ఇకపై ఏపీలో అడ్డగోలు రేట్లు వుండవా?

టికెట్ రేట్లు భారమై, కామన్ ప్రేక్షకుడు రాను రాను థియేటర్ కు దూరం అవుతున్నారు. అయినా కూడా భారీ సినిమాకు ఎవడికోసం వస్తాడు అన్నట్లుగా వందల కొద్దీ రేట్లు పెంచేస్తున్నారు. Advertisement వైఎస్ జ‌గన్…

టికెట్ రేట్లు భారమై, కామన్ ప్రేక్షకుడు రాను రాను థియేటర్ కు దూరం అవుతున్నారు. అయినా కూడా భారీ సినిమాకు ఎవడికోసం వస్తాడు అన్నట్లుగా వందల కొద్దీ రేట్లు పెంచేస్తున్నారు.

వైఎస్ జ‌గన్ ప్రభుత్వం హయాంలో టికెట్ రేట్లకు కాస్త కళ్లెం వేసే ప్రయత్నం చేసారు. రీజ‌నబుల్ పెంపు తప్ప అబ్ నార్మల్ పెంపు అన్నది లేదు. ఇలాంటి టైమ్ లో ప్రభుత్వం మారింది. ఇక తమ ఇష్టం వచ్చినట్లు రేట్లు పెంచేస్తారు అనే టాక్ వినిపించింది.

దానికి తగినట్లే కల్కి సినిమాకు రేట్లు భయంకరంగా పెంచేసారు. కొన్ని చోట్ల నాలుగు వందలకు పైగా రేటు పెట్టారు. అయితే ఇప్పుడు ఇదే వికటించినట్లు తెలుస్తోంది. ఈ టికెట్ రేట్లు పెంచడం మీద ప్రభుత్వానికి ఫీడ్ బ్యాక్ వెళ్లినట్లు తెలుస్తోంది. దాంతో ఇకపై 50-75 కు మించి అదనపు రేట్లు ఇవ్వకూడదని ప్రభుత్వం సంబంధిత అధికారులకు అదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. అంటే సింగిల్ స్క్రీన్ 50, మల్టీప్లెక్స్ లు 75 అదనపు రేటు అన్నమాట.

ఈ విషయంలొ సినిమా రంగంతో సంబంధాలున్న మంత్రి పవన్ కళ్యాణ్ కూడా స్ధిర నిశ్చయంతో వున్నారని తెలుస్తోంది. అదనపు రేట్లు ఎవరు అడిగానా ఇవ్వండి కానీ 50-75 కు మించి వద్దు, అది తన సినిమా అయినా సరే అని పవన్ అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. కొన్నాళ్ల క్రితం సినిమా పెద్దలు పవన్ ను కలిసి వచ్చారు. టికెట్ రేట్ల మీద ఓ నిర్దిష్ట పాలసీ వుండాలని పవన్ అన్నారు. త్వరలో అది రూపొందిస్తారని తెలుస్తోంది.

కానీ ఇలా 50-75 అనే పద్దతిని ఫిక్స్ చేస్తే ప్రేక్షకులకు ఓకె. కానీ చాలా భారీ సినిమాల దోపిడీ సాగదేమో?

13 Replies to “ఇకపై ఏపీలో అడ్డగోలు రేట్లు వుండవా?”

    1. Targeting AA and Jr is very much possible but time will not always favour kootami annaru… That is also true

      Irony is, Mavayya time vachinappudu along with AA and Jr andariki below the belt e kada

      Even in the topic Kootami better than Mavayya!!

  1. సినిమాలమీద రాజకియ్య పెత్తనము ఏంటో నాకు అర్థము కాదు .. రేట్లు పెంచుకోవడానికి ఈ రాజకియ్య లం జ కొ డు కు ల పర్మిషన్ ఎందుకు ? పెట్రోల్ /కరెంటు / చెత్త / వాటర్ / రిజిస్ట్రేషన్ రేట్లు పెంచేటప్పుడు వీళ్ళు జనాల పెర్మిషన్స్ తీసుకొని పెంచుతున్నారా ?

    1. What are you talking Sir? అది మా ఇష్టం. మేం అధికారం లో ఉన్నాం. ఏమైనా చేస్తాం. జనాల పర్మిషన్ అనేది మాకు ఓటు వేసి అధికారం అప్పజెప్పినప్పుడే బై డిఫాల్ట్ గా వచ్చేసింది.

      1. Wrong. Govt failed to curb piracy, the new movie print available on torrents on the same day. To assist the producers, Govt review and increase the hike on cases by case depending on movie budget. The ticket prices are controlled to curb black marketers first, now the piracy. If one has to blame, it is the public first.

        Jagan tried to take revenge with 5rs ticket price, which is a different story altogether.

      2. Wrong. Govt failed to curb piracy, the new movie print available on t0rrents on the same day. To assist the producers, Govt review and increase the hike c@/se by c@/se depending on movie budget. The ticket prices are controlled to curb bl@ck marketers first, now the p!racy. If one has to blame, it is the public first.

        Jagan tried to take revenge with 5rs ticket price, which is a different story altogether.

  2. Next వచ్చే సినిమాలు

    ju ఎన్టీఆర్, దేవర

    నాగ చైతన్య తండేల్

    అల్లు అర్జున్ పుష్ప 2

    వీళ్లంతా టీడీపీ అంటే నచ్చదు

    అందుకే వీళ్ళ సినిమా లకి దెబ్బ కొట్టాలని

    చూస్తున్నారు

  3. Kootami will not put finger in film industry business. They are pro development and pro business. If Pawan sir tickets are put on auction then tickets will sell for more than ten thousand rupees also. Sir, dont regulate ticket rates sir.

  4. Kootami government will not put finger into this. They are pro film industry. We fans want collections to be high so that stars will be able to make bigger movies.

Comments are closed.