గంటా ఆల్ ఇన్ వన్

ఆయన ఆల్ ఇన్ వన్ గా ఉన్నారు. టీడీపీలో మంత్రిగా గత ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు పనిచేసిన విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ఈసారి కూటమి ప్రభుత్వంలో అవకాశం దక్కలేదు.…

ఆయన ఆల్ ఇన్ వన్ గా ఉన్నారు. టీడీపీలో మంత్రిగా గత ప్రభుత్వంలో అయిదేళ్ల పాటు పనిచేసిన విశాఖ జిల్లాకు చెందిన సీనియర్ నేత గంటా శ్రీనివాసరావుకు ఈసారి కూటమి ప్రభుత్వంలో అవకాశం దక్కలేదు. అయినా సీనియర్ నేతగా మాత్రం మీడియా ముందుకు వచ్చి తరచూ మెరుస్తున్నారు

చెప్పాల్సినది చెబుతున్నారు. టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు పాలనను మెచ్చుకుంటూనే జగన్ ని వైసీపీని తీవ్రంగా విమర్శిస్తున్నారు. అంతే కాదు అటు ప్రభుత్వ విధానాలను ఇటు పార్టీ విధానాలను విశాఖ వేదికగా చేసుకుని మాజీ మంత్రి చెప్పేస్తున్నారు.

లేటెస్ట్ గా విశాఖ వచ్చిన మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ పక్కన ఉండగానే హైడ్రా ఏపీలో కూడా వస్తుందని ఈ మాజీ మంత్రి చెప్పి సంచలనం సృష్టించారు. అప్పటిదాకా ఏపీ ప్రభుత్వం నుంచి ఎవరూ ఈ ప్రకటన చేయలేదు. ఇది ప్రభుత్వ విధాన పరమైన ప్రకటన. గంటా చెప్పిన తరువాత మంత్రి నారాయణ కూడా అదే విషయం చెప్పారు.

ఇపుడు పార్టీ పార్టీ పరమైన విధాన ప్రకటన మరొకటి గంటా చేశారు. వైసీపీ నుంచి వచ్చిన వారు అంతా తమ పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే అని కండిషన్ పెట్టారు. అలా అయితేనే పార్టీ చేర్చుకుంటుందని అన్నారు. గంటా ఈ ప్రకటన చేస్తూనే వైసీపీ మునిగిపోయే నావ అని జగన్ తప్ప ఎవరూ అక్కడ మిగలరు అని జోస్యం చెప్పారు.

తాను ఈ విషయం గతంలో ఎపుడో చెప్పాను అని కూడా ఆయనే గుర్తు చేశారు. ఇలా గంటా ప్రభుత్వం పార్టీ పరంగా కీలక ప్రకటనలు చేస్తూ తన సీనియారిటీని చాటుకుంటున్నారు. ఆయనకు మంత్రి పదవి అయితే అందని పండు అయింది. గంటా మాత్రం తాను హైలెట్ అవుతూ పార్టీ దృష్టిలో పడేలా ఎప్పటికప్పుడు చూసుకుంటున్నారు. గంటకు విస్తరణలో అయినా మంత్రి పదవి దక్కుతుందా లేదా అన్నది తెలియదు కానీ ప్రభుత్వం పార్టీ పరంగా ఆయన కీలక ప్రకటనలు చేయడం ఒక్కోసారి పెద్దలకు ఇబ్బందికరంగా మారుతోంది అని అంటున్నారు.

4 Replies to “గంటా ఆల్ ఇన్ వన్”

  1. ఎగతాళి చేసిన ఎర్ర బుక్ ఒకటో పేజీ దెబ్బకే ల0గా leven గాడు, ఆడి బ్యాచ్ ఒంటేలు పోసుకుని ఒక్కొక్కడు ‘ఆర్తనాదాలు చేసుకుంటూ కొందరు అండర్గ్రౌండ్ కి, A1 గాడు ఢిల్లీ కి, బెంగళూర్, నల్ల పిర్రల రోజా చెన్నై కి, ‘పిచ్చోడు లండన్ కి, ఇంకోడు అమెరికా కి పరుగో పరుగు.

Comments are closed.