డబ్బింగ్ చిత్రాలకు బ్యాడ్ టైమ్

ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ సినిమాల తర్వాత టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హవా మొదలైందని చాలామంది అనుకున్నారు. ఆ సినిమాలు వచ్చిన టైమ్ లో కొన్ని స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ…

ప్రేమలు, మంజుమ్మల్ బాయ్స్ సినిమాల తర్వాత టాలీవుడ్ లో డబ్బింగ్ సినిమాల హవా మొదలైందని చాలామంది అనుకున్నారు. ఆ సినిమాలు వచ్చిన టైమ్ లో కొన్ని స్ట్రయిట్ తెలుగు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈ చర్చ మరింత ఊపందుకుంది.

అయితే డబ్బింగ్ సినిమాలకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన సినిమాలు సైతం ఇక్కడ బోల్తా పడుతున్నాయి. మొన్నటికిమొన్న భారతీయుడు-2 వచ్చింది. కొండంత ప్రచారం చేస్తే, గోరంత వసూళ్లు వచ్చాయి. కమల్ హాసన్, శంకర్, సిద్దార్థ్, రకుల్, అనిరుధ్.. ఇలా ఎవ్వరూ కాపాడలేకపోయారు ఈ సినిమాని.

రీసెంట్ గా తంగలాన్ వచ్చింది. ప్రపంచం మొత్తం హిట్టయింది. కానీ తెలుగులో ఫ్లాప్. ఎన్నో ఏళ్ల తర్వాత హీరో విక్రమ్, తెలుగులో గట్టిగా ప్రచారం చేసినప్పటికీ తంగలాన్ వైపు జనం చూడలేదు.

ధనుష్ చేసిన రాయన్ ది కూడా ఇదే పరిస్థితి. తంగలాన్ కంటే ముందు తమిళ్ లో పెద్ద హిట్ ఇది. కానీ తెలుగులో ఏమాత్రం వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇలా చెప్పుకుంటూ పోతే విశాల్ నటించిన రత్నం, విజయ్ ఆంటోనీ చేసిన తుఫాన్, లవ్ గురు లాంటి ఎన్నో సినిమాలు తెలుగులో ఫెయిల్ అయ్యాయి.

ఇప్పుడీ లిస్ట్ లోకి గోట్ కూడా చేరింది. విజయ్ హీరోగా నటించిన ఈ సినిమా తెలుగులో డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది. ఇలా ఈ ఏడాది ఇప్పటివరకు తెలుగులో క్లిక్ అయిన డబ్బింగ్ సినిమాల్ని వేళ్ల మీద లెక్కబెట్టొచ్చు.

5 Replies to “డబ్బింగ్ చిత్రాలకు బ్యాడ్ టైమ్”

  1. అటు అరవగోల ఎక్కువ అయితే, ఇటు తెలుగు వాళ్ళు దాన్ని భరించలేరు. సరే, హిందీ సినిమాలు ఏమైనా తెలుగు డబ్బింగ్ try చేద్దామంటే, వాళ్ళ బిల్డప్ లు అస్సలు తట్టుకోలేము.

Comments are closed.