ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని మాజీ ఎంపీ బీదా మస్తాన్‌రావు కలుసుకున్నారు. వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి మస్తాన్‌రావు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాకు చెందిన బీదా మస్తాన్‌రావు సోదరులు మొదటి నుంచి టీడీపీలో ఉంటున్నారు. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి రావడం, విజయసాయిరెడ్డి చొరవతో బీదా మస్తాన్‌రావు అధికార పార్టీలో చేరారు.
ఈ దఫా ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. దీంతో మస్తాన్‌రావు రాజకీయంగా మనసు మార్చుకున్నారు. మళ్లీ ఆయన టీడీపీలో చేరడానికి పావులు కదిపారు. దీంతో మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు ఒకేసారి వైసీపీని , రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నారు. ఇద్దరూ టీడీపీలో చేరడానికి వేగం పెంచారు.
ఈ క్రమంలో బాబును ఆదివారం బీదా మస్తాన్‌రావు కలుసుకోవడం చర్చనీయాంశమైంది. ఇక ఆయన అధికారికంగా టీడీపీలో చేరడమే మిగిలి వుంది. ప్రస్తుతం వరద విజయవాడను ముంచెత్తడంతో , ఆ హడావుడిలో చంద్రబాబు, లోకేశ్ ఉన్నారు. రాజకీయ కార్యకలాపాలను చంద్రబాబు చేపట్టే అవకాశం లేదు. అయితే టీడీపీలో చేరడానికి ముందు, బాబును గౌరవంగా బీదా కలిశారని ఆయన అనుచరులు చెబుతున్నారు. మోపిదేవి కూడా త్వరలో టీడీపీలో చేరనున్నారు.
ఈయన ఒక రోలింగ్ స్టోన్.
మళ్ళీ మారాడని గారంటీ ఏమిటి?
vc available 9380537747
Call boy jobs available 8341510897