుట్రతో అక్కడి నాయకులకు ఎర వేస్తుండడం గమనించాల్సిన సంగతి.

కాకపోతే వైసీపీ నుంచి ఆహ్వానిస్తున్న వారికి ఆయన నామ్కే వాస్తే అన్నట్లుగా ఒక నిబంధన పెడుతున్నారు. ఆ పార్టీ ద్వారా లభించిన పదవులకు రాజీనామా చేసిన తర్వాత మాత్రమే తెలుగుదేశంలో చేర్చుకుంటామని అంటున్నారు.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల తర్వాత ముగ్గురు తాజా మాజీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. వారు ఇప్పటిదాకా వేరే ఏ ఇతర పార్టీలోనూ చేరలేదు కూడా. నిన్న ఎమ్మెల్సీ పోతుల సునీత రాజీనామా చేశారు. అలాగే రాజ్యసభ ఎంపీలు మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు కూడా రాజీనామా లు చేసినట్లే. మరో ఆరుగురు రాజ్యసభ ఎంపీలు కూడా పార్టీని వీడుతారని ప్రచారం జరుగుతోంది.

సునీత తెలుగుదేశంలో చేరడం దాదాపు ఖరారు కాగా.. మొత్తం ఎనిమిది మంది ఎంపీలలో నలుగురు టిడిపి వైపు, నలుగురు బిజెపి వైపు చూస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు నాయుడు మాత్రం వైసిపి ద్వారా వచ్చిన పదవులకు రాజీనామా చేసి వస్తేనే తమ పార్టీలో చేర్చుకుంటాం అంటున్నారు. రాజ్యసభ ఎంపీలకు ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ కూడా రాజీనామా చేసి ఇటు వస్తున్నట్లుగా తెలుస్తోంది.

నిజానికి నిన్నటి దాకా ప్రత్యర్థులుగా చెలరేగిపోయిన వ్యక్తులతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో కలిసిమెలిసి పని చేయడం చాలా ఇబ్బందికరమైన సంగతి. ప్రస్తుతం పార్టీ ఫిరాయిస్తున్న వారిలో కొందరు క్షేత్రస్థాయిలో ప్రజలలో ఉండి పనిచేసే వారు కాదు. అలాంటి వారి విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ అక్కడ కూడా క్రియాశీలంగా ఉండే నాయకులు పార్టీ మారితేనే విభేదాలు తెరమీదకు వస్తాయి.

వైసిపి నాయకులు తమ పదవులకు రాజీనామా చేస్తే చాలు తెలుగుదేశం లో చేర్చేసుకుంటాం అంటూ కండిషనల్ రెడ్ కార్పెట్ పరిచి ఆహ్వానిస్తున్న చంద్రబాబు నాయుడు తద్వారా పార్టీలో పుట్టగల కొత్త ఇబ్బందులను ఎలా సర్దుబాటు చేసుకుంటారో వేచి చూడాలి.

9 Replies to “బాబు గారి పిలుపు: కండిషనల్ రెడ్ కార్పెట్!”

  1. పార్టీ మారే వాళ్ళందరూ జగన్ని తి ట్ట కుండా వెళ్తున్నారేంటి మళ్ళీ రేపు అధికారం వస్తే మళ్ళి పార్టీ లోకి రావచ్చు కదా అందుకేమో!! సి గ్గు లేని జన్మలు ఈ రాజకియ్య నాయుకులు

  2. గ్రేట్ ఆంధ్రా అని దొంగ పేరు తో ఎందుకు, గ్రేట్ జగన్ అని పెట్టుకోవచ్చు కదా

Comments are closed.