ఇటు కూలీ.. అటు కుబేర..

‘నా సామిరంగ’ తర్వాత హీరోగా మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు నాగార్జున. ఆయన ప్రత్యేక పాత్రలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా కుబేర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు కూలీ సినిమాలో కూడా…

‘నా సామిరంగ’ తర్వాత హీరోగా మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు నాగార్జున. ఆయన ప్రత్యేక పాత్రలపై ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో భాగంగా కుబేర సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇప్పుడు కూలీ సినిమాలో కూడా ఆయన నటిస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ తొలి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ. టీజర్ ఇప్పటికే పెద్ద హిట్టయింది. ఇప్పుడీ ప్రాజెక్టులోకి నాగార్జున చేరినట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

నిజానికి కూలీలో నాగార్జున ఉన్నట్టు గతంలోనే పుకార్లు వినిపించాయి. కానీ నాగ్ తరఫు వ్యక్తులు ఎప్పటికప్పుడు ఆ మేటర్ ను ఖండిస్తూ వచ్చారు. ఫైనల్ గా కూలీలో నాగ్ ఉన్నాడనే విషయం పక్కా అయింది. మరో క్రేజీ మేటర్ ఏంటంటే, ఈ సినిమాలో రజనీకాంత్ కు విలన్ గా సైమన్ పాత్రలో నాగ్ కనిపించబోతున్నాడు.

నాగార్జున పుట్టినరోజు సందర్భంగా కూలీ నుంచి అతడి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చేతికి బంగారు వాచీ ధరిస్తున్న నాగ్ ఫొటోను విడుదల చేశారు. ఈ సినిమాలో కన్నడ నటుడు ఉపేంద్ర కూడా నటిస్తున్నాడు.

ఇక నాగ్ బర్త్ డే సందర్భంగా ధనుష్ హీరోగా నటిస్తున్న కుబేర నుంచి కూడా ఓ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమా నుంచి నాగ్ గ్లింప్స్ ఆల్రెడీ రిలీజైంది. తాజా లుక్ అదనం.

గమ్మత్తైన విషయం ఏంటంటే.. రజనీకాంత్-ధనుష్ ఒకప్పుడు మామాఅల్లుళ్లు. ఇటు మామ సినిమాలో, అటు అల్లుడి సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నాడు నాగ్.

6 Replies to “ఇటు కూలీ.. అటు కుబేర..”

Comments are closed.