టీడీపీకి షాక్‌.. మిధున్ స‌మ‌క్షంలో!

టీడీపీలో పార్టీ ఫిరాయించిన పుంగ‌నూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ అలీంబాషా, అలాగే మ‌రో 8 మంది కౌన్సిల‌ర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీలో చేర్చుకుని, ఆ త‌ర్వాత ప‌ట్టించుకోక‌పోవ‌డంపై మ‌న‌స్తాపం చెంది, తిరిగి వైసీపీలో…

టీడీపీలో పార్టీ ఫిరాయించిన పుంగ‌నూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ అలీంబాషా, అలాగే మ‌రో 8 మంది కౌన్సిల‌ర్లు ఆ పార్టీకి షాక్ ఇచ్చారు. పార్టీలో చేర్చుకుని, ఆ త‌ర్వాత ప‌ట్టించుకోక‌పోవ‌డంపై మ‌న‌స్తాపం చెంది, తిరిగి వైసీపీలో రాజంపేట ఎంపీ మిధున్‌రెడ్డి స‌మ‌క్షంలో చేర‌డానికి సిద్ధ‌మ‌య్యారు.

నెల క్రితం టీడీపీలో చేరిన పుంగ‌నూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ అలీంబాషాతో మ‌రో 8 మంది కౌన్సిల‌ర్లు, అలాగే వ‌క్ఫ్‌బోర్డు జిల్లా అధ్య‌క్షుడు అమ్మూను తిరిగి త‌మ వైపు తిప్పుకున్నారు. వాళ్లంద‌రినీ ఇవాళ తిరుప‌తి వేదిక‌గా వైసీపీలోకి మిధున్‌రెడ్డి ఆహ్వానించ‌నున్నారు.

ఈ ద‌ఫా ఎన్నిక‌ల్లో వైసీపీ గెలిచిందే 11 అసెంబ్లీ, 4 పార్ల‌మెంట్ స్థానాల్లో. వీటిలో రెండు అసెంబ్లీ, ఒక పార్ల‌మెంట్ స్థానాల్లో పెద్దిరెడ్డి కుటుంబ స‌భ్యులు గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. వైసీపీలో పెద్దిరెడ్డి కుటుంబం కీల‌కంగా మార‌డంతో, ఎలాగైనా దెబ్బ‌తీయాల‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ ప‌ట్టుద‌ల‌తో వుంది. ఈ నేప‌థ్యంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న పుంగ‌నూరులో ఆయ‌న్ను దెబ్బ కొట్టేందుకు మున్సిపాల్టీని హ‌స్త‌గ‌తం చేసుకోడానికి టీడీపీ ఎత్తుగ‌డ వేసింది.

ఇందులో భాగంగా పుంగ‌నూరు మున్సిప‌ల్ చైర్మ‌న్ అలీంబాషాతో పాటు మ‌రో 8 మంది కౌన్సిల‌ర్ల‌ను టీడీపీ ఇన్‌చార్జ్ చ‌ల్లా బాబు పార్టీలో చేర్చుకున్నారు. మున్సిప‌ల్ చైర్మ‌న్‌, కౌన్సిలర్ల‌తో ప్రెస్‌మీట్ పెట్టించి, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డిని తిట్టించారు. ఆ త‌ర్వాత మున్సిప‌ల్ చైర్మ‌న్‌, కౌన్సిల‌ర్లు చ‌ల్లా బాబు, టీడీపీ ముఖ్య నాయ‌కుల‌కు కాల్ చేసినా, క‌నీసం రిసీవ్ చేసుకునే ప‌రిస్థితి లేక‌పోయింది.

దీంతో తాము మోస‌పోయామ‌ని చైర్మ‌న్‌, కౌన్సిల‌ర్ల‌కు అర్థ‌మైంది. వైసీపీని వీడి త‌ప్పు చేశామ‌ని గ్ర‌హించి, ఆ త‌ర్వాత మిధున్‌రెడ్డికి రాయ‌బారం పంపిన‌ట్టు తెలిసింది. మున్సిప‌ల్ చైర్మ‌న్‌, కౌన్సిల‌ర్ల‌తో మిధున్‌రెడ్డి చ‌ర్చించి, వైసీపీలో చేర్చుకోడానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. వాళ్లంద‌రూ రాజంపేట ఎంపీ స‌మ‌క్షంలో వైసీపీ కండువాలు క‌ప్పుకోడానికి ఇవాళ ముహూర్తాన్ని ఖ‌రారు చేసుకున్నారు. కేవ‌లం టీడీపీ కండువాలు వేయ‌డం, ఆ త‌ర్వాత ప‌ట్టించుకోక‌పోవ‌డం… ఇదే తంతు అని పార్టీ మారిన నేత‌లు వాపోతున్నారు. క‌నీసం నెల కూడా టీడీపీలో కొన‌సాగ‌లేక‌పోవ‌డంపై స‌ర్వ‌త్రా చ‌ర్చ జరుగుతోంది.

5 Replies to “టీడీపీకి షాక్‌.. మిధున్ స‌మ‌క్షంలో!”

  1. వై నాట్ వైసిపి పార్టీ ఖాళీ అవుతున్నది.?

    వైసిపి పార్టీ ..

    ఎంపీలు …

    ఎమ్మెల్సీలు..

    ఎమ్మెల్యేలు..

    జిల్లా పరిషత్ చైర్మన్లు…

    కార్పొరేషన్ మేయర్లు..

    మున్సిపల్ చైర్మన్ లు..

    సర్పంచులు..

    Z.P.T.C.లు..

    M.P.T.C.లు..

    వాట్ ఇస్ దిస్…

    జగన్ రెడ్డి…

Comments are closed.