తిరుమల లడ్డూల అందజేయడంపై టీటీడీ నిర్ణయం వివాదాస్పదమైంది. దళారులను అరికట్టే పేరుతో దర్శనం చేసుకోని భక్తులకు ఆధార్ కార్డుకు కేవలం రెండు లడ్డూలను మాత్రమే అందజేస్తామని టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి తెలిపారు. బ్లాక్ మార్కెట్, దళారులను అరికట్టేందుకు మాత్రమే చిన్న మార్పు చేసినట్టు ఆయన వెల్లడించడం గమనార్హం.
నూతన విధానం ప్రకారం ఆధార్ కార్డు చూపించి రెండు లడ్డూలను తీసుకోవచ్చు. దర్శన టోకెన్ ఉన్న వారికి రద్దీని బట్టి అదనంగా 4 నుంచి 6 లడ్డూలు అందజేస్తారు. నూతన విధానంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మెజార్టీ భక్తులు టీటీడీ నిర్ణయాన్ని తప్పు పడుతున్నారు. తిరుమలంతా దళారులున్నారని టీటీడీ ఉన్నతాధికారులు అనుమానిస్తున్నారా? అని భక్తులు ప్రశ్నిస్తున్నారు.
భక్తులకు కావాల్సినన్ని లడ్డూ ప్రసాదాలను గతంలో మాదిరిగా అందజేయడానికి టీటీడీకి వచ్చిన ఇబ్బంది ఏంటని భక్తులు నిలదీస్తున్నారు. మరోవైపు తిరుమలకు వచ్చే వాళ్లంతా స్వామి దర్శనానికే అయినప్పుడు, వారికి 4 నుంచి 6 లడ్డూ ప్రసాదాలు అందజేస్తున్నాం కదా? అని టీటీడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. నిజమైన భక్తులకు తమ నిర్ణయంతో ఇబ్బంది లేదని అధికారులు వాదిస్తున్నారు.
ఏది ఏమైనా టీటీడీ నిర్ణయం వివాదాస్పదమవుతోందన్నది వాస్తవం. కనీసం భక్తులు కోరుకున్నన్ని లడ్డూ ప్రసాదాలు అందజేయడానికి మెలికలు అవసరమా? అని ఎక్కువ మంది ప్రశ్నిస్తున్నారు. టీటీడీలో మార్పు అనేది భక్తులు మెచ్చుకనేలా వుండాలే తప్ప, విమర్శలకు దారి తీసేలా కాదనే చర్చకు తెరలేచింది.
‘పోర్న్ పార్టీ” లో ఉన్న ‘పిర్రల ‘బర్రె “లడ్డూ యాపారం” కూడా పోయిందని ఈ ఏడుపు . అంతేనా యెంకు రెడ్డీ??
దర్శనం చేసుకుంటే తలకి 8 లడ్డూలు ఇస్తున్నప్పుడు..
దర్శనం చేసుకోని వారికి లడ్డూలు ఎందుకు ఇవ్వాలి??
తిరుమల లో అడుగు అడుగున brokers ఇది kadana లేని సత్యం.
తిరుమలలో అడుగు అడుగున దేముడు ఉన్నాడు లేదో తెలియదు కాని bokarollu ఉన్నారు.
vc available 9380537747
సీరియస్ గా నీ బాధ ఏంటి బ్రో..
2+6 లడ్డులు సరిపోవా ఒక పర్సన్ కి?
తిరుమల ఏమైనా స్వీట్ స్టాల్ అనుకున్నావా?
ప్రసాదం అంటేనే లిమిటెడ్ గా తినేది
okkosari ilanti decisions reverse avuthayi….ayina laddulu oorike ivvatledu kada…kavalsina qty ready chesthe saripothundi.Nenu last month vellinappudu extra laddu adigithe 2 kante ivvalaemanichepparu. e rule baagane undiga. Aadhar card ani melika petti vimarsalu koni thechukovadam enduku.
I think TTD should be refrained from Politics. Even chairman should be of senior IAS cader. Politicians should stay away from it.