దేవర.. నిడివి మీద కుస్తీ!

ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా లాస్ట్ మినిట్ లో నిడివి ఎక్కువైందనే వార్తలే. భారీ సినిమా అంటే చాలు దాదాపు మూడు గంటలు వుండాల్సిందే. సరిపోదా శనివారం లాంటి సినిమాకు కూడా నిడివి…

ఈ మధ్యకాలంలో ఏ సినిమా చూసినా లాస్ట్ మినిట్ లో నిడివి ఎక్కువైందనే వార్తలే. భారీ సినిమా అంటే చాలు దాదాపు మూడు గంటలు వుండాల్సిందే. సరిపోదా శనివారం లాంటి సినిమాకు కూడా నిడివి ఎక్కువే. చాలా ఫుటేజ్ ను ఎడిట్ రూమ్ లోనే వదిలేసారని గుసగుసలు వున్నాయి. కాస్త పేరున్న దర్శకులంతా తమ చిత్తానికి సినిమా తీసేసి తరువాత ఎడిట్ రూమ్ లో వదిలేస్తున్నారు. దాని వల్ల నిర్మాతలకే కదా నష్టం.

సరే, ఈ సంగతి అలా వుంచితే ఈ నెలలో రాబోతున్న ‘దేవర’ సినిమా విషయంలో కూడా నిడివి మీద కసరత్తు మొదలైందని తెలుస్తోంది.

దేవర కథ ఒక్క భాగంలో చెప్పడం కష్టం అని డిసైడ్ అయిన తరువాతే దర్శకుడు కొరటాల శివ రెండు భాగాలు చేసారు. అందువల్ల నిజానికి నిడివి సమస్య రాకూడదు. తొలిభాగాన్ని ఎక్కడ ముగించాలన్న క్లారిటీ వుండే వుంటుంది. పైగా పెద్దగా పాటలు లేవు. ఈ మధ్య వదిలిన పాటను కూడా తీసుకెళ్లి వర్కింగ్ టైటిళ్ల మీద పెట్టేసారు. అలా ఓ అయిదు నిమషాలు నిడివి తగ్గినట్లే.

దేవర సినిమా ఫైనల్ కట్ నిడివి తొలిభాగం మూడు గంటల పది నిమిషాల వరకు వచ్చిందని, దీనికి రెండు గంటల యాభై నిమిషాల మేరకు తగ్గించాయిచే ప్రయత్నాలు జ‌రుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ఇది ఎంత వరకు నిజ‌మో కానీ మూడు గంటల పది నిమిషాలను రెండు గంటల యాభై నిమిషాలు చేయడం అంటే కాస్త కష్టమైన టాస్క్ నే.

దర్శకుడు కొరటాల ఈ టాస్క్ ను ముగించాలంటే సులువైన మార్గం ఒకటే. కొన్ని షాట్స్ ను రెండో భాగానికి మార్చడం. కానీ అలా చేయాలంటే కథలో జంప్ లు వచ్చే ప్రమాదం వుంది. అలాంటివి వుండకుండా, నిడివి పెరగకుండా చూడడం అంటే అంత సులువైన పని కాదు. కొరటాల ఏం చేస్తారో చూడాలి.

4 Replies to “దేవర.. నిడివి మీద కుస్తీ!”

Comments are closed.