గేమ్ ఛేంజర్.. ఇంకా అనుమానమేనా?

రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి చాన్నాళ్ల తరువాత ఓ అప్ డేట్ వచ్చింది. సినిమా నుంచి రెండో పాట వస్తుంది అంటూ. నిజానికి ఈ అప్…

రామ్ చరణ్- శంకర్ కాంబినేషన్ లో నిర్మిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా నుంచి చాన్నాళ్ల తరువాత ఓ అప్ డేట్ వచ్చింది. సినిమా నుంచి రెండో పాట వస్తుంది అంటూ. నిజానికి ఈ అప్ డేట్ కోసం ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా విడుదల డేట్ వస్తుందన్నది వారి అంచనా.

నిర్మాత దిల్ రాజు కూడా ఒకటి రెండు వేదికల మీద క్రిస్మస్ కు కలుద్దాం అంటూ స్టేట్ మెంట్ పడేసారు. అందువల్ల వినాయక చవితికి అప్ డేట్ వస్తే డేట్ తోనే వస్తుందని ఫ్యాన్స్ ఎదురుచూసారు.

ఎదురుచూసిన అప్ డేట్ వచ్చింది. కానీ విడుదల డేట్ లేదు. ఫ్యాన్స్ కు ఇప్పుడు అనుమానం తప్పడం లేదు. డేట్ వేయాలి అంటే దర్శకుడు శంకర్ ఓకె అనాలి. డేట్ వేయలేదు అంటే శంకర్ నుంచి ఇంకా అంగీకారం రాలేదనే అనుకోవాలి. నిజానికి వర్క్ విషయంలో సమస్య లేదు. కంఫర్ట్ గానే వున్నారన్నది టాలీవుడ్ వర్గాల బోగట్టా. మరి డేట్ ఎందుకు వేయడం లేదన్నది నిర్మాత దిల్ రాజుకే తెలియాలి.

పాన్ ఇండియా సినిమా కనుక దేశం మొత్తం విడుదల కావాల్సి వుంటుంది. కానీ రెండు నెలలు గ్యాప్ వుండాలి ఓటిటి డేట్ కు, ధియేటర్ డేట్ కు. అలా అయితేనే హిందీ విడుదల వీలవుతుంది. మరి ఓటిటి సంస్థలతో డిస్కషన్లు పెండింగ్ లో వున్నాయా? లేక ఇంకేమైనా కారణం వుందా? ఎందుకు పక్కాగా, అఫీషియల్ గా డేట్ అనౌన్స్ చేయలేదు అన్నది తెలియదు.

ఇదిలా వుంటే గేమ్ ఛేంజ‌ర్ రాకుంటే మైత్రీ నిర్మించిన రాబిన్ హుడ్ వచ్చేయడానికి రెడీగా వుంది.

10 Replies to “గేమ్ ఛేంజర్.. ఇంకా అనుమానమేనా?”

  1. Anyway it is going to be disaster. Ramcharan if interested in his career will move on for next movie. He has to see others like Prabhas and NTR how they are taking up multiple projects at once and getting the stardom.

    1. RC has become more popular in social media & self hype & family gatherings… in stead of acting / choosing more movies.. Like Abhishek Bachchan.. no need for him to act…

Comments are closed.