విశాఖకు ముప్పు పొంచి ఉందా?

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత రెండు రోజులుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్రను హడలెత్తిస్తున్నాయి. విశాఖలో ఒకే రోజున 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. Advertisement ఏ మాత్రం గ్యాప్ లేకుండా వానలు…

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత రెండు రోజులుగా విశాఖతో పాటు ఉత్తరాంధ్రను హడలెత్తిస్తున్నాయి. విశాఖలో ఒకే రోజున 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.

ఏ మాత్రం గ్యాప్ లేకుండా వానలు విశాఖతో పాటు ఇతర జిల్లాలలో కురుస్తున్నాయి. అవి కూడా భారీ వర్షాలు కావడంతో విశాఖ లోని లోతట్టు ప్రాంతాల ప్రజానీకం ఇబ్బంది పడుతున్నారు.

విశాఖలోని సింహాచలం కొండలను ఆనుకుని ఇళ్లు కట్టుకున్న వారు సైతం ఈ భారీ వానలకు భయభ్రాంతులు అవుతున్నారు. కొండ చరియలు విరిగి పడతాయేమోనని కలవరం చెందుతున్నారు. విశాఖలో కొండలెక్కి ఇళ్ళు కట్టుకున్న వారు అత్యధికులు ఉన్నారు.

భారీ వానలతో కొండల మీద నుంచి జోరుగా వర్షం దిగువకు పారుతోంది. దాంతో పాటు కొన్ని చోట్ల బండరాళ్ళు విరిగి పడుతున్నాయి. దీంతో జనాలు బెంబేలెత్తుతున్నారు. వీటి వల్ల కొన్ని చోట్ల రహదారులలో రాకపోకలకు సైతం ఇబ్బంది ఏర్పడుతోంది.

ఈ నేపధ్యంలో అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. వాయుగుండం కళింగపట్నానికి తూర్పున 240 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం అయి ఉంది.

దీంతో విశాఖ సహా ఉత్తరాంధ్రలో భారీ వర్షాలతో అంతా తడిసి ముద్దయిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండడమే ఇపుడు అవసరం అని అంటున్నారు.

22 Replies to “విశాఖకు ముప్పు పొంచి ఉందా?”

    1. వాతావరణ పరిస్థితులు నీకు నాకు చెప్పి మారాయి కదా

      నెలల క్రితం చెప్పారు. ఈ సారి అనుకోని విధంగా వర్షం పడుతుంది అని కొద్దిగా చదువుకునే అలవాటు వుంటే అర్థం చేసుకోవచ్చు

  1. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పటంలో విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలే భద్రతాపరంగా ఉత్తమమైన నగరాలు అందుకే పరిపాలన రాజధానిగా నిర్ణయించారు. ప్రస్తుతం తాడేపల్లి హైకోర్టు పూర్తిగా మునకకు గురైంది. కర్నూలు జిల్లాలో హైకోర్టు పూర్తిగా సేఫ్

Comments are closed.