విపత్తు కాటేసినా వీడని మౌనం!

ఎన్నికల్లో ఓడిపోయిన బాధను కేసీఆర్ ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడా? ఆ బాధను, దిగులును ఇంకా మోసుకొని తిరుగుతున్నాడా? అంటే అవుననే చెప్పుకోవాలి. ఆయన వైఖరి చూస్తుంటే అలాగే ఉంది. ఎందుకంటే ఆయన చాలా కాలంగా…

ఎన్నికల్లో ఓడిపోయిన బాధను కేసీఆర్ ఇంకా అనుభవిస్తూనే ఉన్నాడా? ఆ బాధను, దిగులును ఇంకా మోసుకొని తిరుగుతున్నాడా? అంటే అవుననే చెప్పుకోవాలి. ఆయన వైఖరి చూస్తుంటే అలాగే ఉంది. ఎందుకంటే ఆయన చాలా కాలంగా ఫామ్ హౌజ్ నుంచి బయటకు రావడంలేదు. అసలు ఆయన మౌనం వీడటంలేదు.

మామూలు రోజుల్లో మాట్లాడకపోతేపోయాడు. కానీ రాష్ట్రం భారీ వానలతో అతలాకుతలమవుతోంది. కనీవినీ ఎరుగని నష్టం కలిగింది. పంటలు దెబ్బ తిన్నాయి. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగాయి. ఇలాంటి సమయంలో కేసీఆర్ లాంటి నాయకుడు ఏం చేయాలి? ఈ సమయంలో మరో నాయకుడు ఏం చేసినా చేయకపోయినా మనకు అనవసరం.

కానీ కేసీఆర్ ఎవరు? ఒంటి చేత్తో తెలంగాణ సాధించానని చెప్పుకుంటున్న నాయకుడు. రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రే కాకుండా రెండుసార్లు ముఖమంత్రిగా చేసిన నాయకుడు. జాతీయ రాజకీయాల్లోకి దూకేసి గాయిగాత్తర లేపి దేశం దశను దిశను మార్చాలని ఉబలాటపడిన నాయకుడు. తెలుగు, ఇంగ్లిష్ అండ్ ఉర్దూ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన నాయకుడు.

ఎంతటివారినైనా ఎదిరించగల నాయకుడు. లక్షో, ఎనభై వేలో పుస్తకాలు చదివిన ఫెరోషియస్ రీడర్. భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులను డిజైన్ చేయగల ఇంజనీర్. ఒక్క మాటలో చెప్పాలంటే సర్వ శక్తిమంతుడు. అంతటి కేసీఆర్ విపత్తు సమయంలో తనకేమీ పట్టనట్లు మౌనంగా ఉండటమేమిటి? ప్రస్తుతం ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. సీఎంతో సమానమైనవాడు. ఇలాంటి కేసీఆర్ ఈ సమయంలో ఎంతటి బాధ్యతగా వ్యవహరించాలి?

బాధితుల మధ్యకు రావాలి కదా. వరద ప్రాంతాల్లో పర్యటించాలి కదా. బాధితులను ఓదార్చాలి కదా. వారికి ధైర్యం చెప్పాలి కదా. తన పార్టీని కూడా సహాయక చర్యల్లో ఇన్వాల్వ్ చేయాలి కదా. ప్రభుత్వం సరిగా స్పందించకపోతే కడిగిపారేయాలి కదా. కానీ ఇదేమీ చేయకుండా అధికారం పోయిందని ఆవేదన చెందుతూ కూర్చుంటే ఎలా ? తన కుర్చీలో తన శత్రువు కూర్చున్నాడని కుతకుతలాడితే ఎలా?

కేసీఆర్ ఫామ్ హౌజ్ నుంచి బయటకు వచ్చి వరద ప్రాంతాల్లో పర్యటించాలని సీఎం రేవంత్ రెడ్డి కోరుతున్నాడు. పొరుగున ఉన్న ఏపీలో కూడా పరిస్థితి దారుణంగా ఉంది. అక్కడ మాజీ సీఎం జగన్ బాధితులను పరామర్శిస్తున్నారు. సహాయ చర్యలను చూస్తున్నాడు. రాజకీయాల్లో జగన్ కంటే కేసీఆర్ సీనియర్ కదా.

అలాంటప్పుడు ఎంత బాధ్యతగా వ్యవహరించాలి? కవితను అరెస్టు చేశారని ధర్నాలకు పార్టీ నాయకులకు పిలుపునివ్వడం కాదు. ఇలాంటి విపత్తు సమయంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునివ్వాలి. గులాబీ పార్టీ నాయకులు దాదాపుగా జనంలో కనబడటంలేదని వార్తలు వస్తున్నాయి. అధినేతే కనబడకుండా ఉంటే నాయకులేం కనబడతారు?

21 Replies to “విపత్తు కాటేసినా వీడని మౌనం!”

  1. ఎక్కింది దిగేలోపు మళ్ళా ఒక రౌండ్ పడిపోతుంటే, జనంలోకి వచ్చే తీరిక, ఓపిక ఎక్కడివి?!

  2. “అక్కడ మాజీ సీఎం జగన్ బాధితులను పరామర్శిస్తున్నారు. సహాయ చర్యలను చూస్తున్నాడు.”

    జోక్ బాగుంది. ‘అక్కడ’ అంటే అన్నయ్య ‘ఎక్కాడా’ అని జనాలు వెతుక్కుంటున్నారు.

    సరిగ్గా చెప్పాలంటే అక్కడ కం.చ.రా. అయినా, ఇక్కడ అన్నయ్య అయినా ఒకటే బాపతు, జస్ట్ ఆలా అదృష్టం కలిసొచ్చి అందలం ఎక్కేసారు. వాళ్ళకి వాళ్ళు సింహాలు అనుకుంటారు కానీ, కం.చ.రా. సింహం ఫార్మ్ హౌస్ లో కూర్చుని పీపాలు ఖాళీలు చేయటం సరిపోతుంది, అన్నయ్య సింహం తాడేపల్లి జూ నుండి బెంగళూర్ జూ కి దాగుడుమూతలు ఆడుకోవటం సరిపోతుంది.

    అప్పుడప్పుడు ఎక్కడైనా శవాలు కనిపిస్తే అప్పుడు బయటకి వచ్చి ఆలా ‘గాండ్రించటం’ అంతే, తర్వాత వాళ్ళ పని వాళ్లదే.

  3. veellanta devuula laga feel avutaru…l a n j a k o d u k u l a k i g u d d a b a l u p u…KCR, KTR, kavita…Harish rao, 1 1 r e d d y…….a n d a r i n i k a l i p i d e n g a r u ……a l i g i m u s u k u k u r c h u n t t e . , …..next time ivi kuda ravu……d a r i d r a m p o t u n d i . .…………

  4. రాకరాకబిడ్డవస్తేనువ్వువీన్నిఇంట్లకెళ్లెల్లుమంటవా… ప్రశాంతంగా ఉండనియ్యవారా బాపుని… బిడ్డమంచిబ్రాండుమందుతెచ్చుంటదితాగితూగనియ్…

Comments are closed.