ప్ర‌లోభాలా… అబ్బే అలాంటిదేమీ లేదుః మోపిదేవి

పార్టీ మారుతున్న త‌న‌కు అప‌వాదులు అంట‌క‌డుతార‌ని, వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్న‌ట్టు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు. ఒక చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న కీల‌క కామెంట్స్ చేశారు. ప్ర‌లోభాల‌కు గురి…

పార్టీ మారుతున్న త‌న‌కు అప‌వాదులు అంట‌క‌డుతార‌ని, వాటిని ఎదుర్కోడానికి సిద్ధంగా ఉన్న‌ట్టు వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ అన్నారు. ఒక చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న కీల‌క కామెంట్స్ చేశారు. ప్ర‌లోభాల‌కు గురి అయ్యాన‌న‌డంలో వాస్త‌వం లేద‌న్నారు. తాను చాలా రోజులుగా వైసీపీలో అసంతృఫ్తిగా ఉన్న‌ట్టు చెప్పుకొచ్చారు. స్థానిక రాజ‌కీయాలు త‌న‌కు ఇష్ట‌మ‌ని, రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని కోరుకోలేద‌ని, ఢిల్లీకి వ‌చ్చి లాబీయింగ్ చేసుకోవాలనే ఆస‌క్తి ఎంత మాత్రం లేద‌న్నారు.

త‌న‌కు ఎమ్మెల్యే సీటు ద‌క్క‌న‌ప్పుడే స్థానిక నాయ‌కుల ఒత్తిడి మేర‌కు పార్టీని వీడాల‌ని అనుకున్న‌ట్టు ఆయ‌న చెప్పారు. అయితే ఎన్నిక‌ల స‌మ‌యంలో పార్టీని వీడ‌డం ద్రోహం అవుతుంద‌ని భావించి, అందులోనే కొన‌సాగి గెలుపు కోసం కృషి చేసిన‌ట్టు మోపిదేవి తెలిపారు.

1987లో ఎంపీపీగా త‌న కెరీర్ ప్రారంభ‌మైంద‌న్నారు. ఎమ్మెల్యే, మంత్రిగా ఏరోజూ ఆర్థిక అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ‌లేద‌న్నారు. ఆ ప‌రిస్థితిని ఎప్పుడూ తెచ్చుకోలేద‌ని ఆయ‌న అన్నారు. కానీ ఇప్పుడు ప్ర‌లోభాల‌కు లోనై పార్టీ మారుతున్న‌ట్టు ఆరోపిస్తున్న నాయ‌కుల విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్న‌ట్టు మోపిదేవి తెలిపారు.

రాష్ట్ర రాజ‌కీయాల్లో యాక్టీవ్‌గా ఉండే క్ర‌మంలో రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామా చేసి కొత్త అధ్య‌య‌నానికి తెర‌లేపేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. టీడీపీలో చేరాల‌ని నిర్ణ‌యం తీసుకోవ‌డం వాస్త‌వ‌మే అని ఆయ‌న అన్నారు. కొంద‌రు టీడీపీ పెద్ద‌ల‌తో మాట్లాడిన‌ట్టు ఆయ‌న అంగీక‌రించారు. టీడీపీలో చేరాల‌నే త‌న నిర్ణ‌యాన్ని అనుచ‌రుల్లో ఎక్కువ మంది స్వాగ‌తిస్తున్నార‌ని ఆయ‌న చెప్పారు.

6 Replies to “ప్ర‌లోభాలా… అబ్బే అలాంటిదేమీ లేదుః మోపిదేవి”

Comments are closed.