మత్తు వదిలించేలా వుంది

మత్తు వదలరా సినిమా ఓ డిఫరెంట్ ఫన్ రైడ్. ఇప్పుడు దాని సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ ట్రయిలర్ ను విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ తప్ప మరేం లేదు. దర్శకుడు…

మత్తు వదలరా సినిమా ఓ డిఫరెంట్ ఫన్ రైడ్. ఇప్పుడు దాని సీక్వెల్ వస్తోంది. సీక్వెల్ ట్రయిలర్ ను విడుదల చేసారు. అవుట్ అండ్ అవుట్ ఫన్ రైడ్ తప్ప మరేం లేదు. దర్శకుడు రితేష్ రానా వన్ లైనర్లు, కమెడియన్ల టైమింగ్ ల మీద పూర్తిగా ఆధారపడిపోయినట్లు కనిపిస్తోంది. సత్య టైమింగ్, సునీల్ కామెడీ స్టయిల్ కలిసి ట్రయిలర్ ను పూర్తి ఎంటర్ టైనర్ లా మార్చేసాయి. కథ పెద్దగా కొత్తగా అని ట్రయిలర్ చెప్పడం లేదు. రాంగ్ పర్సన్స్ ఇన్ రైట్ ఆపరేషన్ అనే విధంగానే వుంది.

శ్రీసింహా, సత్య కలిసి టోటల్ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నట్లు కనిపిస్తోంది. సునీల్ ఈసారి యాడెడ్ అట్రాక్షన్. హీరోయిన్ ఫరియా కు కూడా ట్రయిలర్ లో స్పేస్ వుంది కానీ హీరోతో కాదు. ఓ కొలీగ్ గా. ట్రయిలర్ కట్ అయితే కన్ఫ్యూఙన్ డైలాగ్ కామెడీతో చూడగలిగేలా వుంది. మత్తు వదలరా తరువాత హీరో శ్రీసింహా కు, దర్శకుడు రితేష్ రానా కు సరైన హిట్ లేదు. హీరోయిన్ ఫరియా సంగతి చెప్పనక్కరలేదు. మైత్రీ సంస్థ సమర్పిస్తున్న ఈ సినిమా వాళ్లకు హిట్ వెలితి తీరుస్తుందేమో.

థియేటర్లు కూడా సరైన సినిమా లేక కిందా మీదా అవుతున్నాయి. మార్కెట్ లో పోటీ లేదు. అందువల్ల ఏమాత్రం బాగున్నా థియేటర్ల మత్తు వదిలించే అవకాశం వుంది.

5 Replies to “మత్తు వదిలించేలా వుంది”

  1. యేమిరా గ్రేట్ ఆంద్ర గ యేపుడు నెగెటివ్ గానే నా అపుడు అపుడు అన్న పాజిటివ్ గా బతకరా

Comments are closed.