మార్గదర్శిని టచ్ చేస్తే రామోజీ రావు ఊరుకున్నారా? హైడల్ ప్లాంట్ ను టచ్ చేస్తే రాధాకృష్ణ ఊరుకున్నారా? ఈ ఫైట్ ఈనాటిది కాదు. వైఎస్ వున్నపుడే విజయవాడ సమీపంలో వున్న జ్యోతి రాధాకృష్ణ మినీ హైడల్ పవర్ ప్లాంట్ అనుమతులను రద్దు చేసారు. అప్పటి నుంచి ఫైట్ రగులుతూనే వుంది.
వైఎస్ జమానాలోనే అటు ఈనాడు, ఇటు జ్యోతి యాజమాన్యాలు రెండింటితో యుద్దం మొదలైంది. అప్పటి నుంచి ఆ యుద్దం అలా కొనసాగుతూనే వుంది. అదే యుద్దం 2024లో జగన్ అధికారం కోల్పోవడానికి తన వంతు సాయం చేసింది. అదే యుద్దాన్ని జగన్ అలా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు దీనికి మరింత ఆజ్యం పోసారు.
మార్గదర్శి వ్యవహారంలో జగన్ సాధించింది ఏమైనా వుందా అంటే ఏమీ లేదు. రామోజీ డిపాఙిట్లు వెనక్కు ఇచ్చి, ఆ వ్యాపారం ఆపేయడం తప్ప. ఇప్పుడు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా అదే విధమైన సవాల్ విసురుతున్నారు. తన హైడల్ ప్రాజెక్ట్ కారణంగా విజయవాడ లోతట్టు ప్రాంతాలు మునిగాయి అని రుజువు చేస్తే తన ప్లాంట్ ను మూసేయడమే కాదు, ఫ్రీగా జగన్ కు ఇచ్చేస్తా అంటూ సవాలు విసిరారు. ఎలాగూ రుజువు చేయలేరు అనే ధీమా కావచ్చు.
మొత్తానికి ఇటు ప్రధాన మీడియా అయిన జ్యోతి, ఈనాడుతో ఇక జీవితకాలపు యుద్దానికే జగన్ రెడీ అయిపోయినట్లు కనిపిస్తోంది. అదే విధంగా సదరు రెండు సంస్థలు కూడా జగన్ ను పూర్తిగా రాజకీయంగా అణచివేయాలనే డిసైడ్ అయిపోయాయి. ఇటు అటు ఇద్దరూ యుద్దానికి డిసైడ్ అయ్యే వున్నారు. ఇక ఈ రెండు సంస్థలతో తనకు ప్రమాదం తప్ప అస్సలు ఉపయోగం ఎప్పటికీ లేదని జగన్ కు అర్థం అయిపోయింది. జగన్ వున్నన్నాళ్లు తమకు సామాజిక బంధాలు వున్న తెలుగుదేశం పార్టీకి సమస్యే అని వీళ్లకు తెలిసిపోయింది.
అందుకే జగన్ ను రాజకీయంగా సమాధి చేయాలని వీళ్లు స్థిరమైన అభిప్రాయంతో వున్నారు. వాళ్లను ఢీకొనకుండా, తన పని తాను చేయడం అసాధ్యం అని జగన్ కు అర్థం అయింది. ఈ రెండు మీడియా సంస్థలతో పోరు అంటే తెలుగుదేశంతో పోరులో భాగమే తప్ప వేరు కాదని క్లారిటీ వుంది. అందుకే అదే తీరుగా వెళ్తున్నారు.
అందువల్ల ఈ పోరు ఇక రావణకాష్టంలా ఇలా సాగుతూనే వుంటుంది. జనానికి ఈ పోరు మీద పూర్తి అవగాహన వచ్చే వరకు. వాళ్లు ఎందుకు జగన్ మీద బురద వేస్తున్నారు. జగన్ ఎందుకు వాళ్లని టార్గెట్ చేస్తున్నాడు అనేది పూర్తిగా అర్థం అయ్యే వరకు.
పిచ్చి GA…పచ్చ మీడియా ఎంత పైత్యం చూపినా 2009 లో కూడా YS అధికారంలోకి వచ్చాడు గా GA…. మన అన్నయ్య చేతగాని తనం కి వాళ్ళకు credit ఇవ్వడమే మీ దరిద్రం GA….😂😂
Call boy works 8341510897
vc estanu 9380537747
just saw sakshi eswar rhymes…jokes aside….still any one belives in sakshi!!
lol