సీనియర్లంతా సంక్రాంతికే!

డిసెంబర్, జ‌నవరి.. ఈ రెండు నెలలు టాలీవుడ్ సినిమాలతో దద్దరిల్లబోతున్నాయి. థియేటర్లు అన్నీ ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్లిపోతాయి. సెప్టెంబర్.. అక్టోబర్.. నవంబర్ ఒకటి అర సినిమాలు మాత్రమే వున్నాయి, కానీ డిసెంబర్…

డిసెంబర్, జ‌నవరి.. ఈ రెండు నెలలు టాలీవుడ్ సినిమాలతో దద్దరిల్లబోతున్నాయి. థియేటర్లు అన్నీ ఫుల్ ఫైర్ మోడ్ లోకి వెళ్లిపోతాయి. సెప్టెంబర్.. అక్టోబర్.. నవంబర్ ఒకటి అర సినిమాలు మాత్రమే వున్నాయి, కానీ డిసెంబర్ – జ‌నవరి నెలలు అలా కాదు. భారీ పాన్ ఇండియా సినిమాలను చూడబోతున్నాయి.

డిసెంబర్ లో బన్నీ పుష్ప 2 సినిమా వస్తుంది. ఒక రోజు ముందుగా ప్రీమియర్లతోనే పండగ మొదలైపోతుంది. అలాగే రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్ రెండు వారాల గ్యాప్ తో వస్తుంది. అది కూడా బాగా వచ్చిందని, దర్శకుడు శంకర్ పక్కా కమర్షియల్ సినిమా అందించబోతున్నాడని టాక్ వుంది.

అక్కడికి రెండు వారాలు గ్యాప్ లో సంక్రాంతి సినిమాలు మొదలవుతాయి. ముగ్గురు సీనియర్ హీరోల సినిమాలు సంక్రాంతికి ఢీ కొనబోతున్నాయి.

మెగాస్టార్- యువి సంస్థ విశ్వంభర సినిమా రెడీ అవుతోంది. ఇది భారీ పాన్ ఇండియా సినిమా.

బాలకృష్ణ- బాబీ కాంబినేషన్ సితార సినిమాను కూడా సంక్రాంతికే ఫిక్స్ చేసారు.

అలాగే వెంకటేష్- అనిల్ రావిపూడి- దిల్ రాజు సినిమాను కూడా సంక్రాంతి బరిలోకి దింపబోతున్నారు. ఇటీవలే లెంగ్తీ షెడ్యూలును పూర్తి చేసుకుందీ సినిమా.

సంక్రాంతి అంటే సెంటిమెంట్ గా ఫీలయ్యే హీరో నాగార్ఙున సినిమా ఈసారి వచ్చే సూచనలు లేవు. ఏ సినిమా కూడా షూట్ లో లేదు. కాంబినేషన్ సినిమాలు తప్ప సోలో సినిమా లేదు. పైగా సంక్రాంతి బరిలోకి దింపే సినిమా లేదు.

అందువల్ల ఈ ముగ్గురు సీనియర్ల హీరోలే ఈసారి పండుగకు వచ్చేవి. కాదు అంటే నాగ్ తన ఫ్యామిలీ తరపున చైతన్య ‘థండేల్’ సినిమాను సంక్రాంతికి బరిలోకి దింపుతారమో?

అలా అయితే యువి, గీతా, దిల్ రాజు, సితార సంస్థల నుంచి ఒక్కో సినిమా రావచ్చు. కానీ మెగాస్టార్ సినిమా వుండగా గీతా సంస్థ సినిమా వేసే పని చేయకపోవచ్చు.

11 Replies to “సీనియర్లంతా సంక్రాంతికే!”

Comments are closed.