ఏసీఏ అధ్య‌క్షుడిగా కేశినేని ఏక‌గ్రీవ ఎన్నిక‌

ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్‌) అధ్య‌క్షుడిగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఎన్నికైన నేప‌థ్యంలో వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం రూ.కోటి విరాళాన్ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మంగ‌ళ‌గిరి,…

ఏసీఏ (ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్‌) అధ్య‌క్షుడిగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఎన్నికైన నేప‌థ్యంలో వ‌ర‌ద బాధితుల స‌హాయార్థం రూ.కోటి విరాళాన్ని ఆయ‌న ప్ర‌క‌టించ‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మంగ‌ళ‌గిరి, క‌డ‌ప క్రికెట్ స్టేడియాల్లో అంత‌ర్జాతీయ మ్యాచ్‌ల‌ను నిర్వ‌హిస్తామ‌ని ఆయ‌న అన్నారు.

కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ఏసీఏ నుంచి వైసీపీ నేత‌ల్ని త‌ప్పించారు. ఏసీఏ అధ్య‌క్షుడిగా వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అల్లుడి అన్న శ‌ర‌త్‌చంద్రారెడ్డి ఉండేవారు. అలాగే ఏసీఏ నిండా విజ‌య‌సాయిరెడ్డి అనుచ‌రులు, మిత్రులు ఉండేవారు. వైసీపీకి చెందిన ఇత‌రులెవ‌రినీ లోప‌లికి రాకుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు.

అందుకే కూట‌మి వ‌చ్చిన వెంట‌నే కేశినేని నేతృత్వంలో ఏసీఏని చేతుల్లోకి తీసుకున్నారు. కేశినేని తాజాగా మీడియాతో మాట్లాడుతూ రాజ‌కీయాల‌కు అతీతంగా ప్ర‌తిభావంతుల్ని ప్రోత్స‌హిస్తామ‌న్నారు. గ‌తంలో మాదిరిగా తాము న‌డుచుకోమ‌న్నారు. గ‌తంలో రాజ‌కీయాలు ఏసీఏని బ‌ల‌హీన‌ప‌రిచాయి. అందుకే వివాదాస్ప‌ద‌మైంది.

కేశినేని చిన్నా నేతృత్వం వ‌హిస్తున్న నేప‌థ్యంలో ఏపీలో క్రికెట్ క్రీడాకారుల‌కు మంచి రోజులొస్తాయ‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది. గ‌తంలో మాదిరిగా రాజ‌కీయ కార‌ణాల‌తో క్రీడాకారుల‌ను తీసుకోవ‌డం, ప‌క్క‌న పెట్ట‌డం చేయ‌కూడ‌ద‌నే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

5 Replies to “ఏసీఏ అధ్య‌క్షుడిగా కేశినేని ఏక‌గ్రీవ ఎన్నిక‌”

Comments are closed.