అధికారుల‌పై ఏడ్పా?

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితుల‌కు సాయం అంద‌క‌పోవ‌డానికి జ‌గ‌న్ భ‌క్త అధికారులే కార‌ణ‌మ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఓ మంత్రి చెప్పార‌ట‌. నిజంగా అదే నిజ‌మే అయితే స‌ద‌రు మంత్రి పేరు రాయ‌క‌పోవ‌డం వెనుక కార‌ణ‌మేంటో అర్థం…

విజ‌య‌వాడ‌లో వ‌ర‌ద బాధితుల‌కు సాయం అంద‌క‌పోవ‌డానికి జ‌గ‌న్ భ‌క్త అధికారులే కార‌ణ‌మ‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడికి ఓ మంత్రి చెప్పార‌ట‌. నిజంగా అదే నిజ‌మే అయితే స‌ద‌రు మంత్రి పేరు రాయ‌క‌పోవ‌డం వెనుక కార‌ణ‌మేంటో అర్థం చేసుకోవ‌చ్చు. ఇది ప‌చ్చి అబ‌ద్ధ‌మ‌ని, అందుకే మంత్రి పేరు రాయ‌లేద‌నే మాట వినిపిస్తోంది.

వైసీపీ హ‌యాంలో ప‌ని చేసిన కొల్లు రఘురామిరెడ్డి, ర‌ఘువీరారెడ్డి, విజ‌య‌రావు, అలాగే ప‌లువురు డీఎస్పీలు, సీఐలు విధులు నిర్వ‌హించిన ప్రాంతంలో స‌మ‌స్య తీవ్రంగా ఉన్న‌ట్టు చంద్ర‌బాబు దృష్టికి మంత్రి తీసుకెళ్లార‌న‌డం గ‌మ‌నార్హం. మ‌రి మిగిలిన ప్రాంతాల్లో ప‌రిస్థితి ఏంటి? స్వ‌యంగా చంద్ర‌బాబే నిరాశ్ర‌యులకు స‌రిగా ఆహార పొట్లాలు అంద‌డం లేద‌ని బాబు తెగ బాధిప‌డిన‌ట్టు ఇదే ప‌త్రిక రాసిన సంగ‌తి తెలిసిందే.

ప్ర‌భుత్వ ఫెయిల్యూర్‌ను జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో ప‌ని చేసిన అధికారుల‌పై వేయాల‌ని అనుకోవ‌డం కంటే దుర్మార్గం ఉంటుందా? అనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మైంది. ప్ర‌తి దానికి ఎవ‌రో ఒక‌రిపై ఇలా సాకులు చెబుతూ, ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టాల‌నే కుట్ర‌లు స్ప‌ష్టంగా బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

వ‌ర‌ద బాధితుల‌కు వాస్త‌వాలంటే తెలియ‌ద‌ని, ప్ర‌భుత్వ పెద్ద‌లు ఇలా త‌మ అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేస్తున్నార‌ని వైసీపీ నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. ప‌ది మందికి సాయం చేయ‌డానికి అధికారం చేతిలో ఉంద‌ని, ఆ ప‌నిలో నిమ‌గ్న‌మైతే మంచిద‌నే మాట వినిపిస్తోంది.

12 Replies to “అధికారుల‌పై ఏడ్పా?”

  1. జగన్ మీద ప్రజల అంత ఆగ్రహం ఉంటుందని, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన కారణాలలో ఒకటి కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై. ప్రజలు ఈ కుల విద్వేషాలపై విసుగు చెంది, జగన్ కోసం ఓట్లు వేసే బదులు, ఈ కుల విద్వేషాలను ప్రోత్సహిస్తున్న జగన్ పార్టీపై మరింత ద్వేషం పెంచుకున్నారు.

    ఇంకో పెద్ద సమస్య అమరావతి రాజధాని అంశం. ప్రజలు తమకు కావలసిన పాఠాలు నేర్చుకున్నారు, కానీ కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీ అనుచరులు తమ సొంత పార్టీకి హాని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఈ ద్వేష వ్యాపారం వల్ల. పార్టీ నిలబడాలంటే కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం తక్షణమే ఆపాలి. వైసీపీ అనుచరులు పెద్దవాళ్లలా ఆలోచించాలి, మంచి మనుషులుగా మారండి, విభజనల్ని ప్రోత్సహించడం మానుకోండి.

  2. “ప్ర‌జ‌ల్ని మ‌భ్య పెట్టాల‌నే కుట్ర‌లు స్ప‌ష్టంగా” – andhra people know who does these..:-)

Comments are closed.