రెస్ట్‌ మోడ్‌లో వైసీపీ నేతలు

పార్టీ ఓడింది, జనాలు టీడీపీ కూటమిని గెలిపించారు అనుకుంటూ వైసీపీ నేతలు రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మూడు నెలలు గడచినా వారు ఇంకా యాక్టివ్‌ మోడ్‌లోకి రావడంలేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ…

పార్టీ ఓడింది, జనాలు టీడీపీ కూటమిని గెలిపించారు అనుకుంటూ వైసీపీ నేతలు రెస్ట్‌ మోడ్‌లోకి వెళ్లిపోయారు. మూడు నెలలు గడచినా వారు ఇంకా యాక్టివ్‌ మోడ్‌లోకి రావడంలేదు. ముఖ్యంగా ఉమ్మడి విశాఖ జిల్లాలో వైసీపీ నేతలలో నిస్జేజం పూర్తిగా కనిపిస్తోంది.

పార్టీ అధికారంలో ఉన్నపుడు అంతా తామే అన్నట్లుగా వ్యవహరించిన వారు ఇపుడు గప్‌చుప్‌ అయ్యారు. ఎక్కడ ఎవరు ఉంటున్నారో కూడా తెలియడంలేదు అన్నది కార్యకర్తల మాట. పార్టీని ప్రతిపక్షంలో ఉన్నపుడే గట్టిగా నిలబడి నడిపించాల్సిన అవసరం ఉందని కానీ వైసీపీ నేతలు మాత్రం చడీ చప్పుడూ చేయడంలేదని వాపోతున్నారు.

వైసీపీ కార్యకర్తలకు పార్టీ తరఫున పోరాడాలని ఉంది. కానీ నాయకులు దిశా నిర్దేశం చేయడంలేదు. ఇటీవల ముగిసిన గ్రామ సభలలో వైసీపీ మద్దతుదారులైన సర్పంచులను వేదికను ఎక్కించకుండా అవమానించినా కూడా పార్టీ నాయకులు ఎవరూ పట్టించుకోకపోవడం పట్ల కూడా కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

పార్టీ అభిమానంతో కూటమి నుంచి వచ్చే సవాళ్లకు జవాబు ఇస్తున్నా వారి బలం సరిపోవడంలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులుగా చేసిన వారు మాత్రం సైలెంట్‌ కావడంతో గ్రామాలలో ఫ్యాన్‌ పార్టీ క్యాడర్‌ ఆగ్రహంగా ఉంది. అధినాయకత్వం మొత్తం పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతోంది.

5 Replies to “రెస్ట్‌ మోడ్‌లో వైసీపీ నేతలు”

  1. మొగుడి కి మగతనం వుంటే పక్క చూపులు ఎందుకు అన్నట్లు , అసలు పార్టీ పెట్టిన వాడికే లెక్క లేనప్పుడు, మిగతా వాళ్ళకి ఏమి అవసరం.

Comments are closed.