వైఎస్సార్ కాంగ్రెస్ ఇంకా కోవర్టుల కోరల్లోనే.. ఎవరు? ఎందరు? ఎక్కడ?

తానే సకలం అన్నట్టుగా వ్యవహరించిన వ్యక్తి.. అధికారంలో ఉన్న వారితో లాలూచీ పడి, కోవర్టుగా మారి సేఫ్ జోన్ సంపాదించుకున్నారేమో అనే అనుమానం

పరాజయం తర్వాత ఆత్మసమీక్ష అనేది తప్పనిసరి. ఆత్మసమీక్ష అంటేనే.. జనాల్ని ఇంప్రెస్ చేయడానికి, మార్కెట్ వేల్యూ పెంచుకోవడానికి చేసే ప్రయత్నం కాదు. మనల్ని మనం సంస్కరించుకోవడానికి చూపించే శ్రద్ధ. ఆత్మసమీక్షలో కూడా నిజాయితీగా లేకపోతే చాలా కష్టం! మంచిని- చెడును నిష్పాక్షికంగా తర్కించి వేరు చేయకపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవు. అలా గుర్తించడంలో ఇప్పటికీ కళ్లకు గంతలు కట్టుకుని ఆటలు ఆడుతూ.. కోవర్టుల కబంధ హస్తాలనుంచి బయటపడకుండా.. ఒంటెత్తు పోకడలతో ముందుకు సాగితే.. ఇంకా గడ్డురోజులు వస్తాయి. జయాపజయాలు అటు ఇటుగా మారుతూ రాజకీయాల్లో పలకరిస్తూ ఉంటాయి. కానీ.. పరాజయం ఎదురైనప్పుడు చేసుకునే ఆత్మసమీక్షలో నిజాయితీ లేకపోతే, ఆ తర్వాతి దశ- పతనం ప్రారంభం అవుతుంది. కోవర్టుల మాయలోంచి బయటపడకపోతే.. పార్టీని చరమాంకం వైపు నడిపిస్తున్నట్టే. జగన్మోహన్ రెడ్డి స్థాపించిన పార్టీ ఇప్పుడు అలాంటి ప్రమాద స్థితిలో ఉంది. ఈ పరిస్థితులపై లోతైన విశ్లేషణే ఈ వారం గ్రేట్ ఆంధ్ర కవర్ స్టోరీ ‘వైఎస్సార్ కాంగ్రెస్ : ఇంకా కోవర్టుల కోరల్లోనే.. ఎవరు? ఎందరు? ఎక్కడ?’

కార్పొరేట్ రంగంలో మనం ఎలా వ్యాపారం చేస్తున్నాం, ఎలాంటి వ్యూహాలతో వ్యాపారాన్ని విస్తరించుకుంటున్నాం.. అనే దాని మీద శ్రద్ధపెట్టడం మాత్రమే కాదు. తమ ప్రత్యర్థి ఎలాంటి వ్యూహాలతో సాగుతున్నాడో నిత్యం గమనిస్తూ ఉండడం చాలా అవసరం. ఇందుకు కార్పొరేట్ వ్యాపార శాస్త్రాన్ని చదువుకునే వారు అనేక మెళకువలు నేర్చుకుంటారు. ఆ క్రమంలో అనైతికమైన దారులు కూడా అనేకం ఉంటాయి. Every thing is fair in love and war అన్నట్టుగా వ్యాపారంలో సాగేది కూడా యుద్ధమే కాబట్టి.. ప్రతి అనైతిక మార్గాన్ని కూడా సమర్థించుకునే ఆత్మవంచన మెళకువలు అనేకం ఉంటాయి.

నిజానికి ఇలాంటి పోటీతత్వం రాజకీయాల్లో కూడా ఉంటే చాలా మంచిది. తమ ప్రత్యర్థి పార్టీ ప్రజలకు ఎలాంటి మేలు చేయాలనుకుంటున్నదో ఎఫ్పటికప్పుడు పసిగట్టడం, లేదా ఎలాంటి ఉద్యమాలు, పోరాటాలతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనుకుంటున్నదో కనిపెట్టడం వంటి ఆలోచనలు ఇతర పార్టీల్లో ఉంటే ఓకే. అల్టిమేట్ గా ప్రజలకు మంచే జరుగుతంది. కానీ.. రాజకీయపార్టీలు కార్పొరేట్ కంపెనీల రూపం సంతరించుకున్న తర్వాత.. ప్రజలకు ఏం చేస్తాం అనే దిశగా కాకుండా.. ఇంకా అనేకానేక విధాలుగా ప్రత్యర్థుల మీద పై చేయి సాధించడానికి ఇక్కడకు కూడా అనైతిక మార్గాలు ప్రవేశిస్తూ వచ్చాయి.

ప్రత్యర్థి పార్టీలలో కోవర్టులను ప్రవేశపెట్టడం.. వారి ద్వారా ఆ పార్టీ ఆనుపానులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం అనేది బహుశా అందరూ అనుసరించే మార్గమే అయి ఉండొచ్చు. కానీ.. ఒక పార్టీయొక్క విధాన నిర్ణయాలు తీసుకునే స్థాయిలోని కీలక వ్యక్తినే కోవర్టుగా మార్చుకుని.. పార్టీ కీలక నిర్ణయాలనే దారి తప్పించడం ద్వారా.. ఏకంగా పార్టీ సర్వనాశనాన్ని శాసించడం అనేది అనూహ్యమైన సంగతి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పతనానికి సంబంధించి ఇప్పుడు అలాంటి అనుమానాలే వస్తున్నాయి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రాంతీయ పార్టీ. అంతకుమించి ఇది వ్యక్తి కేంద్రంగా నడిచే పార్టీ. ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా ఇది నిజం. ఇది జగన్మోహన్ రెడ్డి రెక్కల కష్టం మీద నిర్మాణం అయిన పార్టీ. దానికి వైభవ స్థితి దక్కిందంటే అందుకు కారణం కూడా ఆయనే. అలాగే ఆ పార్టీ పతనం అయితే అప్పుడు మాత్రం ఇతరుల మీదికి నెపం నెట్టడం కరెక్ట్ కాదు.

పార్టీకి ఏకైక పెద్ద దిక్కు వంటి జగన్మోహన్ రెడ్డి, తమకు తగిలిన ఎదురు దెబ్బలకు కూడా పూర్తి బాధ్యత తానే తీసుకోవాలి. పార్టీ దెబ్బతిన్నది అంటే అంతర్గతంగానే అనేకమంది కుట్రలు కూహకాలు అందుకు కారణమై ఉండవచ్చు. కానీ అలాంటి వారిని, అలాంటి కుట్రలను సకాలంలో గుర్తించకపోవడం మాత్రం అధినేత వైఫల్యం అవుతుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామం అదే.

జగన్ తన చుట్టూ ఒక కోటరీని ఏర్పాటు చేసుకొని.. వారిని మాత్రమే తన పంచేంద్రియాలుగా భావించుకుంటూ ప్రపంచాన్ని అనుభూతించడం అలవాటు చేసుకున్నారు. ఆ కోటరీ గతంలో చెప్పినట్టుగా ఆయన చుట్టూ గవాక్షాలు, ద్వారాలు లేని లోహ కుడ్యాలను నిర్మించింది.

జగన్మోహన్ రెడ్డి- తనకు ఒక దఫా అధికారం కట్టబెట్టిన ప్రజలతో మళ్లీ మళ్లీ తానుగా మమేకం కాకుండా.. కోటరీ కళ్ళతో చూశారు. వారి చెవులతో విన్నారు! సదరు కోటరీ పెద్దలు ప్రజలకు పార్టీ అధినేతకు మధ్య తామేసంధానకర్తలుగా ఉంటూ.. అందులో కొంత స్వార్ధాన్ని కూడా మేళవించారు. పార్టీ విస్తృత ప్రయోజనాల కోసం కట్టుబడి ఉండకుండా.. ఎవరైతే తమ స్వార్థాన్ని కూడా అందులోకి చొప్పిస్తారో.. అలాంటి వారిని తమ వ్యూహాలకు అనుగుణంగా లొంగదీసుకోవడం ప్రత్యర్థులకు చాలా సులభం. పర్యవసానంగా నెమ్మది నెమ్మదిగా కోటరీ కీలక వ్యక్తులలో కొందరు కోవర్టులుగా మారిపోయారా అనే అనుమానం ప్రజలకు ఇప్పుడు కలుగుతోంది.

కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జారుడు మెట్ల మీద ఉన్నట్టుగా ఒక్కొక్క మెట్టుగా దిగుతుండడం మాత్రమే ఇందుకు కారణం కాదు. ఎవరిమీదనైతే అనుమానాలు ఉన్నాయో.. వారు మారిన పరిస్థితుల్లో కూడా చాలా సేఫ్ జోన్ లో ఉండడం కూడా ఇందుకు కారణం! రాష్ట్రంలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం మారిన తర్వాత.. వైసీపీ లో ఒక్కొక్కిరినీ దారుణంగా టార్గెట్ చేస్తూ ఇబ్బందుల పాల్జేయడానికి స్కెచ్ లు వేస్తుండగా.. పార్టీలో ఎంతో కీలకమైన, ఎన్నో కీలక ఆరోపణలలో పాత్రగా కూడా కనిపించే కొందరు పెద్దలకు మాత్రం అలాంటి ‘సేఫ్ జోన్’ ఎలా లభిస్తుంది? అదే ప్రజల సందేహాలకు కారణం.

సలహాదారులు చేసిన చేటు చాలానే ఉంది!

వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి వైఎస్సార్ లాగానే ఆశ్రిత పక్షపాతి. కానీ, ఆ పక్షపాతాన్ని ప్రదర్శించడంలో ఇద్దరి మధ్య హస్తిమశకాంతంరం అనదగినంతటి వ్యత్యాసం ఉంది. ఇద్దరూ ఆశ్రయించిన వారికి అడ్డగోలుగా, అడ్డదారుల్లో అయినా మేలు చేయడానికి వెనుకాడని నేతలు. కానీ తేడా ఏంటంటే.. వైఎస్సార్ తనను ఆశ్రయించిన వారికి ఓ పది కోట్ల లబ్ధి చేకూర్చాలనుకుంటే.. ఆ మాత్రం గిట్టుబాటు అయ్యేలా వారికి ఏదో ఒక కాంట్రాక్టులు అప్పగించి అక్కడితో చేతులు దులిపేసుకునేవారు. అక్కడితో తనను ఆశ్రయించి బతుకుతున్నందుకు తాను చేయగలిగిన మేలు పూర్తయ్యేది.

కానీ, జగన్మోహన్ రెడ్డి కాంట్రాక్టులు లాంటి భారీ వ్యవహారాలన్నీ సెంట్రలైజ్ చేశారు. అవన్నీ కూడా ఒక కోటరీలోని వారికి మాత్రమే ఇస్తూ ఆరూపంలో మరిన్ని అనుమానాలు పుట్టే వాతావరణాన్ని తానే సృష్టించుకున్నారు. కాంట్రాక్టు పనుల మార్గాలు ఆ రకంగా మూసుకుపోగా.. ఇక ఆశ్రితులకు మేలు చేయడం ఎలాగ? అందుకోసం ఆయన ఎన్నుకున్న మార్గం.. సలహాదారు పోస్టులు! లక్షల్లో వేతనాలు.. లక్షలకు మించి అనుభవించగల హోదా కూడిన వైభోగాలు.. ఇవన్నీ వారికి కట్టబెట్టారు. ఈ రూపంలో వారికి కూడా ప్రభుత్వం సొమ్ము ధారాదత్తం చేసేలా తను అనుకున్నది చేసేశారు. కానీ.. ఆయనకు తెలియకుండానే ఈ విధానంలో మరో సంకేతాలు ప్రజలకు వెళ్లాయి.

సలహాదారులు అనే ముద్రతో ఉన్న వారందరూ జగన్ కు సన్నిహితులు, వారి మాట ఆయన వింటారు.. వారిని ఆశ్రయిస్తే తమ కార్యం నెరవేరుతుంది.. అని దళారీలు ఊహించుకోవడం, అందుకు ప్రయత్నించడం చాలా సహజంగా జరిగింది. వైఎస్సార్ ఆశ్రితులకు మేలు చేయడంలో ఇలాంటి ‘సైడ్ ఎఫెక్ట్’ లేదు! జగన్ విధానంలోని సదరు ‘సైడ్ ఎఫెక్ట్’ ఇప్పుడు పార్టీని చాలా కుంగదీసింది.

‘జగన్ కు దగ్గర’ అనే ప్రచారాన్ని మరింత ముమ్మరంగా సాగించుకుంటూ.. ఆ ప్రచారాన్నే తమ దందాలకు, స్వప్రయోజనాలకు మూలఇంధనంగా వాడుకున్న వారు కోవర్టు పనులు చేయరనే గ్యారంటీ ఏముంది?

సేఫ్ జోన్ ఎలా వచ్చింది?

జగన్ కు అత్యంత ఆత్మీయులు అయిన, పార్టీకోసం పరితపించే వారు అయిన, కీలకమైన వ్యక్తులు కొందరు ఇవాళ పరారీలో ఉన్నారు. తలశిల రఘురాం, జగన్ సన్నిహితుల్లో ఒకరు. ఆయనతో పాటు మాజీ మంత్రి జోగిరమేష్, ఎమ్మెల్సీ తలశిల రఘురాం, దేవినేని అవినాష్ అందరూ పరారీలోనే ఉన్నారు. మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిలు మాత్రం పాపం.. కటకటాల వెనుక ఉన్నారు. వీళ్లందరూ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద, చంద్రబాబు నివాసం మీద జరిగిన దాడికి సూత్రధారులుగా ఆ కేసులో కీలక నిందితులు.

కానీ.. ఆ దాడులు జరిగినప్పుడు గానీ, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ దాడుల కేసులను తిరగతోడినప్పుడు మరో పేరు కూడా చాలా ప్రముఖంగా వినిపించింది. కీలక సలహాదారు ఒకరి పాత్ర ఉన్నదని, ఆయన సూచనల మేరకే అంతా జరిగిందని బయటకు పొక్కింది. కానీ.. ఆయన పేరు ఎక్కడా నిందితుల జాబితాలోకి కూడా రాలేదు!

ఇలాంటిదే మరొక ఉదాహరణ. ముంబాయికి చెందిన నటి కాదంబరి జత్వానీతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడు కుక్కల విద్యాసాగర్ అనుచితమైన బంధాన్ని కలిగిఉన్నారు. ఆమె ఆయననుంచి ఎక్కువ ఆశించింది. ఆమెను వదిలించుకోవాలని సదరు విద్యాసాగర్ అనుకున్నారు. ఈ లేకి వ్యవహారంలో ఆయన తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించాలనుకున్నారు. ఆ తర్వాత అది చాలా మలుపులు తిరిగింది. అనేక కొత్తకోణాలు అందులోకి చొరబడ్డాయి.

ఇది విస్తృతంగా ప్రచారంలో ఉన్న, స్థూలంగా అందరూ అనుకుంటున్న సంగతి! అయితే ఈ వ్యవహారంలో.. అసలు సీనియర్ ఐపీఎస్ అధికారుల్ని పురమాయించి.. ఈ స్థాయిలో వారు చెలరేగి పనిచేసేలా మార్గదర్శనం చేసినది కూడా ఒక సలహాదారు పదవిలోని కీలక నాయకుడే అనే ఆరోపణలు బాగా వచ్చాయి. ఆయన పేరు పత్రికల్లో కూడా వచ్చింది. తనను ఇందులో ఇరికిస్తున్నారంటూ వారిపై పరువునష్టం కేసు వేయడానికి కూడా ఆయన సిద్ధమవుతున్నారు.

కేసు విచారణ సాగుతుండగా.. ముగ్గురు ఐపీఎస్ అధికారులుపై ఏకంగా ఉద్యోగాల నుంచి డిస్ మిస్ చేసేలా వేటు పడవచ్చుననే ప్రచారం కూడా జరుగుతోంది. ఇంత జరుగుతున్నా సూత్రధారిగా ముద్రపడిన కీలక సలహాదారు పేరు మాత్రం ఇప్పుడు నెమ్మదిగా సైడ్ లైన్ అయిపోయింది. ఆయన పర్ఫెక్ట్ సేఫ్ జోన్ లోనే ఉన్నారు.

వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ సోషల్ మీడియా విభాగం చాలాకాలం కిందటే గాడితప్పింది. అప్పటిదాకా ఒక ధోరణిలో పార్టీ ఆదరణ పెంచడానికి సాగుతూ వచ్చిన ఆ విభాగం పోకడలు.. సలహాదారు కొడుకు సారథ్యం చేపట్టిన తర్వాత గాడితప్పాయి. అసహ్యకరమైన, చివరికి వైసీపీ వారు కూడా జీర్ణించుకోలేని అనుచితమైన ప్రచారాలతో వారంతా రెచ్చిపోయారు. నిజానికి ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వం మారిన వెంటనే.. అలాంటి ప్రచారాలు సాగించిన వారి భరతం పట్టాలి. జగన్ కూడా తనకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో జరిగే ఏ చిన్న వ్యతిరేక ప్రచారాన్ని కూడా విడిచిపెట్టకుండా అప్పట్లోకేసులు పెట్టించారు. కానీ.. ఇప్పుడు సదరు సలహాదారు కొడుకైన సారథి మాత్రం ఫక్తు సేఫ్ జోన్ లో ఉన్నారు. ఎక్కడా అతనిని టార్గెట్ చేసినట్టుగా పేరు కూడా వినిపించడం లేదు.

ఇలాంటి నేపథ్యంలో సదరు సలహాదారు, జగన్ ను ప్రభావితం చేయగలిగినంత కీలక వ్యక్తి, తానే సకలం అన్నట్టుగా వ్యవహరించిన వ్యక్తి.. అధికారంలో ఉన్న వారితో లాలూచీ పడి, కోవర్టుగా మారి సేఫ్ జోన్ సంపాదించుకున్నారేమో అనే అనుమానం రాకుండా ఎలా ఉంటుంది? సామాన్యులకు కూడా సందేహం కలుగుతుంది. ఇదంతా కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. కానీ రాజకీయ పార్టీ వంటి ఇలాంటి వ్యవస్థలలో ఒకరిని చూసి మరొకరు చాలా సులువుగా స్ఫూర్తి పొందుతూ ఉంటారు.

ఒక అగ్రనాయకుడు పార్టీకి చేయగలిగినంత నష్టం చేస్తూ, ఆ సంగతిబాహాటంగా కనిపిస్తూనే ఉన్నప్పటికీ.. తాను పార్టీలో అదే కీలక భూమికను నిరంతరాయంగా పోషిస్తున్నప్పడు.. అదే స్ఫూర్తిని .. చిన్న చిన్న ఊర్లలో పనిచేసే నాయకులు, కార్యకర్తలు కూడా తీసుకోరని గ్యారంటీ ఏంటి? అలా పైనుంచి కిందిదాకా వీలుకుదిరిన వాళ్లంతా అధికార పార్టీతో లాలూచీ పడి కోవర్టు కార్యకలాపాలు సాగిస్తే పార్టీ పరిస్థితి ఏమిటి?

అప్పటినుంచి ఇప్పటిదాకా జగన్ చుట్టూ వాళ్లే కనిపిస్తుంటారు. పార్టీ మంచి కోరి, పార్టీకి ఉపయోగపడే మాట, ప్రజాదరణ పెంచే మార్గం అధినేత చెవిలో వేద్దాం అని ఎవరైనా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే అలాంటి వారికి జగన్ వద్ద అపాయింట్మెంట్ కూడా దొరకనివ్వరు! మంచి చేసే వాళ్లు, నిజాయితీగా మాట్లాడే వాళ్లు దగ్గరకు రావడమే పాపం అన్నట్టుగా దూరం పెడతారు. అదే కోటరీ వ్యక్తులు, అదే కోవర్టులు ఇప్పటికీ జగన్ చుట్టూ కీలకంగా కనిపిస్తూ.. పార్టీలో తమకు ఎప్పటికీ ఎదురు లేదనే సంకేతాలు పంపుతుంటారు. ఆ ప్రభావంగా.. ఇక ఈ పార్టీ ఎప్పటికీ దారిలోకి రాదు- అనే అభిప్రాయం నిజంగా అభిమానించే వారికి కలుగుతోంది. వేరే గతిలేక ఒక్కరొక్కరుగా పార్టీకి దూరం అవుతున్నారు.

ఎన్నికల్లో ఓడిపోవడంఅనేది ప్రతి పార్టీకి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే అనుభవమే. కానీ.. వైసీపీ ఓడిపోయిన తర్వాత కేవలం ఈ మూడు నెలల వ్యవధిలో.. తన సొంత పార్టీలోనే బీభత్సమైన స్థాయిలో కొత్త శత్రువులను తయారు చేసుకున్నదంటే.. అందుకు ఈ కోవర్టుల కుట్రలే కారణం.

ఇంకా ఎవరు? ఎందరు? ఎక్కడ?

మనం చెప్పుకున్నది కేవలం ఒక ఉదాహరణ మాత్రమే. ప్రభుత్వం పతనం అయిన తర్వాత.. జగన్మోహన్ రెడ్డి తరఫున ఆయన ఓఎస్డీ ఫోను చేసినా కూడా కనీసం ఆన్సర్ చేయకుండా, జగన్ ను వదిలించుకున్న సలహాదారులు కూడా ఉన్నారు. పార్టీ పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదంటే.. అసలు ఇలాంటి కోవర్టులు ఎవరెవరరో కూడా తెలియని దీనస్థితిలో అధినేత ఉన్నాడు. ముంచుతున్న వారినే.. తన చుట్టూ కోటరీలాగా ఇంకా కొనసాగిస్తున్నాడు. పార్టీ వ్యవస్థలో పైనుంచి కింది వరకు ఎందరు.. ఎక్కడెక్కడ చెదపురుగుల్లాగా నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పార్టీకి చేటు చేస్తున్నారో.. అధినేతకు అంచనా కూడా లేదు.

ఇప్పుడు తీరునే కొనసాగిస్తే.. పార్టీని కాపాడుకోవడం కష్టం అవుతుంది! అనూహ్యమైన రీతిలో చంద్రబాబునాయుడు ప్రభుత్వం వైఫల్యాలను మూటగట్టుకుని, ప్రజలు ఆయన పాలనను ఛీత్కరించుకుంటే జగన్ కు మళ్లీ అవకాశం ఇవ్వదలచుకుంటే తప్ప మళ్లీ అధికారం దక్కదు. అలా కాకుండా.. పార్టీలోని కోవర్టులను ఏరిపారేసుకుంటూ సాగాలి. సేద్యం చేయడంలో కలుపులమొక్కలను ఏరేస్తేనే పైరు దిగుబడి బాగా వస్తుంది. కలుపు మొక్కలకే ఎరువు వేసుకుంటూ ముందుకెళితే ఏమవుతుంది? పార్టీ అధినేతకు ఇంత చిన్న సూత్రం తెలియనిది కాదు!

.. ఎల్. విజయలక్ష్మి

52 Replies to “వైఎస్సార్ కాంగ్రెస్ ఇంకా కోవర్టుల కోరల్లోనే.. ఎవరు? ఎందరు? ఎక్కడ?”

  1. ఎందిరా నాయనా! నీకు సజ్జల బార్గవ్ కి పడుతునట్టు లెదు. మొత్తం మీద సజ్జలని, పిల్ల సజ్జలని కొవర్ట్ అంటావా? పిల్ల సజ్జల పొజిషన్ లొకి నువ్వు వెళ్ళాలి అని చూస్తున్నవా? మొత్తం మీద నీకు అన్ని అర్హతాలు ఉన్నాయి అంటావ్?

  2. నువ్వేమైన తక్కువా, ఎంత నిర్లజ్జ గా సమర్ధించలేదు..నిజమైన అభిమానులు తప్పులు యెత్తి చూపితే వాడి దాకా ఎందుకు..మీరు పబ్లిష్ చేశారా..డిలీట్ చేశారు

  3. ఒకప్పటి వైసిపి అభిమాని నీ, వైసిపి పతనాన్ని టీడీపీ కన్న ఎక్కువగా కోరుకుంటున్న..మీ ఏడుపు చూస్తే కడుపు నిండిపోతోంది..నలంటల్ల ఉసురు మీకు ఇంకా తగుల్తుందిరా..అప్పుడే ఏమైంది.. బొల్లోడు నోట్లో ఇంకా బాగా పెడతాడు..అనుభవించండి పతివ్రత నచ్మి గారు..

  4. ప్రజల పేరు చెప్పే అన్ని మీరు అనేసుకోవటమే..కడప ప్రజలు ఇంకా రాష్ట్ర ప్రజలు చాలా సంతోషం గా ఉన్నారు..దరిద్రుడు పోయాడు అని..పులివెందుల లో ఓటు కి 7000 ఎందుకు ఇవ్వాల్సి వస్తోంది అని కూడా తెలిని సన్నాసికి ఇన్ని రోజులు మేము సపోర్ట్ చేశాము

  5. ఇప్పటికీ అమర్వతి మీద దుష్ప్రచారం చేస్తున్నారు మీరు మారరు అలాగే అసౌ గుడ్ల వెల్లూరు లో కెమెరా లు లేకుండా ఉన్నట్లు పుకార్లు ఇంత కన్నా బెటర్ స్తారటజీ లు లేవు మీకు సన్నసుల్లారా మీరు రాష్ట్రానికి అరిస్తం అని ప్రజలు నమ్ముతున్నారు

  6. యెహే, ఈ సోది అంత వెళ్లి అసలు చెప్పాల్సిన కాండిడేట్ ప్యాలస్ పులకేశి కి చెప్పుకోక, మిగతా వాళ్ళకి చెప్పుకుని ఏం పయోజనం.

  7. పవన్ 6 కోట్లు విరాళం ఇచ్చాడు.

    పవన్ కంటే వందల రెట్లు ఆస్తి పరుడైన జగన్ ఎంత ఇచ్చాడు ? సి*గ్గు సి*గ్గు. షే*మ్ షే*మ్

  8. ఇన్నాళ్లు ఇసుక, మద్యం, మైనింగ్, గంజాయి అమ్మకం, ఇంకా అనేక మార్గాల్లో రోజుకి వెయ్యి కోట్ల టార్గెట్ తో సజ్జలు ద్వారా బాగా దోచుకున్నాడు, ప్యాలస్ పులకేశి.

    అసలు దొం*గ ప్యాలస్ పులకేశి గాడు. వాడి పడేసే బిచ్చం లో గ్రేట్ ఆంధ్ర కి కు కూడా వాటా ఇవ్వాలి,సజ్జలు ప్లెస్ లో గ్రేట్ ఆంధ్ర వుండాలి . అనే దాని కోసమే, ఈ వరస విలాపాలు.

  9. అసలు ” ఆ ముఖ్య సలహా దారుడి” చేతి లో జగన్ ఎందుకు కీలు బొమ్మ అయ్యాడు అంత దారుణం గా

  10. వై.ఎస్. ఆర్.సి.పి. పార్టీ ఇంకా కోవర్టులు….అనే శ్రీమతి/శ్రీ విజయలక్ష్మి గారి ఐటమ్ సూపర్… విశ్లేషణ …జేమ్స్ బాండ్ లా…పెన్ను విరిచి కోవర్టుల కణతల మీద అక్షరాలనే బుల్లెట్లతో పేలని తుపాకీని లోడ్ చేసి ముసుగు దొంగల్ని భయపెట్టేశారు..కానీ, ఇక్కడో మైనస్ పాయింట్ ఏంటంటే…ఇది జగన్ గారికి తెలిసేదెలా..?ఆయానగారు ఈ వెబ్సైట్ చూడరుగా..మరి మీరు ఇంత కష్టపడి రాసింది…గురితప్పిన కాల్పుల్లా అయిపోయింది. ఆ ‘పంచకౌరవులు’ కూడా చూడరు..వారి స్టీల్ చెంచాలు చూసినా వారితో ఊహూ….మరి ఈ లోపాలన్నీ బుడమేరు పొంగులో కొట్టుకుంటూ పులివెందుల చేరాలిసిందేనా? జగన్ గారికి తెలుగు రాదో..లేదా చదవలెరో? అందుకే ఈ సైట్ లో ఇకనుంచి రాసే ‘జగనోపాఖ్యానాలు’ ఆయన నట్టింట్లో ఆయన చేతికో లేక కంటికో తగిలేలా ఉదయం ఇళ్లలో వేసే కొంటె పేపర్ బాయ్ లా..

    ఇందులోని ప్లాటినమ్ కంటే విలువైన విషయాలని జగన్ మైండ్ లోకి నిచ్చెన మీదనుంచి అక్షరం మిస్ కాకుండా చూసేలా చెయ్యండి..అప్పుడే మీ ‘హి’త (‘షి’ త) వచనాలు( వ్యాసం రాసింది ఆడో మగో లేదా పేరుమార్పు తో రాసారో అని అలా అనాల్సివచ్చింది.).

  11. అసలు చేసేది కలుపు మొక్కల సేద్యం అయినప్పుడు వాటిని ఎందుకు పీకుతారు.

    అదో అవి-నీతి వటవృక్షం.

    దాని చుట్టు అల్లుకొన్న తీగల్లాగా సల-హాదారు-లు.

    ఆ -వృక్షం ఆదేశం- లేకుండా కలుపు-మొక్కలు ఏమీ- చేయలేవు.

    తప్పు ముమ్మాటికి-ఆ- వృక్షా-నిదే.

    సందేహం లేదు.

  12. నీ సోది.. గు..ద్ద కాకు లు మింగా…అదొక పార్టీ..వాడొక నాయకుడు..పని పాట లేని సై..కో..గాళ్..గురుంచి ఇంత చాట భారతం ….తూ..

  13. స్కూల్ పిల్లలు కూడా తాము దాచుకున్న పాకెట్ మనీ. నీ వరద సహాయం కోసం ఇస్తున్నారు.

    వేల కోట్లు దోచుకున్న ప్యాలస్ పులకేశి గాడు మాత్రం ఒక్క రూపాయి, కనీసం సొంత పార్టీ కార్య కర్తలు కూడా ఇవ్వలేదు. బెవ*ర్స్ గాడు అంటే వాడే. సొంత అమ్మ చెల్లి ఆస్తులు కూడా కా*జేశా డు.

    దొరికితే ఫ్రీ గా ప్రజల పెం*ట కూడా తినేస్తాడు.

  14. ప్రజల ఆస్తులను పెం*ట లాగ నాకేసి, ఇపుడు వరద వస్తె, కనీసం సొంత పా*ర్టీ కార్య కర్తలు కి అయిన ఒక్క రూ*పాయి కూడా సహా*యం చెయ్యని బె*వర్సు సోం*బెరి ప్యాలస్ పులకేశి గాడు అసలు మనిషి కింద కూడా లెక్క లోకి రాడు. వాడి కోసం చి*డతలు వాయుస్తున్నావ్! ఏంటి కుల*గజ్జి వలన నా!

  15. మన ఎంకటిని డిజిటల్ మీడియా సలహారుగా వేసేస్తే అన్ని సర్దుకుంటాయేమో.. ఏమంటావు ఎంకటి..

  16. do not sugar coat.

    “ఆ కోటరీ గతంలో చెప్పినట్టుగా ఆయన చుట్టూ గవాక్షాలు, ద్వారాలు లేని లోహ కుడ్యాలను నిర్మించింది.”

    its actually jagan who built it and they fulfilled his wish. psyko behavior

  17. Saayiinaadha “మెయిన్ సజ్జలనే..తరువాత yvs..వీరిద్దరూ జగన్ కి చేసిన మెలేమీ లేదు..”

    do not lie to self…jagan actually wanted to run in certain way and sajjala made it happen.

  18. అసలు ఆత్మ ఉంటేగా సమీక్ష చెయ్యటానికి. వాడి కొంపలోనే కోవర్ట్ లు వున్నారు.

  19. అరె వి*జ*య*ల*క్ష్మి *గా ,సలహాదారులే కాస్త బెటర్!! ముందు ఆ పార్టీ ని స్పై*డ*ర్ *సై*కో నుండి కాపాడండి !!

  20. I always wondered if Jagan created the propaganda on Lokesh as Pappu because he is actually a one.

    Because when ycp accuses others, it turned out that they were actually were doing those.

  21. కుల కుష్టు రెడ్లు, హిందూ మత వ్యతిరేకులు, ఉగ్రవాదులు తప్ప ఎవరూ లేరు వైఎస్ఆర్సీపీ లో… చీడ పురుగులు.. థూ..

Comments are closed.