తల్లయిన దీపిక పదుకోన్

స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ తల్లయింది. రణ్వీర్-దీపిక దంపతులకు ఆడ బిడ్డ జన్మించింది. పెళ్లయిన ఆరేళ్లకు ఇలా తల్లిదండ్రులయ్యారు దీపిక-రణ్వీర్. Advertisement శుక్రవారం దీపిక-రణ్వీర్ ఇద్దరూ ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ…

స్టార్ హీరోయిన్ దీపిక పదుకోన్ తల్లయింది. రణ్వీర్-దీపిక దంపతులకు ఆడ బిడ్డ జన్మించింది. పెళ్లయిన ఆరేళ్లకు ఇలా తల్లిదండ్రులయ్యారు దీపిక-రణ్వీర్.

శుక్రవారం దీపిక-రణ్వీర్ ఇద్దరూ ముంబయిలోని ప్రముఖ సిద్ధివినాయక ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ రోజు విశ్రాంతి తీసుకొని, నిన్న సాయంత్రం నగరంలోని హెచ్ఎన్ రిలయన్స్ హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. ఈరోజు ఉదయం ఆడ బిడ్డకు జన్మనిచ్చింది దీపిక.

తను గర్భం దాల్చిన విషయాన్ని ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రకటించింది దీపిక. గర్భంతోనే ఆమె కల్కి సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఆ తర్వాత తన ప్రెగ్నెన్సీ ఫొటోషూట్ ఫొటోల్ని కూడా విడుదల చేసింది. సెప్టెంబర్ లో డెలివరీ అనే విషయాన్ని ఆమె అప్పుడే ప్రకటించింది.

2013 నుంచి డేటింగ్ లో ఉన్నారు దీపిక-రణ్వీర్. రామ్-లీలా సినిమా సెట్స్ లో వీళ్లు క్లోజ్ అయ్యారు. 2018లో ఇటలీలో ఈ జంట పెళ్లి చేసుకొని భార్యాభర్తలుగా మారారు. ఇప్పుడు తల్లిదండ్రులయ్యారు.

త్వరలోనే వీళ్లు తమ కూతురితో కొత్త ఇంట్లోకి మారబోతున్నారు. బాంద్రాలోని ఓ ఖరీదైన అపార్ట్ మెంట్ లో ఫ్లాట్ ను వీళ్లు కొనుగోలు చేశారు. షారూక్ ఉంటున్న మన్నత్ కు పక్కనే ఇది ఉంది. ఇందులో 16 నుంచి 19వ ఫ్లోర్స్ వరకు వీళ్లు కొనుగోలు చేశారు.

2 Replies to “తల్లయిన దీపిక పదుకోన్”

Comments are closed.