అంతా తూచ్ అన్న హోం మంత్రి అనితమ్మ

ప్రస్తుత ప్రభుత్వం ఏమి జరిగినా గత ప్రభుత్వం నిర్వాకం అని విమర్శలు చేస్తూ వస్తోంది. అదే అలవాటులో పొరపాటుగా జరిగిందా లేక ఏమి జరిగింది అన్నది అలా ఉంచితే జగన్ ప్రభుత్వం తెచ్చిన ఒక…

ప్రస్తుత ప్రభుత్వం ఏమి జరిగినా గత ప్రభుత్వం నిర్వాకం అని విమర్శలు చేస్తూ వస్తోంది. అదే అలవాటులో పొరపాటుగా జరిగిందా లేక ఏమి జరిగింది అన్నది అలా ఉంచితే జగన్ ప్రభుత్వం తెచ్చిన ఒక జీవోను హోం మంత్రి అనిత చదివేశారు. దానిని వినాయకచవితి పండుగ అయిన తరువాత తాపీగా ఆమె మీడియా ముందు చెప్పారు.

ఈలోగా చాలా జరిగిపోయాయి. అనిత మీద కూటమి ప్రభుత్వం మీద విమర్శలు వెల్లువెత్తాయి. తెలంగాణకు చెందిన బీజేపీ నాయకురాలు మాధవీలత అయితే అనితక్కా అంటూ ట్వీట్ చేసి మరీ రచ్చ రేపారు. ఏపీలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవడానికి ఇంత రేటు అని హోం మంత్రి చదివిన జీవోను ఆమె తప్పు పట్టారు.

విద్యుత్తు పర్మిషన్లకు మైకులకు ఇంత మొత్తం చెల్లించాలని ఆమె వెల్లడించిన ఆ వివరాల మీద హిందూ సంఘాలు కూడా భగ్గుమన్నాయి. ఇంతలో టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా ఏమాలోచించిందో ఏమో లేటెస్ట్ గా అనిత మీడియా ముందుకు వచ్చి ఆ జీవో పాతదని 2022లో జగన్ ప్రభుత్వం జారీ చేసినది అని చెప్పారు. తమ శాఖ అధికారులు దానిని ఇవ్వడంతో చదివేశాను అని చెప్పారు.

దీని మీద తమ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని ఎటువంటి రుసుము చెల్లించక్కర్లేదు పండగ అయిన మరుసటి నాడు తాపీగా హోం మంత్రిగారు సెలవించారు. అప్పటికే చలనాలు కట్టి మరీ మండపాలు పెట్టుకున్న వారి సంగతి ఏమిటో చెప్పలేదు.

ఇదే ముక్క పండగ ముందు రోజు చెబితే బాగుండేది కదా అని అంతా అంటున్నారు. ఇపుడు మండపాలకు అనుమతి కోసం ఏ రకమైన ఫీజూ వసూలు చేయడం లేదని చెప్పిన హోం మంత్రి గారు కట్టేసిన సొమ్ము వెనక్కి ఇస్తారా అని గణేష్ మండపాల నిర్వాహకులు అడుగుతున్నారు. అయినా ఇంత సీరియస్ మ్యాటర్ ని ఏమీ లేదు అన్నట్లుగా మాట్లాడడం టీడీపీ మంత్రులకే చెల్లింది అని అంటున్నారు.

16 Replies to “అంతా తూచ్ అన్న హోం మంత్రి అనితమ్మ”

  1. Nice covering by Kootami government to escape backlash from public and their partner in government. If previous government issued this GO, why didn’t kootaminparties raise an objection on them and why did notnpublic pay any fees within last year? Atleast have guts to accept mistake and rectify it to make sure it does not repeat. Also, will funds collected from people be refunded and if so by when?

  2. First bring out G.O and reverse it if there is public backlash and if possible blame it on Jagan and use bling supporters and trollers to spread fake propaganda. This is how visionary government should run. Are you listening, Mr. Jagan and Mr. Pavan.

    1. CBN palana raadu kaabatti 3times cm gaa vunnaadu 1999 2014 2024

      CBN leadership qualities known to people

      Jalaga vedhava anthaa panikimaalina vaadu kadu CBN

      Jalaga vedhava oka gajjikukka vaaditho evaroo potthu pettukoru deenki grama simham single simham antoo build up ఇస్తారు YCP dogs

Comments are closed.