అజయ్ దేవగన్ సినిమాలో ప్రభాస్?

మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు రోహిత్ శెట్టి. ఇప్పుడీ బాలీవుడ్ దర్శకుడి డైరక్షన్ లో ప్రభాస్ నటించబోతున్నాడా? అవుననే అంటోంది బాలీవుడ్. దీనికి వాళ్లు చెబుతున్న లాజిక్ కూడా ఆసక్తికరంగా ఉంది.…

మాస్ మసాలా యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు రోహిత్ శెట్టి. ఇప్పుడీ బాలీవుడ్ దర్శకుడి డైరక్షన్ లో ప్రభాస్ నటించబోతున్నాడా? అవుననే అంటోంది బాలీవుడ్. దీనికి వాళ్లు చెబుతున్న లాజిక్ కూడా ఆసక్తికరంగా ఉంది.

తాజాగా ఓ వీడియో రిలీజ్ చేశాడు రోహిత్ శెట్టి. ఆ వీడియోలో ఓ స్కార్పియో గాల్లో ఎగురుతూ వచ్చి ల్యాండ్ అవుతుంది. అయితే ఇదేదో సినిమా కోసం తీసిన షాట్ అనుకుంటే పొరపాటే. ఆ స్కార్పియోలో హీరో ఉన్నాడని, దీపావళికి ఈ స్కార్పియో నుంచి హీరో దిగుతాడని ప్రకటించాడు.

అయితే ఆ స్కార్పియోలో ప్రభాస్ ఉన్నాడంటూ అతడి ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. దీనికి కారణం, ఆ వీడియోకు బ్యాక్ గ్రౌండ్ లో కల్కి థీమ్ మ్యూజిక్ ను జోడించడమే.

అజయ్ దేవగన్ హీరోగా సింగమ్ ఎగైన్ అనే సినిమాను తెరకెక్కించాడు రోహిత్ శెట్టి. వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన ఈ ఫ్రాంచైజీలోని సినిమాలన్నీ మంచి వసూళ్లు సాధించాయి. దానికి కొనసాగింపుగా తెరకెక్కిన ఈ తాజా చిత్రాన్ని దీపావళికి విడుదల చేయబోతున్నారు.

ఇందులో ఓ కీలక పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నాడనే ప్రచారం నడుస్తోంది. ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుస్తూ కల్కి థీమ్ మ్యూజిక్ తో వీడియో రిలీజ్ చేశాడు దర్శకుడు.

3 Replies to “అజయ్ దేవగన్ సినిమాలో ప్రభాస్?”

  1. జగన్ మీద ప్రజల అంత ఆగ్రహం ఉంటుందని, 175 సీట్లలో కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారని నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ప్రధాన కారణాలలో ఒకటి కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం, ముఖ్యంగా కమ్మ, కాపు కులాలపై. ప్రజలు ఈ కుల విద్వేషాలపై విసుగు చెంది, జగన్ కోసం ఓట్లు వేసే బదులు, ఈ కుల విద్వేషాలను ప్రోత్సహిస్తున్న జగన్ పార్టీపై మరింత ద్వేషం పెంచుకున్నారు.

    ఇంకో పెద్ద సమస్య అమరావతి రాజధాని అంశం. ప్రజలు తమకు కావలసిన పాఠాలు నేర్చుకున్నారు, కానీ కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్న వైసీపీ అనుచరులు తమ సొంత పార్టీకి హాని చేస్తూ ఉన్నారు. ప్రజలు ఇప్పటికే జగన్‌కి ఒక పెద్ద షాక్ ఇచ్చారు ఈ ద్వేష వ్యాపారం వల్ల. పార్టీ నిలబడాలంటే కులం ఆధారంగా ద్వేషాన్ని ప్రోత్సహించడం తక్షణమే ఆపాలి. వైసీపీ అనుచరులు పెద్దవాళ్లలా ఆలోచించాలి, మంచి మనుషులుగా మారండి, విభజనల్ని ప్రోత్సహించడం మానుకోండి.

Comments are closed.