మళ్లీ బుక్కయిన దర్శకుడు

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ ఏడాది బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకు రిలీజైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఆ…

ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సినిమా ఆదిపురుష్. ఈ ఏడాది బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఇది కూడా ఒకటి. ఈ సినిమాకు రిలీజైన మొదటి రోజే ఫ్లాప్ టాక్ వచ్చేసింది. ఆ తర్వాత డిజాస్టర్ గా మారింది. ఓం రౌత్ డైరక్ట్ చేసిన ఈ సినిమా కనీసం ప్రభాస్ ఫ్యాన్స్ కు కూడా నచ్చలేదు. ఈ డిజాస్టర్ చాలదన్నట్టు వివాదాలు, కోర్టు కేసులు అదనం.

ఈ సినిమా రిలీజ్ తర్వాత దర్శకుడ్ని, ప్రభాస్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ఆడుకున్నారు. అతడ్ని చాన్నాళ్ల పాటు సోషల్ మీడియాలోకి రానివ్వలేదు. కాస్త గ్యాప్ ఇచ్చి వస్తే మళ్లీ తగులుకున్నారు. చివరికి హను-మాన్ సినిమా రిలీజ్ టైమ్ లో కూడా ఓం రౌత్ కు తిట్లు తప్పలేదు.

ఇలా ఎప్పటికప్పుడు ట్రోలింగ్ కు గురవుతున్న ఓం, ఇప్పుడు మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ కు టార్గెట్ అయ్యాడు. తాజాగా ఆదిపురుష్ పై స్పందించాడు ఓం రౌత్. ఆ సినిమాను అతడు సూపర్ హిట్ గా చెప్పుకొచ్చాడు. థియేటర్లలో వంద కోట్లకు పైగా వసూళ్లు సాధించింది కాబట్టి అది హిట్ సినిమానే అనేది అతడి వాదన.

దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కు మరోసారి మండింది. అతడిపై ఇంకో రౌండ్ ట్రోలింగ్ షురూ చేశారు. ప్రభాస్ టాపిక్ లేకుండా మాట్లాడలేవా అంటూ కొందరు కోప్పడితే.. మరిచిపోయిన గాయాన్ని మళ్లీ ఎందుకు గుర్తుచేస్తున్నావ్ అంటూ మరికొందరు తిట్లు అందుకున్నారు.

అలా ఓం రౌత్ మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ కు దొరికిపోయాడు. బహుశా, అతడిక ఆదిపురుష్ సినిమాను ఎక్కడా ప్రస్తావించకపోవడమే మంచిది. ఎందుకంటే, ఇన్నేళ్లయినా ఫ్యాన్స్ ఇంకా ఓం రౌత్ పై కోపంగా ఉండడం ఆశ్చర్యం.

5 Replies to “మళ్లీ బుక్కయిన దర్శకుడు”

  1. “ఈ ఏడాది బిగ్ బడ్జెట్ సినిమాల్లో ఇది ఒకటి” ఏం రాస్తున్నావ్ రా అది రిలీజ్ అయింది 2023 జూన్ లో…

Comments are closed.