కమల్ హాసన్ కు దశావతారం మాదిరిగా హీరో శ్రీవిష్ణును మూడు, నాలుగు అవతారాల్లో కనిపిస్తున్న సినిమా స్వాగ్. హర్షిత్ గోలి దర్శకుడు. జెండర్ డామినేషన్ లేదా మాతృస్వామ్య, పితృస్వామ్య వ్యవస్థల నేపథ్యంలో తయారవుతున్న ఈ సినిమాలో రీతూ రాయ్, నిత్య మీనన్ ఇంకా బోలెడు మంది తారాగణం వున్నారు. ఈ సినిమా ట్రయిలర్ ను విడుదల చేసారు. గ్లింప్స్ లో లైట్ గా టచ్ చేసారు రెండు మూడు కాలాల్లో జరిగే కథ అని, పితృస్వామ్య, మాతృస్వామ్య వ్యవస్థలను టచ్ చేస్తుందని. ఇప్పుడు ట్రయిలర్ లో కూడా అదే టచ్ చేసారు.
శ్రీవిష్ణు గెటప్ లు, వాటికి తగిన డైలాగులు పడ్డాయి. అసలు మొత్తం ఎన్ని క్యారెక్టర్లు అన్నది లెక్క తేల్చి చూపించినా, గెటప్ లు మాత్రం చాలానే వున్నట్లు కనిపిస్తోంది. అలాగే నాలుగైదు కాలాల్లో కథ నడిచినట్లు కనిపిస్తోంది. మరి ఇవన్నీ ఎలా మిక్స్ చేసారు, శ్రీవిష్ణు వైవిధ్యాన్ని ఎలా మేనేజ్ చేసారు ఇవన్నీ తెలియాలంటే ట్రయిలర్, తరువాత సినిమా రావాలి.
శ్రీవిష్ణు ఈ వైవిధ్యం చూపించడం కోసం ఓ క్యారెక్టర్ లో కొంత ఎక్కువ డ్రామా చేసినట్లు కూడా కనిపిస్తోంది. మరి అది సినిమాలో ఏ మేరకు పండింది లేదా ఓవర్ అయింది అన్నదాన్ని బట్టి ఫలితం వుంటుంది. ప్రస్తుతానికి టీజర్ వరకు చూసుకుంటే సినిమా మీద ఇంట్రస్ట్ జనరేట్ చేసేలాగే వుంది. ఈ సినిమాకు నిర్మాత పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్.
vc available 9380537747
vc estanu 9380537747
Call boy jobs available 8341510897
జనం పట్టించుకోరు
టాలెంటెడ్ యాక్టర్
Memu ott lo chustam