సినిమాల్లో డబుల్ షేడ్స్ ఉంటాయి, డబుల్ గెటప్స్ ఉంటాయి, ద్విపాత్రాభినయాలు కూడా ఉంటాయి. కానీ ఏదో ఒక పాత్ర మాత్రమే అలా కనిపిస్తుంది. కానీ శ్వాగ్ సినిమాలో ప్రధాన పాత్రలన్నీ డబుల్ గెటప్స్ లో ఉంటాయంటున్నాడు శ్రీవిష్ణు.
“సినిమాలో నావి మొత్తం 4 పాత్రలు. ఈ క్యారెక్టర్ల చుట్టూ చాలా గెటప్స్ ఉంటాయి. ఉదాహరణకు సింగ పాత్ర చూసుకుంటే, ఇన్ ఫ్ల్యూయన్సర్ పాత్ర కాబట్టి ట్రెండ్ కు తగ్గట్టు చాలా గెటప్స్ లో కనిపిస్తుంది. నాతో పాటు కీలక పాత్రలన్నీ డబుల్ యాక్షన్ ఉంటాయి. దక్ష, మీరా జాస్మిన్, రీతూవర్మ.. ఇలా అందరూ డబుల్ యాక్షన్. ఒక జన్మలో ఉన్నవాళ్లంతా మరో జన్మలో మళ్లీ పుడతారు. కథను నడిపిస్తుంటారు.”
ఇలా శ్వాగ్ సినిమా కథను చూచాయగా బయటపెట్టాడు హీరో శ్రీవిష్ణు. ఈ సినిమా కోసం తొలిసారి చాలా గెటప్స్ వేశానని, భవభూతి పాత్ర మాత్రం చాలా ఇబ్బందిపెట్టిందని తెలిపాడు. ఆ పాత్ర కోసం ప్రతి రోజూ 4 గంటలు మేకప్ వేసుకోవాల్సి వచ్చిందని, పైగా సమ్మర్ లో అలాంటి పాత్ర వేయడం చిరాకు అనిపించిందని అన్నాడు.
హసిత్ గోలి దర్శకత్వంలో తెరకెక్కింది శ్వాగ్ సినిమా. రీతూవర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో దక్ష, మీరాజాస్మిన్, సునీల్, రవిబాబు కీలక పాత్రలు పోషించారు. వివేక్ సాగర్ సంగీతం అందించిన ఈ సినిమాను అక్టోబర్ 4న విడుదల చేయబోతున్నారు.
vc available 9380537747
rithu all movies ilane untayi enduko
ఆ ఫోటో చూస్తే – సినిమా రిలీజ్ అయ్యాక కలెక్షన్స్ చూసి మొహం ఎలా పెట్టాలో ఇప్పటినుండే ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు
Call boy jobs available 8341510897
ఎన్ని గెటప్స్ ఉన్నా థియేటర్లో చూడం