రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ఎవ‌రెవ‌రు వుంటారు?

పార్టీ మార్పు ప్ర‌చారంపై ఆర్‌.కృష్ణ‌య్య‌, గొల్ల బాబూరావు గోడ‌మీద పిల్లిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు.

వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యుల ఫిరాయింపుల‌పై విస్తృత చ‌ర్చ జ‌రుగుతోంది. అధికారం లేకుంటే ప‌క్క చూపులు చూడ‌డం స‌ర్వ‌సాధార‌ణ‌మైంది. ముఖ్యంగా వ్యాపార‌వేత్తలైన ప్ర‌జాప్ర‌తినిధుల గురించి ప్ర‌త్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవ‌స‌ర‌మే లేదు. గ‌తంలో టీడీపీకి చెందిన న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో ఏ ర‌కంగా చేరారో అంద‌రికీ తెలిసిందే. ఇప్పుడు అదే రీతిలో వైసీపీ రాజ్య‌స‌భ స‌భ్యులు కూడా పార్టీ వీడుతార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మోపిదేవి వెంక‌ట‌ర‌మ‌ణ‌, బీద మ‌స్తాన్‌రావు త‌మ రాజీనామాల‌ను ఇవ్వ‌డం కూడా జ‌రిగిపోయింది. అంతా ప‌క్కా వ్యూహంతో వాళ్లు ముందుకెళుతున్నారు. ఇదే సంద‌ర్భంలో పార్టీలో ఎవ‌రెవ‌రు కొన‌సాగుతార‌నే లెక్క‌లు వైసీపీ పెద్ద‌లు వేసుకుంటున్నారు. న‌మ్మ‌కంగా పార్టీలోనే కొన‌సాగే ఎంపీలు ఆరేడుగురు వుంటార‌ని వైసీపీ పెద్ద‌లు అంచ‌నా. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పార్టీ మారే ప్ర‌శ్నే లేద‌ని మేడా ర‌ఘునాథ్‌రెడ్డి, పిల్లి సుభాష్ ప్ర‌క‌టించ‌డం వైసీపీలో జోష్ నింపింది.

దీంతో వైసీపీలో కొన‌సాగే ఎంపీల్లో వైవీ సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్‌, మేడా ర‌ఘునాథ్‌రెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి, అయోధ్య రామిరెడ్డి, నిరంజ‌న్‌రెడ్డి, ప‌రిమ‌ళ్ న‌త్వానీ న‌మ్మ‌కంగా ఉన్నారు. రాజ్య‌స‌భ స‌భ్యులంతా టీడీపీ, బీజేపీల‌లో చేరుతార‌నే ప్ర‌చారం టీడీపీ అనుకూల మీడియా మైండ్ గేమ్‌గా వైసీపీ చూస్తోంది.

ఇక పార్టీ మార్పు ప్ర‌చారంపై ఆర్‌.కృష్ణ‌య్య‌, గొల్ల బాబూరావు గోడ‌మీద పిల్లిలా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని వైసీపీ నేత‌లు అంటున్నారు. వాళ్లిద్ద‌రు పార్టీలో కొన‌సాగ‌డంపై అనుమాన‌మే అని అంటున్నారు. ఎంపీలు పార్టీ మార‌డంపై వైఎస్ జ‌గ‌న్ ఇంత వ‌ర‌కూ నోరు మెద‌ప‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

8 Replies to “రాజ్య‌స‌భ స‌భ్యుల్లో ఎవ‌రెవ‌రు వుంటారు?”

  1. విజయసాయిరెడ్డి ని విజయ”శాంతి”రెడ్డి గా మార్చిన సజ్జల నీ హీరోయిన్ ‘కేసులో ఇరికించి A2 కూడా బీజేపీ కి ‘జంప్ అంటున్న తాడేపల్లి కోటలో గుసగుసలు

Comments are closed.