చట్టసవరణతోనైనా కార్పొరేషన్లు కొల్లగొట్టాల్సిందే!

అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. స్థానిక సంస్థలు అన్నింటి మీద కూడా కూటమి జెండా ఎగురవేయాలని తెలుగుదేశం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ వస్తోంది. కొన్ని చోట్ల పాచికలు…

అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ సాధించి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి.. స్థానిక సంస్థలు అన్నింటి మీద కూడా కూటమి జెండా ఎగురవేయాలని తెలుగుదేశం చాలా గట్టి ప్రయత్నాలే చేస్తూ వస్తోంది. కొన్ని చోట్ల పాచికలు పారుతున్నాయి. ప్రలోభాలు పనిచేస్తున్నాయి. చాలాచోట్ల వారు అనుకున్నట్టుగా వ్యవహారం ముందుకు సాగడం లేదు. అయినా సరే.. ఏదో ఒక వక్రమార్గాలు అన్వేషించి.. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు దక్కించుకోవాలనే కుట్రను బాహాటంగానే సాగిస్తున్నారు.

కుట్రలను కూడా బాహాటంగా బయటకు చెప్పుకుంటూ ఉండడం ఇప్పటి ప్రభుత్వంలో ఒక విచిత్రమైన పరిస్థితిగా కనిపిస్తోంది. అవసరమైతే చట్టసవరణ అయినా చేస్తామని, అసెంబ్లీలో చట్టం సవరించి కార్పొరేషన్లు దక్కించుకుంటాం అని సాక్షాత్తూ మంత్రి లోకేష్ అంటున్నారు.

విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఫిరాయించి తమ పార్టీలోకి వచ్చిన వారందరికీ నారా లోకేష్ ఇలాంటి హామీ ఇవ్వడం గమనించాల్సిన సంగతి. విశాఖలో పర్యటించిన నారా లోకేష్ అక్కడ తమ పార్టీ కార్యాలయంలో విశాఖ కార్పొరేటర్లతో సమావేశం అయ్యారు. వీరిలో పలువురు ఇటీవల వైసీపీ నుంచి వచ్చి చేరిన వారే కావడం విశేషం.

గత ప్రభుత్వ హయాంలో విశాఖ కార్పొరేషన్లో భారీగా అవినీతి జరిగిందని దానికి అడ్డుకట్ట వేయాలని ఆయన వారికి హితబోధ చేశారు. అయితే అందుకు ఒకరిద్దరు కార్పొరేటర్లు స్పందిస్తూ.. జీవీఎంసీలో అధికారం వైసీపీ చేతిలో ఉన్నదని చెప్పుకొచ్చారు. మేయర్ పీఠం కూటమికి దక్కాలంటే.. చట్టం అడ్డు వస్తుందని గుర్తు చేశారు.

జగన్మోహన్ రెడ్డి హయాంలో స్థానిక సంస్థలు అస్థిరతకు గురికాకుండా ఉండడానికి ఒక ప్రత్యేక చట్టం చేశారు. ఈ సంస్థల విషయంలో తాయిలాల రాజకీయాలు కీలకంగా వ్యవహారాల్ని నడిపిస్తాయి గనుక.. చీటికీ మాటికీ కూలిపోకుండా.. నాలుగేళ్లు గడిస్తే తప్ప అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదంటూ చట్టం తెచ్చారు. ఇప్పటి దాకా తెలుగుదేశానికి దక్కిన మునిసిపాలిటీలన్నీ ఛైర్మన్ కూడా వైసీపీకి రాజీనామా చేసి వారి పార్టీలో చేరడం ద్వారా దక్కినవి మాత్రమే. ఛైర్మన్ పార్టీ మారకుండా.. కార్పొరేటర్లు ఎందరు మారినా.. అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉండదు.

ఫిరాయింపుల ద్వారా కార్పొరేషన్లు దక్కించుకోవడమే లక్ష్యం అన్నట్టుగా.. నారా లోకేష్ వారితో, జగన్ సర్కారు చేసిన చట్టానికి అసెంబ్లీలో సవరణ చేసే అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇవ్వడం విశేషం. విశాఖపట్నం రాష్ట్రంలో అతిపెద్ద నగరం అని, ఇక్కడ నీతివంతమైన పాలన ఉంటే మిగిలిన ప్రాంతాలకు ఆదర్శంగా ఉంటుందని సుద్దులు చెబుతున్న లోకేష్.. ఇక్కడ ఫిరాయింపుల విషయంలో నైతిక విలువలు పాటిస్తే రాష్ట్రమంతా నైతికత రాజ్యమేలుతుందని ఎందుకు అనుకోవడం లేదో మరి!

13 Replies to “చట్టసవరణతోనైనా కార్పొరేషన్లు కొల్లగొట్టాల్సిందే!”

  1. నక్క నీతిని పాలించే నీతి లేని కుక్కలు… గంటకోసారి భలే చమత్కార భరిత నీతులను ఏరుగుతుంటుంటే… చదివేందుకు కష్టంగా ఉన్నా.. కాసేపటికి నవ్వులతో సర్దుబాటు అయిపోతోందిలే.. పిచ్చి జీయే…

    సందిగ్ధంలో… సమస్యలో… ప్రతి కుక్క నీతులే చెబుతుంది… నీకులాగా…

    అధికారం ఉన్నప్పుడు వాటికి వేరే పేరు ఉంటుందిలే.. నువ్వేం వెలగబెట్టావో నీకు తెలుసుగా.. ఇప్పుడు ఊరోళ్లు అందరిపై ఏడుపు లంకించుకున్నావు… అదే తేడా.

    ఉసురు ఊరికే పోదురోయ్… శ్రీకృష్ణుడికే తప్పలేదు… నీ నాశనానికి వినాశన క్రియాధర్మం… నీ స్వీయ విరచితం… దానికి సాక్ష్యం… ఈ వెబ్‌సైట్‌లో నీ అధీన పూర్వక కథనాలు.

  2. ఊరోళ్ల ఉచ్చ తాగినా సరే.. ఉచ్ఛ స్థితి నీతి ప్రదర్శన…

    ఒరేయ్ జీయే….

    యువ్వార్ ఏ రోల్ మోడల్… ట్రెండ్‌సెట్టర్‌… పాథ్ బ్రేకర్…

  3. అందరి చేతా రాజీనామా చేయిస్తే వాటికి ఉప ఎన్నికల తంతు ఉండదా? టీడీపీ టికెట్ మీద ఎన్నిక చేయించలేరా?

  4. "నాలుగేళ్లు గడిస్తే తప్ప అవిశ్వాస తీర్మానం పెట్టడానికి వీల్లేదంటూ చట్టం తెచ్చారు."
    idhemi chattam ra babu...?
    1. అడ్డా గోలుగా ఏకగ్రీవాలు చేసుకున్నారు కదా .. దాన్ని కాపాడుకోవడం కోసం చేసుకుని వుంటారు ..

    2. సకల కళా వల్లభన్ ( ఓహ్, సకల శాఖా మంత్రి) మైండ్ లో పుట్టిన ఐడియా అనుకుంట

  5. Orey great Andhra 4 yellu gadiche varaku aviseasam pettakudadu ani jaganmohan reddy kadu ra chattan chesindi 1964 lone chattan chesaru ra nv ne dabba aapu inka

  6. వారే గా గా నిన్ను తిడితే నిజంగా బూతులు కూడా సిగ్గు పడతయ్యేమోరా బాబు. థు…నువ్వు నీ నీతి సూత్రాలు. అయినా నాలుగు సంవత్సరాల దాకా అవిశ్వాసం పెట్టకుండా ఉండటం ఒక ప్రజాస్వామ్య విలువ,దానికోసం ఒక చట్టం. దాన్ని సవరిస్తే అది ఒక అడ్డదారి. సిగ్గుందారా నీకు? నీదొక పత్రిక. నీవొక పాత్రికేయుడివి. కాదురా బాబూ నువ్వొక కాలకేయుడివి.

Comments are closed.