మైండ్ సెట్ మార్చిన బాహుబలి

తనతో పనిచేసిన ప్రతి ఒక్కరిపై తనదైన ముద్ర వేస్తాడు దర్శకుడు రాజమౌళి. కేవలం హీరోలపైన మాత్రమే కాదు, హీరోయిన్లు కూడా రాజమౌళి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇది అలాంటి సందర్భమే. Advertisement కెరీర్ పరంగా…

తనతో పనిచేసిన ప్రతి ఒక్కరిపై తనదైన ముద్ర వేస్తాడు దర్శకుడు రాజమౌళి. కేవలం హీరోలపైన మాత్రమే కాదు, హీరోయిన్లు కూడా రాజమౌళి గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఇది అలాంటి సందర్భమే.

కెరీర్ పరంగా రాజమౌళి తీసిన బాహుబలి సినిమా తన ఆలోచన విధానాన్ని మార్చిందని చెబుతోంది తమన్న. హీరోయిన్ రోల్స్ కోసం మాత్రమే ఎదురుచూస్తున్న టైమ్ లో బాహుబలి ప్రాజెక్టులోకి రాజమౌళి తనను తీసుకున్నాడని, నిజానికి తనది మెయిన్ లీడ్ కాకపోయినా, బాహుబలి చేయడం తన కెరీర్ కు కలిసొచ్చిందని అంటోంది.

“ఒక దశలో గర్ల్ నెక్ట్స్ డోర్ పాత్రలు చేసి విసిగిపోయాను. దీంతో వెంటనే లైన్ మార్చాను. ప్రేక్షకులు ఊహించని పాత్రలు చేయాలని నిర్ణయించుకున్నాను. సినిమాను మలుపుతిప్పే చిన్న పాత్ర అయినప్పటికీ చేయాలని అనుకున్నాను.”

అందుకే బాహుబలి సినిమా చేశానని చెప్పిన తమన్న.. ఆ సినిమాతో తనకు తొలిసారి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందని వెల్లడించింది. బాహుబలి సినిమా తన ఆలోచన విధానాన్ని మార్చిందని, అప్పట్నుంచి పాత్రల లెంగ్త్ చూడడం మానేశానని, ప్రేక్షకులు తన పాత్రను గుర్తుపెట్టుంటారా లేదా అని మాత్రమే ఆలోచిస్తున్నానని వెల్లడించింది.

స్త్రీ-2 సినిమాలో చిన్న పాత్రతో కూడిన స్పెషల్ సాంగ్ చేయడానికి కూడా ఆ ఆలోచనా విధానమే కారణమని అంటోంది మిల్కీ బ్యూటీ. దర్శకుడు వచ్చి సందర్భం చెప్పినప్పుడు, కీలకమైన పార్ట్ లో తన పాత్ర వస్తుందని తెలుసుకున్న వెంటనే సాంగ్ చేయడానికి ఓకే చెప్పానని తెలిపింది.

5 Replies to “మైండ్ సెట్ మార్చిన బాహుబలి”

Comments are closed.