కేంద్ర సాయం ఏదీ?

తుపాను ప్ర‌భావంతో కోస్తా జిల్లాలో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో మోస్తారు వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తింది. అలాగే ల‌క్ష‌లాది ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగిందని వార్త‌లొస్తున్నాయి. అయితే…

తుపాను ప్ర‌భావంతో కోస్తా జిల్లాలో విస్తారంగా వ‌ర్షాలు కురిశాయి. కొన్ని జిల్లాల్లో మోస్తారు వ‌ర్షాలు ప‌డ‌తాయ‌ని వాతావ‌ర‌ణ‌శాఖ హెచ్చ‌రించింది. విజ‌య‌వాడ‌ను వ‌ర‌ద ముంచెత్తింది. అలాగే ల‌క్ష‌లాది ఎక‌రాల్లో పంట న‌ష్టం జ‌రిగిందని వార్త‌లొస్తున్నాయి. అయితే వర్షం, వ‌ర‌ద‌లు త‌గ్గుముఖం ప‌డితే త‌ప్ప‌, పంటల న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌లేరు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ వ‌ర్షం, ప్రాణ‌, ఆస్తి న‌ష్టం సంభ‌వించ‌డంపై కేంద్ర పెద్ద‌లు దృష్టి సారించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడి, క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితుల గురించి ఆరా తీశారు. అలాగే ఏపీ సీఎం చంద్ర‌బాబునాయుడితో ప్ర‌ధాని మోదీ ఫోన్‌లో మాట్లాడి ఆరా తీశారు. కేవ‌లం మాట‌ల‌తో స‌రిపెట్ట‌డం త‌ప్ప‌, త‌క్ష‌ణం సాయాన్ని మాత్రం ప్ర‌క‌టించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం.

యుద్ధ ప్రాతిప‌దిక‌న రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఎంతోకొంత ఆర్థిక సాయాన్ని ప్ర‌క‌టించి వుంటే బాగుండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. కేంద్రం నుంచి ఆ భ‌రోసా ల‌భించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంది. ఎందుక‌నో కేంద్ర ప్ర‌భుత్వంలో మాన‌వీయ కోణం అస‌లు ఉండ‌డం లేదన్న ఆవేద‌న తెలుగు ప్ర‌జానీకంలో వుంది. హ‌క్కుగా రావాల్సిన‌వి కూడా కేంద్ర ఇవ్వ‌క‌పోవ‌డాన్ని ఈ సంద‌ర్భంగా ప్ర‌జానీకం గుర్తు చేసుకుంటున్నారు.

మ‌రీ ముఖ్యంగా ఏపీ విష‌యంలో అయినా కేంద్రం ఉదారంగా వ్య‌వ‌హ‌రించాల్సింది. ఎందుకంటే ఏపీలో ఎన్డీఏ స‌ర్కార్ ఉంది. తానే అధికారంలో ఉన్న‌ప్పుడు వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా నిల‌బ‌డ‌క‌పోతే ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త రాకుండా వుంటుందా? ఈ విష‌యాన్ని కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు ఎందుకు ఆలోచించ‌డం లేదో మ‌రి!

11 Replies to “కేంద్ర సాయం ఏదీ?”

  1. నిన్న రాత్రి చంద్రబాబు ఫోన్ చేసి మాట్లాడారు ఈ రోజు ఉదయం 40 బోట్లు 6 హెలికాప్టర్లు 100 మంది NDRF సిబ్బందిని ఏర్పాటు చేశారు ఇక వరద నష్టం అనేది వరద తాకిడి ప్రాంతాల్లో సర్వే చేసి నివేదిక ఆధారంగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేస్తారేమో చూడాలి

Comments are closed.