విప‌త్తుల‌న్నింటికీ వైసీపీనే కార‌ణ‌మా?

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎలాంటి ప్ర‌మాదం జ‌రిగినా అందుకు గ‌త వైసీపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని విమ‌ర్శించ‌డం కూట‌మి ప్ర‌భుత్వానికి అల‌వాటుగా మారింది. ఇటీవ‌ల ఉమ్మ‌డి విశాఖ జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆ దుర్ఘ‌ట‌న‌లో…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎలాంటి ప్ర‌మాదం జ‌రిగినా అందుకు గ‌త వైసీపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని విమ‌ర్శించ‌డం కూట‌మి ప్ర‌భుత్వానికి అల‌వాటుగా మారింది. ఇటీవ‌ల ఉమ్మ‌డి విశాఖ జిల్లాలోని ఫార్మా కంపెనీలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఆ దుర్ఘ‌ట‌న‌లో 17 మంది కార్మికులు చ‌నిపోగా, మ‌రికొంద‌రు తీవ్ర‌గాయాల‌పాల‌య్యారు. ఇందుకు వైసీపీ ప్ర‌భుత్వమే కార‌ణ‌మ‌ని సీఎం చంద్ర‌బాబు, మంత్రులు ఆరోపించిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా వ‌ర‌ద‌లు విజ‌య‌వాడ‌ను ముంచెత్తాయి. ఇందుకు కూడా వైసీపీ ప్ర‌భుత్వ‌మే కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు, మంత్రులు ఆరోపించ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌మాదాల‌న్నింటికీ వైసీపీ ప్ర‌భుత్వం కార‌ణం, మంచి జ‌రిగితే మాత్రం త‌మ గొప్పే అని చెప్పుకోవ‌డం చంద్ర‌బాబు స‌ర్కార్‌కు అల‌వాటుగా మారింది.

పోల‌వ‌రం జ‌లాశయానికి రూ.12 వేల కోట్ల‌కు పైగా కేంద్ర ప్ర‌భుత్వం అడ్వాన్స్ ఇవ్వ‌డానికి గ‌త వైసీపీ ప్ర‌భుత్వం ప‌లు ద‌ఫాలుగా చేసిన విన‌తులు కార‌ణం. అయితే డ‌యాఫ్ర‌మ్ వాల్ విష‌య‌మై ఎటూ తేల‌క‌పోవ‌డంతో జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కేంద్రం అడ్వాన్స్ సొమ్ము ఇవ్వ‌లేదు. ఇప్పుడు క్లారిటీ రావ‌డంతో నిధుల్ని విడ‌త‌ల వారీగా ఇవ్వ‌డానికి కేంద్రం ఓకే చేసింది.

అలాగే శ్రీ‌సిటీలో కొన్ని పారిశ్రామిక సంస్థ‌ల స్థాప‌న‌కు చంద్ర‌బాబునాయుడు శంకుస్థాప‌న చేశారు. ఇందుకు కూడా జ‌గ‌న్ స‌ర్కార్ కృషే కార‌ణం. దీన్ని కూడా చంద్ర‌బాబు స‌ర్కార్ త‌న ఖాతాలో వేసుకోవ‌డం విశేషం. మంచి జ‌రిగితే , అంతా త‌మ వ‌ల్లే అని చెప్పుకోవ‌డం ఈ ప్ర‌భుత్వానికే చెల్లింద‌న్న విమ‌ర్శ వైసీపీ నుంచి వ‌స్తోంది. త‌మ హాయంలో చేసిన మంచి గురించి చెప్పుకోక‌పోవ‌డం వైసీపీ స‌ర్కార్ చేత‌కానిత‌నంగా చూడాలి.

20 Replies to “విప‌త్తుల‌న్నింటికీ వైసీపీనే కార‌ణ‌మా?”

  1. Jagan government constructed retaining wall to save Vijayawada from floods to some extent… Great initiative from him… Cbn also should plan the same for more precautionary measures

  2. పోలవరం దాక ఎందుకులే GA …..కాలవల్లో పూడికలు తియ్యడం, గట్లు బాగు చెయ్యడం ,GATES కి చిన్న చిన్న repairs చెయ్యడం అనేది ఎండాకాలంలో చేసే ఒక సాధారణమైన పని…..ఓటుబ్యాంకు పాలిటిక్స్ మత్తులో … ఈ 5YRS అలాంటి చిన్న చిన్న పనులకు కూడా డబ్బు లేకుండా చేసి STATE ను సర్వనాశనం చేశారు…..అన్నమయ్య dam ,ippudu బుడమేరు….ఇలా లెక్కలేనన్ని…..

    1. మరి మీకు గుర్తుంటే, చంద్ర బాబు గారు పూడికలు ఎప్పుడు తీయించారో చెప్పండి..

  3. హలో గ్రేట్ ఆంధ్రా అంతకుముందు జగన్ చేసిన పని ఏమిటి విజయవాడ లో నోవా హోటల్ ఎదురుగా వేసిన ఫ్లై ఓవర్, కనకదుర్గమ్మ టెంపుల్ దగ్గర వేసిన ఫ్లై ఓవర్ చంద్రబాబు గారి హయాంలో పూర్తయితే అప్రోచ్ రోడ్లు ఎన్నికల తరువాత పూర్తి అయితే జగన్ ఏమి చెప్పాడు నేనే అని చెప్పలేదా. కేవలం రెండు నెలలోనే అంత లాంగ్ ఫ్లై ఓవర్లు పూర్తి చేసిన జగన్ గారి ఘనతకు జపాన్, చైనా దేశాలే ఆశ్చర్య పోయాయి. అప్పుడేమయ్యాయి నీ వ్రాతలు

  4. తెలుగు దేశం నాయకులను వారి పెళ్ళాలు తిట్టినా అందుకు కారణం వై సీ పి అంటారు.

  5. Last 5 years dams and canal bunds maintenance ki coat entapettaro teliste reality ardham avutundhi .compare avg cost of last 5years vs previous terms considering inflation ,reality will be before you.

    Last 5 years dam and river stream irrigation maintenance is literally zero.

    Inkosari all free iste dams kooda kottuku pothayi

Comments are closed.