బన్నీకి సెగ.. అలా చల్లారుస్తారంట!

ప్రస్తుతం అల్లు అర్జున్ పై తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. ఇటు పవన్ అభిమానులు, అటు జనసేన కార్యకర్తలు, కొంతమంది నేతలు, మధ్యలో మెగాభిమానులు.. ఇలా అందరూ కలిసి బన్నీని…

ప్రస్తుతం అల్లు అర్జున్ పై తెలుగు రాష్ట్రాల్లో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. ఇటు పవన్ అభిమానులు, అటు జనసేన కార్యకర్తలు, కొంతమంది నేతలు, మధ్యలో మెగాభిమానులు.. ఇలా అందరూ కలిసి బన్నీని టార్గెట్ చేశారు.

ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్తూ.. డిసెంబర్ 6న పుష్ప-2ను గన్నవరం నియోజకవర్గంలో రిలీజ్ చేయనివ్వం అంటూ సవాళ్లు కూడా విసురుతున్నారు. మొత్తానికి అటుఇటు తిరిగి ఈ వివాదం పుష్ప-2కు చుట్టుకునేలా ఉంది. కాదు..కాదు.. చుట్టుకునేలా చేస్తున్నారు కొంతమంది.

అదే జరిగితే పుష్పతో వచ్చిన క్రేజ్ ను పుష్ప-2తో బన్నీ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సినిమాతో పలు రికార్డులపై అతడు కన్నేశాడు. మరీ ముఖ్యంగా పాన్ ఇండియా రికార్డులు అతడి దృష్టిలో ఉన్నాయి.

మరి ఈ ప్రమాదం నుంచి పుష్ప-2ను గట్టెక్కించడం ఎలా? ప్రస్తుతం ఆ దిశగానే అల్లు కాంపౌండ్ లో మేధోమధనం జరుగుతుంది. అటువైపు నుంచి అల్లు కుటుంబానికి దగ్గరగా ఉన్న ఏకైక వ్యక్తి బాలకృష్ణ మాత్రమే. అతడి నుంచి సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని చూస్తున్నారట.

ముందుగా ఓ సెలబ్రేషన్…

త్వరలోనే బాలకృష్ణ 50 ఏళ్ల కెరీర్ ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. ఈ సంబరాల కోసం చాలామంది ప్రముఖుల్ని ఆహ్వానించారు. ఇటు చిరంజీవికి కూడా ఆహ్వానం అందింది, అటు అల్లు అర్జున్ ను కూడా ఆహ్వానించారు. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ లో చిరంజీవి, అల్లు అర్జున్ ను పక్కపక్కన కూర్చోబెట్టాలనేది అల్లు అరవింద్ ప్లాన్. అలా బన్నీపై ఉన్న హీట్ ను కాస్త చల్లార్చొచ్చని భావిస్తున్నారు.

ఆ తర్వాత ‘ఆహా’..

ఇక ప్లాన్-బి కూడా ఉంది. ఈసారి కూడా బాలకృష్ణతోనే పని. అన్ స్టాపబుల్ కొత్త సీజన్ షురూ కాబోతున్న సంగతి తెలిసిందే. సరిగ్గా పుష్ప-2 విడుదలకు ముందు బాలయ్య-బన్నీతో ఫుల్ ఫన్ తో ఓ ఎపిసోడ్ సెట్ చేసి వదలాలని చూస్తున్నారట. స్వయంగా బాలయ్య రంగంలోకి దిగితే కూటమి నేతలు, మరీ ముఖ్యంగా జనసేన నేతలు కాస్త చల్లారే అవకాశం ఉందని భావిస్తున్నారు.

వీటిలో మొదటి ప్లాన్ వర్కవుట్ అవుతుందా లేదా చెప్పలేం కానీ, ప్లాన్-బి మాత్రం అల్లు అరవింద్ చేతిలో పని. పైగా బాలయ్య-బన్నీతో ఇప్పటికే ఓ సీజన్ లో ముఖాముఖి పూర్తిచేశారు. కాబట్టి మరోసారి ఇద్దర్నీ కూర్చోబెట్టడం పెద్ద సమస్య కాదు.

ఇవి కాకుండా, మరో 2-3 ప్లాన్స్ కూడా అనుకుంటున్నారట. వీటిలో ఏది వర్కవుట్ అవుతుందో చూడాలి. ఎలాగైనా పుష్ప-2 రిలీజ్ వరకు అందర్నీ కూల్ చేయాలి. ఆ తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే దోరణిలో ఉన్నారంతా.

12 Replies to “బన్నీకి సెగ.. అలా చల్లారుస్తారంట!”

  1. అంటే…మన సపోర్ట్ వుండదా GA….. పాపం మీ పార్టీ లో వున్న బుర్ర తక్కువ గొర్రెల మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు GA….. ఇది అన్యాయం GA….😂😂

  2. అది వాళ్ళ ఫ్యామిలీ గోల. బాలయ్య గారితో షో చేస్తే జన సైనికులు ఎందుకు శాంతిస్తారు. లాజిక్ కి అందట్లేదు ga గారూ…

Comments are closed.