కుంకీ ఏనుగులు ఎక్కడ పవనూ?

కుంకీ ఏనుగులను తెస్తామని ఆ మధ్యన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నాటకకు వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. సంబంధిత శాఖ మంత్రితో కలసి చర్చించారు, జాయింట్ గా మీడియా సమావేశం ఏర్పాటు…

కుంకీ ఏనుగులను తెస్తామని ఆ మధ్యన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కర్నాటకకు వెళ్ళారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశారు. సంబంధిత శాఖ మంత్రితో కలసి చర్చించారు, జాయింట్ గా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. కుంకీ ఏనుగులు వస్తే ఏపీలో ఏనుగుల బెడద దక్కుతుందని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది.

కుంకీ ఏనుగులను చూస్తే మామూలు ఏనుగులు జడుసుకుని పరుగులు తీస్తాయని ఆ విధంగా పొలాల్లోకి వచ్చి పంటను పాడు చేయడమే కాకుండా జనాలను ఇబ్బంది పెడుతున్న ఏనుగులకు ముకుతాడు వేసినట్లు అవుతుందని సర్కార్ ఆలోచిస్తోంది.

అయితే కుంకీ ఏనుగులు ఎపుడు వస్తాయో తెలియదు కానీ ఉత్తరాంధ్రలోని పార్వతీపురం మన్యంలో ఏనుగుల బెడదతో జనాలు తెగ ఇబ్బంది పడుతున్నారు. ఊర్ల మీదకు వస్తున్న గజరాజుల ధాటికి వణికిపోతున్నారు.

ఈ బాధ ఈనాటిది కాదు ఆరేళ్ళుగా ఈ ప్రాంతాన్ని నానా అల్లకల్లోలం చేస్తున్నాయి. గజరాజులు ఊరి మీదకు రావడంతో ఈ మధ్యకాలంలో పన్నెండు మంది రైతులు వాటి బారిన పడి చనిపోయారు. వేల ఏకరాలలో పంట సర్వనాశనం అయింది.

పొరుగున ఉన్న ఒడిషా నుంచి వచ్చి పడుతున్న ఏనుగుల గుంపుతో మన్యం జిల్లాలోని రైతులు పంటల మీద ఆశలు వదులు కుంటున్నారు. పండించిన దంతా ఏనుగుల పరం అని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

దీంతో కుంకీ ఏనుగులను తేవడం వల్లనే వీటి పని పట్టాలని గిరిజన రైతులు కోరుతున్నారు. పవన్ కళ్యాణ్ ఎక్కడ కుంకీ ఏనుగులు అని వీరంతా ఆశగా అడుగుతున్నారు. సాధ్యమైనంత తొందరగా కుంకీ ఏనుగులు వస్తేనే ఇక్కడ పంటతో పాటు రైతుల ప్రాణాలు కూడా నిలబడతాయని అంటున్నారు.

19 Replies to “కుంకీ ఏనుగులు ఎక్కడ పవనూ?”

  1. వాడు వెళ్ళింది కుంకి ఏనుగుల కోసం కాదు గజదొంగను ఇరికించటానికి మంతనాలు అని నీకు కూడా తెలుసు. రిజల్ట్ తొందరలో వస్తుంది, అప్పుడు రాసుకో ఈ కుంకీ ఏనుగుల కోసం మీటింగ్ అదా అని

  2. కుంకీ ఏనుగుల పేరుతో… అది కానిచ్చాడటా.. అర్థం చేసుకోరూ..!

    AP నుండి పారిపోయి బెంగళూర్ ప్యాలెస్ లో దాక్కున్న తన నాలుగో పెళ్ళాంతో రహస్యంగా హనీమూన్ చేసుకోవడానికి వెళ్లొచ్చాడనీ ప్యాలెస్ వర్గాలు లీకాయి.

    త్వరలో బాలరాజు పుడతాడని

    Yelahanka ప్యాలెస్ వర్గాలు వేయి ఎగ్ పఫ్స్ తో వెయిటింగ్

Comments are closed.