వాళ్ల‌పై దేశ ద్రోహం కేసులు!

ప్ర‌కాశం బ్యారేజీ ఐదు బోట్లు ఢీకొన‌డం రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీసింది. దీని వెనుక వైసీపీ కుట్ర దాగి వుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మొద‌ట అనుమానం వ్య‌క్తం చేశారు. స్వ‌యాన సీఎం నింద…

ప్ర‌కాశం బ్యారేజీ ఐదు బోట్లు ఢీకొన‌డం రాజ‌కీయ ర‌చ్చ‌కు దారి తీసింది. దీని వెనుక వైసీపీ కుట్ర దాగి వుంద‌ని ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మొద‌ట అనుమానం వ్య‌క్తం చేశారు. స్వ‌యాన సీఎం నింద మోపిన త‌ర్వాత‌, పోలీసులు దాన్ని నిజం చేయ‌క ఏం చేస్తారు? బోట్ల‌కు వైసీపీ రంగులుండ‌డంతో, అది వైసీపీ ప‌నే అని మంత్రులన‌డం, పోలీసులు అందుకు త‌గ్గ‌ట్టు కేసులు న‌మోదు చేయ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

ఇప్ప‌టికే ఇద్ద‌రిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేప‌థ్యంలో హోంమంత్రి వంగ‌ల‌పూడి అనిత మీడియాతో మాట్లాడుతూ బోట్ల వ్య‌వ‌హారంపై సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. బోట్ల‌కు వైసీపీ రంగులుండ‌డంతో పాటు ఆ పార్టీ నేత‌లు నందిగం సురేష్‌, త‌ల‌శిల ర‌ఘురాం అనుచ‌రుల బోట్ల‌గా గుర్తించామ‌న్నారు. బ్యారేజీని విధ్వంసం చేయ‌డానికే బోట్ల‌ను వ‌దిలిన‌ట్టు ఆమె ఆరోపించారు.

విచార‌ణ‌లో దోషుల‌ని తేలితే, వారిపై దేశ ద్రోహం కింద కేసులు పెడ‌తామ‌ని మంత్రి అనిత హెచ్చ‌రించ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. బోట్ల‌తో వైసీపీ నేత‌ల‌కు సంబంధం లేక‌పోతే, వాళ్లెందుకు మాట్లాడ్డం లేద‌ని ఆమె ప్ర‌శ్నించారు. ప్ర‌కాశం బ్యారేజీని దెబ్బ‌తీయ‌డానికి వైసీపీ ప్ర‌య‌త్నించింద‌నే ఆరోప‌ణ‌ల వెనుక టీడీపీ భారీ వ్యూహ‌మే ర‌చించింద‌నే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

విజ‌య‌వాడను వ‌ర‌ద ముంచెత్త‌డం, బాధితుల‌ను ఆదుకోవ‌డంలో ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్తాయి. దాని నుంచి ఎలాగైనా బ‌య‌ట ప‌డేందుకు ప్ర‌కాశం బ్యారేజీని బోట్ల‌తో దెబ్బ‌తీయాల‌ని తాము ప్ర‌యత్నించామ‌నే కుట్ర‌ను టీడీపీ నేత‌లు తెర‌పైకి తెచ్చారని వైసీపీ నేత‌లు మండిప‌డుతున్నారు.

14 Replies to “వాళ్ల‌పై దేశ ద్రోహం కేసులు!”

  1. అధికారమున్నోడు బెదిరిస్తాడు… (మానసిక) బలం ఉన్నోడు భరిస్తాడు.

    1. మరి బాబుని అరెస్ట్ చేసినప్పుడు నిరూపించుకోవచ్చు కదా! రోడ్ల మీద పొర్లి పొర్లి ఎందుకు గోల గోల చేశారు?

      1. అది వారికి కదా చెప్పాల్సింది. నాకు చెప్తే ఉపయోగం ఏముంది సర్. నేను చెప్పింది అందరికీ కలిపి. వైకాపా వారికి మాత్రమే కాదు. నేను ఎవరూ శుద్ధపూస అని అనుకోను. అందరూ అందరే.

        1. ఆడ మగ లో ఇద్దరూ సమానమే, కానీ మగవాళ్ళు కొంచెం ఎక్కువ సమానం అని బాపు రమణ గార్ల జోక్ (ఇద్దరిలో ఎవరిది అనేది గుర్తు లేదు )….మీరు కూడా అదే కోవలో వారే, పోతే మీరు ఎవరు ఎక్కువ సమానం అంటారు అనేది మీకు నాకు తెలిసినదే…….. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి, I respect your opinion….

          1. మీరు ఎలా అర్థం చేసుకున్నా… నాకు ఎవరూ ఇష్టం కాదు. మీరు నా కామెంట్స్ చాలా చూడలేదు అనుకుంటా. CBN గారి అరెస్టు టైమ్ లో కూడా నేను దానిని సమర్ధిస్తూ కామెంట్ పెట్టాను. You can still check my old comments. Nenu కేవలం Ga గారి ద్వంద్వ నీతిని విమర్శిస్తాను. అందరూ దొంగలే అని గట్టిగా నమ్మే వాడిని నేను. విగ్రహాల ధ్వంసం విషయంలో జగన్ గారు ప్రభుత్వాన్ని సమర్ధిస్తూ కామెంట్స్ పెట్టాను. You can still check. Again… Naaku అనిపించింది నేను కామెంట్ చేస్తాను. అది మీకు ఇస్టులైన వారికి వ్యతిరేకంగా ఉన్నంత మాత్రానా నాకు అవతలివారి ఎక్కువ సమానం అని కాదు.

  2. ప్రభుత్వం మాత్రమే మారింది , అదికారులు కాదు, గత పరిపాలనలో ఎలా అదికారులు రాజకీయ నాయకులని అరెస్టు చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తారు కానీ అరెస్టు ముందు విచారణ, నిర్ధారణ అనేవి పాటిస్తున్నారు అది గత ప్రభుత్వం లో లేదు, అభియోగం మోపడం అరెస్టు చెయ్యడం అదే జరిగింది.ఇప్పుడు ఆ తప్పులకి మూల్యం చెల్లించుకోవాలి. అది ఎవరైనా సరే. ప్రతిపక్షం ఇప్పుడు తేలు కుట్టిన దొంగలా వుంది.

  3. తప్పకుండా, వాళ్ళ ఉద్దేశ్యం బరాజ్ కి నష్టం చెయ్యాలని ప్రయత్నిస్తే, ఉరి వెయ్యాలి. ఎందుకంటే కొన్ని లక్షలు ఆదివారం అమావాస్య రోజున జల సమాధి అయ్యేవారు.

  4. అసలు బోట్స్ గుద్దితే పిల్లర్స్ కి నష్టం జరిగే అవకాశం వుందా అన్నది ఆలోచించాలి..

    దాదాపు కోటి రూపాయలు ఖరీదు చేసే బోట్ అక్కడే ఉంటే.. దానికి సంబందించిన యజమాని ఎందుకు ఇప్పటివరకు చెప్పలేదు..

Comments are closed.