తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో భారీ వర్షం పడుతోంది. దీంతో విజయవాడలో వణుకు మొదలైంది. ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలతో మున్నేరువాగుకు వరద పోటెత్తుతోంది. అక్కడి వరద బుడమేరుకు చేరుకుంటోంది. బుడమేరు వరద సహజంగానే విజయవాడకు చేరుకుంటుంది. ఈ విషయం తెలిసిన ప్రజానీకం ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు.
శనివారం మధ్యాహ్నం నుంచి మళ్లీ విజయవాడలో వాన మొదలైంది. ఒకవైపు ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతుండడం, మరోవైపు తామున్న చోట కూడా అదే స్థాయిలో వాన కురుస్తుండడంతో విజయవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఏమవుతుందో అని కలవరపడుతున్నారు.
కాస్త తెరప ఇచ్చిందని, వరద నుంచి ఇళ్లకు జనం చేరుకున్నారు. ఇళ్లను శుభ్రం చేసుకుంటున్న తరుణంలో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. మరోవైపు వరద పెరుగుతుండడంతో ఇళ్లలోకి నీళ్లు వస్తున్నాయని చెబుతున్నారు. ఈ దుస్థితిలో తామెక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నామని బాధితులు అంటున్నారు.
ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా, విపత్తును తట్టుకోవడం సాధ్యమా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇదే రీతిలో వర్షాలు రెండు రోజులు కొనసాగితే మాత్రం భయానకంగా వుంటుందని విజయవాడ వాసులు ఆందోళన చెందుతున్నారు.
నీమ్మల రామానాయుడు మూడు బొక్కలు పుడేచేసాడు ఆంట
needi kuda pudchaalaa..?
vc available 9380537747
Call boy jobs available 8341510897